మేకప్‌లో పవిత్ర గౌడ.. పోలీస్‌ అధికారికి నోటీసులు Pavithra Gowda Seen Wearing Makeup In Custody | Sakshi
Sakshi News home page

మేకప్‌లో పవిత్ర గౌడ.. పోలీస్‌ అధికారికి నోటీసులు

Published Thu, Jun 27 2024 8:27 AM | Last Updated on Fri, Jun 28 2024 11:56 AM

Pavithra Gowda Seen Wearing Makeup In Custody

రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్ర గౌడ (A1) ఉన్నారు. అతని హత్యలో ఆమె కీలకమని పోలీసులు కూడా నిర్ధారించారు. రేణుకాస్వామిని హతమార్చే కుట్రలో ఆమె ప్రధాన కారణమని తెలినట్లు పోలీసుల వాదన ఉంది. రేణుకస్వామి సోషల్‌ మీడియా ద్వారా తనను వేధిస్తున్నట్లు దర్శన్‌తో పవిత్ర చెప్పింది. దీంతో కోపగించిన దర్శన్‌ తన అనుచరులతో రేణుకాస్వామిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 17 మంది  జైలులో ఉన్నారు.

బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నటి పవిత్ర ఉన్నారు. అంతకు ముందు 10 రోజుల పాటు ఆమె పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. జైలుకు వెళ్లకు ముందు విచారణ కోసం ఆమె రోజూ అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేది. విచారణ అనంతరం మడివాలలోని మహిళా కేంద్రంలో ఆమెను పోలీసులు ఉంచేవారు. అలా 10 రోజుల పాటు పవిత్రను పోలీసులు ప్రశ్నించారు.  విచారణ అనంతరం  పవిత్ర గౌడ మేకప్‌తో కనిపించేది. 

పోలీస్‌స్టేషన్‌లో ఆమె కాస్మోటిక్స్ వాడడంపై పెద్ద ఎత్తున చర్చలు ప్రారంభమయ్యాయి. పవిత్ర పెదాలపై లిప్ స్టిక్‌తో పాటు ఆమె మేకప్‌ వేసుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. కన్నడ సోషల్‌ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎతున్న చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ పోలీసుల అదుపులో ఉండగానే ఎలా మేకప్ వేసుకుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

ఆమెకు కాస్మోటిక్స్ మహిళా పోలీసులే అందించారని చర్చ జరుగుతుంది. పవిత్ర గౌడ భద్రత బాధ్యతను విజయనగర పోలీస్ స్టేషన్‌లోని మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. ఆమె ప్రమేయంతోనే ఇదంతా జరిగిందా అనే వాదనలు కూడా వస్తున్నాయి.

ఈ క్రమంలో డీసీపీ గిరీష్ ఈ అంశంలో ఫైర్‌ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితురాలికి లిప్‌స్టిక్‌తో పాటు కాస్మోటిక్స్‌ ఎలా వచ్చాయనేది చెప్పాలని మహిళా పీఎస్‌ఐకి మెమో ఇచ్చారు. అయితే, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. విచారణ సమయంలో  పవిత్ర గౌడ ప్రతిరోజూ మడివాలలోని మహిళా కేంద్రం నుంచి విచారణకు వచ్చేదని, అక్కడే దుస్తులు మార్చుకుని అవకాశాన్ని ఆమెకు అధికారులు కల్పించారని తెలుస్తో​ంది. అక్కడికి ప్రతిరోజు ఆమె కుటుంబ సభ్యులు వచ్చేవారని సమాచారం ఉంది. ఆ సమయంలోనే ఆమె మేకప్‌ వేసుకునే సౌలభ్యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇప్పుడు పవిత్ర గౌడను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. పరప్పన అగ్రహార జైలులో తాజాగా పవిత్ర గౌడ తల్లి, సోదరుడు, కూతురు  ఆమెతో మాట్లాడారు.

పవిత్ర గౌడకు రూ. 2 కోట్లు!
ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్‌ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రేణుకాస్వామి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు  ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న  రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని     తెలిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement