Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

French Woman Sues Employer for 20 Year Salary Without Work Check The Full Details
పని చెప్పకుండా జీతం ఇస్తోంది.. కంపెనీపై కేసు పెట్టిన మహిళ

ఆఫీసులో ఏదైనా పని చెబితే తప్పుంచుకోవాలని చూసే ఉద్యోగులు ప్రతి సంస్థలోనూ కొంత మంది ఉంటారు. పని చెప్పకుండా జీతం ఇస్తే చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ పని చేయకుండా 20 సంవత్సరాలుగా జీతం ఇస్తున్న కంపెనీ మీదే ఓ మహిళ కేసు వేసింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? వివరాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.ఫ్రాన్స్‌కు చెందిన లారెన్స్ వాన్ వాసెన్‌హోవ్ అనే మహిళకు తమ కంపెనీ ఎలాంటి పని చెప్పలేదని, అయితే ప్రతి నెలా జీతం మాత్రం ఇచ్చేస్తున్నారని.. సంస్థ మీద దావా వేసింది. 1993లో వాసెన్‌హోవ్‌ను ఫ్రాన్స్ టెలికాం నియమించుకుంది. ఆ తరువాత ఈ కంపెనీని ఆరెంజ్ సంస్థ టేకోవర్ చేసింది.ఆరెంజ్ కంపెనీ టేకోవర్ చేసిన తరువాత వాసెన్‌హోవ్‌కు ఒక వైపు పక్షవాతం, మూర్ఛతో బాధపడుతున్నట్లు తెలుసుకుంది. ఈ కారణంగానే ఆమెకు నచ్చిన ఆఫర్ ఎంచుకోమన్నారు. ఆ సమయంలో ఆమె ఫ్రాన్స్‌లోని మరొక ప్రాంతానికి బదిలీని అభ్యర్థించింది. కానీ తనకు తగిన వర్క్‌ప్లేస్‌ను కంపెనీ ఎంపిక చేయలేకపోయింది. దీంతో ఆమె కోరికను కంపెనీ తీర్చలేకపోయింది.ఫ్రాన్స్‌లోని మరొక ప్రాంతానికి బదిలీ చేయడానికి కంపెనీ సాహసం చేయలేదు, దీంతో ఆమెకు ఎలాంటి పని అప్పగించేలేదు. పని అప్పగించకపోయినా.. జీతం మాత్రం ప్రతి నెల అందించేవారు. ఇలా దాదాపు 20 ఏళ్లుగా తనకు కంపెనీ జీతం ఇస్తున్నట్లు వాసెన్‌హోవ్‌ పేర్కొన్నారు.ఏ పని చేయకుండా జీతం పొందడం అనేది చాలా మందికి కల కావొచ్చు. కానీ వాసెన్‌హోవ్‌కు ఇది నచ్చలేదు. దీంతో ఈమె 2015లో తనపై వివక్ష చూపుతున్నారని ప్రభుత్వానికి & అథారిటీకి ఫిర్యాదు చేసింది. పని చేయకపోవడం ఒక ప్రత్యేక హక్కు కాదు అని ఆమె వాదించింది.వాసెన్‌హోవ్‌ తరపున న్యాయవాది డేవిడ్ నాబెట్-మార్టిన్ కూడా ఒంటరిగా ఉండటం వల్ల ఆమె డిప్రెషన్‌కు లోనయ్యిందని పేర్కొన్నారు. అయితే కంపెనీ ఈమెకు అన్ని పరిస్థితుల్లోనూ అండగా ఉందని, ఆమెకు ఆరోగ్యం కుదుటపడితే అడాప్టెడ్ పొజిషన్‌లో మళ్ళీ విధులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.

