ప్రధాన వార్తలు
బంగ్లాతో మ్యాచ్.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!?
టీ20 ప్రపంచ కప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. సూపర్-8లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొట్టనుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తుంటే.. బంగ్లాదేశ్ సైతం భారత్‌ను ఓడించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. శనివారం మ్యాచ్ జరిగే అంటిగ్వాలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్యూ వెదర్.కామ్ ప్రకారం.. వర్షం పడటానికి 40 శాతం చాన్స్ ఉంది.శనివారం ఉదయం నుంచే తేలికిపాటి జల్లులు కురిసే అవకాశముంది అక్యూ వెదర్ తెలిపింది. కాగా కరేబియన్ దీవుల కాలమానం ప్రకారం భారత్-బంగ్లా మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరోపాయింట్ లభిస్తోంది.చదవండి: IND vs AFG: ఈజీ క్యాచ్ విడిచిపెట్టిన కోహ్లి.. రోహిత్ షాకింగ్ రియాక్షన్!
ఈజీ క్యాచ్ విడిచిపెట్టిన కోహ్లి.. రోహిత్ షాకింగ్ రియాక్షన్!
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీ లీగ్ స్టేజీలో నిరాశపరిచిన కింగ్ కోహ్లి.. ఇప్పుడు సూపర్-8లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.సూపర్-8లో భాగంగా బార్బోడస్ వేదికగా గురువారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. సరిగ్గా 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అఫ్గాన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కోహ్లి కాస్త ఇబ్బంది పడ్డాడు.ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ బ్యాటింగ్ పరంగానే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా నిరాశపరిచాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను కోహ్లి జారవిడిచాడు. ఎన్నో సంచలన క్యాచ్‌లు అందుకున్న కింగ్ కోహ్లి.. ఈ మ్యాచ్‌లో సునాయస క్యాచ్‌ను జారవిడిచడంతో అంతా ఆశ్చ్యర్యపోయారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన చేతులు తలపై పెట్టుకుని షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అదృష్టవశాత్తు కోహ్లి విడిచిపెట్టిన క్యాచ్ పెద్ద కాస్ట్లీగా మారలేదు. ఎందకుంటే ఆ తర్వాతి ఓవరే జద్రాన్(8) అక్షర్‌పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.pic.twitter.com/MkAFbNakRq— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) June 20, 2024
క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. వీడియో వైరల్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం యార్క్‌షైర్, లాంక్షైర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్‌కు సారథ్యం వహిస్తున్న పాకిస్తాన్ ఆటగాడు షాన్ మసూద్ ఒకే బంతికి హిట్ వికెట్‌తో పాటు రనౌటయ్యాడు.కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) నిబంధనల కారణంగా మసూద్ ఔటయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు.అసలేం జరిగిందంటే?యార్క్‌షైర్ ఇన్నింగ్స్ 15వ వేసిన బ్లాథర్విక్ బౌలింగ్‌లో మూడో బంతిని షాన్ మసూద్ రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన మసూద్ తన కాలితో స్టంప్స్‌ను తాకాడు. దీంతో బెయిల్స్ కిందపడిపోయాయి. ఈ క్రమంలో తన ఔట్ అని గ్రహించిన మసూద్.. నాన్‌స్ట్రైకర్ జోరూట్ రన్‌కు పరిగెత్తుకుంటూ వచ్చినప్పటకి తను మాత్రం క్రీజులోనే ఉండిపోయాడు. అయితే అంతలోనే అంపైర్ నో బాల్‌గా సిగ్నల్ ఇవ్వడంతో మసూద్ కూడా నాన్‌స్ట్రైకర్ వైపు పరిగెత్తాడు. కాగా అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్లు వికెట్లను గిరాటేశారు. దీంతో మసూద్ రనౌటయ్యాని నిరాశచెందాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్టు చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్‌గా సిగ్నల్ ఇచ్చి అందరిని గందరగోళానికి గురిచేశాడు. అయితే మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) రూల్స్ ప్రకారమే అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.రూల్స్ ఏం చెబుతున్నాయి..?ఎంసీసీ రూల్ 31.7 ప్రకారం.. అంపైర్ ఔట్ ఇవ్వకుండా బ్యాటర్ తనంతట తానే ఔట్ అయినట్లు తప్పుగా భావిస్తే అంపైర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నాటౌట్ ఇవ్వవచ్చు. మసూద్ విషయంలో కూడా అదే జరిగింది. తన హిట్‌వికెట్ అయ్యాడని భావించిన మసూద్ రన్‌కు పరిగెత్తి మధ్యలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే రనౌటయ్యాడు. కానీ ఉద్దేశపూర్వకంగా మసూద్ అలా చేయలేదని భావించిన అంపైర్ నౌటౌట్‌గా ఇచ్చాడు. అయితే అది నో బాల్ కావడంతో హిట్‌వికెట్‌ను కూడా అంపైర్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో మసూద్ తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs SA: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే Shan Masood steps on his stumps off a no ball, Lancashire take the bails off at the other end - but Masood remained not out under law 31.7 pic.twitter.com/yQG6gP6Rac— Vitality Blast (@VitalityBlast) June 20, 2024
సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే
భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఖారారైంది. ఈ ఏడాది నవంబర్‌లో సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ మెరకు భారత క్రికెట్ బోర్డు(BCCI), దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(CSA)లు సంయుక్తంగా శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశాయి. ఈ టూర్లో భాగంగా సఫారీ గడ్డపై భారత్ నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య నవంబర్ 8న డర్బన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ ఛైర్పర్సన్ లాసన్ నైడూ మాట్లాడుతూ.. "దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తున్న బీసీసీఐకు దన్యవాదాలు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈ సిరీస్ జరిగిన అది అభిమానులకు ఎంతో అనుభూతిని కలిగిస్తోంది. ఈ రెండు క్రికెట్ బోర్డుల మధ్య స్నేహ బంధం ఎల్లప్పుడూ ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాను. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య టీ20 సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని" పేర్కొన్నారు. మరోవైపు భారత్-దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌పై బీసీసీఐ క్యార్యదర్శి జైషా సైతం భారత్- దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌పై సంతోషం వ్యక్తం చేశారు. సంతోషం వ్యక్తం చేశారు. ఇరు జట్ల మద్య పోటీ ఇప్పుడు ఉత్కంఠభరితంగా ఉంటుందని జైషా తెలిపారు. కాగా 2024-2025 హోం సీజన్‌కు సంబంధించి టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో ముగియనుంది.టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ షెడ్యూల్ ఇదే..తొలి టీ20(డర్బన్)-నవంబర్ 8రెండో టీ20(సెయింట్ జార్జ్ పార్క్)- నవంబర్ 10మూడో టీ20(సెంచూరియన్)- నవంబర్ 13నాలుగో టీ20(జోహన్స్‌బర్గ్)- నవంబర్ 15 CSA AND BCCI ANNOUNCE UPCOMING SERIESCricket South Africa (CSA) and the Board of Control for Cricket in India (BCCI) are delighted to confirm the scheduling of yet another thrilling KFC T20 International (T20I) series, which will see India traveling to South Africa in November… pic.twitter.com/6xn8AkpK51— Proteas Men (@ProteasMenCSA) June 21, 2024
Photos
ఈ చిన్నారి ఇప్పుడు టాప్ సెలబ్రిటీ.. కొడుకే తన ప్రపంచం (ఫొటోలు)
‘సూపర్–8’లో భారత్ విజయారంభం..47 పరుగులతో అఫ్గానిస్తాన్ చిత్తు (ఫొటోలు)
మూడో ర్యాంక్‌లో స్మృతి మంధాన (ఫొటోలు)
IPL: వేల కోట్లకు వారసురాలు.. ఇంతకీ ఎవరీ బ్యూటీ? (ఫొటోలు)
ఈ అందమైన జంట ఎవరో గుర్తుపట్టారా? డ్రీమీ వెడ్డింగ్ పిక్స్.. ఫ్యాన్స్ ఫిదా
Sports
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన బుమ్రా.. 24 బంతుల్లో 20 డాట్ బాల్స్
కోహ్లికి 121 మ్యాచ్‌లు అవసరమైతే.. సూర్యకుమార్ కేవలం 64 మ్యాచ్‌ల్లోనే సాధించాడు..!
T20 World Cup 2024 Super 8: అఫ్గాన్‌పై అలవోకగా...
T20 World Cup 2024 Super 8: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా
‘యూరో’ పోరుకు వేళాయె!
వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న దివ్య
సిక్కి–సుమీత్ జోడీ శుభారంభం
సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
No Live Matches Found
Videos
కోహీకి షాక్..ఓపెనర్ గా యశస్వి..?
టీ20 వరల్డ్ కప్‌లో నేటి నుంచి సూపర్-8
టీం ఇండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్..?
సూపర్ 8 కు టీమిండియా..
తిరుగులేని రోహిత్ సేన.. సూపర్ 8 లోకి టీమిండియా..
ట్విట్టర్లో కోహ్లి అరుదైన ఫీట్..
మ్యాచ్ రూపురేఖల్ని మార్చేసిన బుమ్రా
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన భారత్
Ind Vs Pak మ్యాచ్.. 6 ఓవర్లు తరువాత రద్దు..?
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..