Anand Mahindra Tweet About World Highest Railway Bridge
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిపై మొదటి రైలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను దాటిన మొదటి రైలు అంటూ ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. ఇది యోగా దినోత్సవం కాబట్టి, మన మౌలిక సదుపాయాలు సాధ్యమైనంత వరకు ఆకాశం వైపు విస్తరించి ఉన్నాయని సూచించడానికి ఇది సరైన చిత్రం అని ట్వీట్ చేశారు.ఎత్తైన రైల్వే బ్రిడ్జ్భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బిడ్జ్ నిర్మాణం పూర్తయింది. దీనిపైన రైలు బోగీల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ బిడ్జి మీద రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ బిడ్జిని ఇప్పటికే ఇంజినీర్లు, రైల్వే అధికారులు పరీక్షించారు. ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించారు.చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు, పొడవు 1315 మీటర్లు. ఈ బ్రిడ్జి ద్వారా రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసీ మధ్య రైల్వే సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత ఎత్తైన బ్రిడ్జి ఎక్కడా లేదు. కాబట్టి ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా ఇది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.The first train to cross the world’s highest railway bridge—the Chenab Bridge in India.Since it’s Yoga Day, it’s the perfect image to signify that our infrastructure is stretching itself as far towards the skies as possible….🙂pic.twitter.com/T73OnJBGup— anand mahindra (@anandmahindra) June 21, 2024

Citroen C3 Aircross Dhoni Edition launched in India
సరికొత్త ధోని ఎడిషన్.. కేవలం 100 మందికి మాత్రమే

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సిట్రోయెన్ కంపెనీ ఇటీవల 'సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.11.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. ఈ కారును కంపెనీ 100 మందికి మాత్రమే పరిమితం చేసింది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధోని పేరు, 7 నెంబర్ వంటివి ఉండటం చూడవచ్చు.సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్.. కుషన్ పిల్లో, సీట్ బెల్ట్ కుషన్‌లు, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ ప్లేట్లు, ఫ్రంట్ డాష్ కెమెరా వంటివి పొందుతుంది. ఈ కారును కొనుగోలు చేసేవారు ధోని సంతకం చేసిన 'గ్లౌస్' పొందవచ్చు. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 110 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.The C3 Aircross 7 - Dhoni Edition comes with a surprise nobody saw coming. This is your cue to walk into the Citroen showroom to test drive the all new C3 Aircross 7 - Dhoni Edition today! What are you waiting for? #CitroenTeamDhoni #DoWhatMatters pic.twitter.com/ImLotpgvUb— Citroën India (@CitroenIndia) June 18, 2024

Instagram Introduces New Feature Close Friends on Live
ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందటే?

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం 'క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్' అనే సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇప్పటి వరకు లైవ్ స్ట్రీమ్ అనేది ఫాలోవర్స్ అందరికి కనిపించేది. తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ క్లోజ్ ఫ్రెండ్స్‌ జాబితాలో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తుంది.క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో కావలసిన వాళ్ళను యాడ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేయవచ్చు. యూజర్ల భద్రతకు పెద్దపీట వేయడానికి ఇన్‌స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఇన్‌స్టా అకౌంట్ పబ్లిక్ అయితే ఎవ్వరైనా లైవ్ స్ట్రీమింగ్‌లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా.. యూజర్ లైవ్ స్ట్రీమింగ్‌లో ఎవరైతే ఉండాలనుకుంటారో వారిని మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్‌ జాబితాలో యాడ్ చేసుకోవచ్చు.ఇన్‌స్టాగ్రామ్.. క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ అనే సరికొత్త ఫీచర్‌ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా, మెటా ఇన్‌స్టాగ్రామ్‌ను మరింత ప్రైవేట్ ప్లేస్‌గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది నవంబర్‌లో.. గ్రిడ్‌లో పోస్ట్‌లను సన్నిహితులకు మాత్రమే కనిపించేలా చేయడానికి వినియోగదారులను అనుమతించే ఆప్షన్ ప్రవేశపెట్టింది.🚨 NEW 🚨Go Live with your Close Friends to ask for OOTD advice or just chat in real time 🎥✨ pic.twitter.com/wDYjqw1N4f— Instagram (@instagram) June 20, 2024

India Becomes World 3rd Largest Domestic Airline Market Details
బ్రెజిల్‌ను దాటేసిన భారత్.. డొమెస్టిక్ ఎయిర్‌లైన్ మార్కెట్‌లో రికార్డ్

భారతదేశంలో ఏవియేషన్ రంగంలో బలమైన వృద్ధి చెందుతోంది. పది సంవత్సరాల ముందు 5వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎయిర్‌లైన్ మార్కెట్‌.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా అవతరించింది.పది సంవత్సరాల క్రితం భారతదేశం దాదాపు 8 మిలియన్ సీట్లతో అతి చిన్న మార్కెట్‌గా ఉండేది. ఆ సమయంలో ఇండోనేషియా 4వ స్థానంలో,బ్రెజిల్ 3వ స్థానంలో, అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. అయితే ఇప్పుడు భారత్ ఎయిర్‌లైన్ మార్కెట్‌ భారీగా వృద్ధి చెంది బ్రెజిల్‌ను వెనక్కు నెట్టి ఇండియా ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఇండోనేషియా ఐదు, బ్రెజిల్ నాలుగు, అమెరికా రెండు, చైనా మొదటి స్థానాల్లో ఉన్నాయి. కేవలం పది సంవత్సరాల్లో భారాతదేశ ఎయిర్‌లైన్ సీట్ల వృద్ధి రేటు మొదటి ఐదు దేశాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి పెరిగింది.గత 10 సంవత్సరాలలో ఇండిగో మార్కెట్ వాటా రెట్టింపు అయింది. 2014లో 32 శాతం ఉన్న ఇండిగో సామర్థ్యం నేడు 62 శాతానికి చేరింది. ఇండిగో దేశీయ సామర్థ్యం వృద్ధి రేటు వార్షికంగా 13.9 శాతంగా ఉందని తెలుస్తోంది. భారతదేశంలో డొమెస్టిక్ విమానాల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో భారత్ ఈ రంగంలో మరింత వృద్ధి చెందుతుంది.

Nutritionist Asks Swiggy And Zomato To Stop Using Plastic Containers Deepinder Goyal Reply
ఫుడ్ డెలివరీకి ప్లాస్టిక్ కంటైనర్‌లు ప్రమాదం: జొమాటో సీఈఓ రిప్లై ఇదే..

ప్రముఖ న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్ ఎక్స్‌పర్ట్ 'ల్యూక్ కౌటిన్హో' తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ డెలివరీ సర్వేస్ అండ్ రెస్టారెంట్‌ల ద్వారా ప్లాస్టిక్ కంటైనర్‌లను ఉపయోగించడం గురించి తన భయాన్ని తెలియజేసారు. వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్ల వాడకం అనారోగ్యానికి కారణమవుతుందని పేర్కొన్నారు. బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌లను ఫుడ్ డెలివరీ చేయడానికి ఉపయోగించాలని ప్లాట్‌ఫామ్‌లను కోరారు.స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్‌లు.. బయోడిగ్రేడబుల్ నాన్ ప్లాస్టిక్ కంటైనర్‌లలో ఫుడ్ డెలివరీలు జరిగేలా చూడాలని విన్నవించారు. మంచి ఆహారాన్ని మాత్రమే కాకుండా ప్లాస్టిక్ వాడకం నియంత్రించి ఆరోగ్యాన్ని కూడా అందించాలని కోరారు. ప్లాస్టిక్‌లోని వేడి ఆహారాలు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి వెల్లడిస్తూ.. హార్మోన్లు, సంతానోత్పత్తి, ఈస్ట్రోజెన్‌ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని ల్యూక్ కౌటిన్హో పేర్కొన్నారు.కౌటిన్హో సందేశానికి దీపిందర్ గోయల్ రిప్లై ఇచ్చారు. ల్యూక్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మేము చేయగలిగినంత తప్పకుండా చేస్తాము. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌కు ప్రాధాన్యత ఇస్తానని, తద్వారా కౌటిన్హో కోరుకున్న దిశలో అడుగులు వేస్తానని వాగ్దానం చేసారు. దీపిందర్ గోయల్ రిప్లైకు కౌటిన్హో కృతజ్ఞతలు తెలిపారు. నా మాటలను అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by Luke Coutinho - Official (@luke_coutinho)

Stock Market Closing Update 21 June 2024
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 384.83 పాయింట్ల నష్టంతో 77094.10 వద్ద, నిఫ్టీ 109.5 పాయింట్ల నష్టంతో 23457.94 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా నష్టాల్లో ముగిశాయి.టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, హిందాల్కో, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ మొదలైన కంపెనీలు చేరాయి. అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టాటా మోటార్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్కం పెనీలు నష్టాల్లో ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Donald Trump Promises US Green Card For Foreign Graduates
గెలిస్తే గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్.. ట్రంప్ హామీ

భారతదేశంలో మాత్రమే కాకుండా.. చాలా దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో గ్రాడ్యుయేట్ చేయాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు పొందాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.జరగబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే.. అమెరికాలోని కాలేజీల్లో చదువుకుని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాతో పాటే వారికి గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికారిలోకి వచ్చిన మొదటి రోజే ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.కరోనా సమయంలో దీన్ని అమలు చేయలేకపోయామని, ఇప్పుడు కూడా అమెరికా, చైనా నుంచి వస్తున్న విద్యార్థులు వీసా సమస్యల కారణంగా మన దేశంలో ఉండలేకపోతున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని వారు సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.గతంలో అమెరికాలోని విదేశీయలను వెళ్లగొట్టిన ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎన్నికల బరిలో డిగ్గనున్నట్లు సమాచారం. సాధారణంగా వలస విధానం మీద తీవ్రంగా విరుచుకుపడే ట్రంప్.. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి.. తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.అమెరికాలోకి అక్రమంగా చొరబడే వారి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని.. లీగల్​గా అమెరికాలోకి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతంలోని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారుల వల్లే నిరుద్యోగం, నేరాలు, దోపీడీ వంటివి పెరుగుతున్నాయని ట్రంప్ అన్నారు.

Around 450 Litres Of Adulterated Ghee Seized From Jaipur DMart Store
ప్రముఖ మార్ట్‌లో 450 లీటర్ల కల్తీ నెయ్యి

వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్‌లో భారీగా కల్తీ నెయ్యిని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రోవేదిక్ నెయ్యి నాణ్యతపై ఓ కస్టమర్ ఫిర్యాదు చేయడంతో జైపూర్ లోని డీమార్ట్ స్టోర్ లో 450 లీటర్ల కల్తీ నెయ్యిని రాజస్థాన్ ఫుడ్ సేఫ్టీ విభాగం స్వాధీనం చేసుకుంది.జైపూర్ లోని అన్ని దుకాణాలు, గోదాముల్లో ఉంచిన ప్రోవేదిక్ నెయ్యి, సరస్ నెయ్యి నిల్వలను నివేదించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని విక్రయించవద్దని డీమార్ట్ ఏరియా సేల్స్ మేనేజర్‌ను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆదేశించినట్లు ఎన్‌డీటీవీ నివేదిక పేర్కొంది.ప్రాథమిక విచారణలో మాలవీయ నగర్ లోని సూపర్ మార్కెట్ లో నిల్వ ఉంచిన సుమారు 450 లీటర్ల నెయ్యి కల్తీ అని తేలింది. సరస్ నెయ్యి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, అనలిస్ట్ నుంచి కల్తీ నాణ్యతను నిర్ధారించిన అధికారులు సుమారు 40 లీటర్ల నకిలీ సరస్ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నెయ్యిలో ఒకే బ్యాచ్ నంబర్, సిరీస్ ఉన్నట్లు గుర్తించారు. విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా నకిలీ సరస్ నెయ్యి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.

Income Tax Filing 2024 Form 16 how to use it to file returns
IT Returns Filing: ఉద్యోగులకు ఈ ఫారం తప్పనిసరి!

వేతన జీవులకు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఫారం-16 అవసరం. ఇందులో ఉద్యోగుల స్థూల ఆదాయం, నికర ఆదాయం, టీడీఎస్ కు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులకు ఫారం-16 అందింది.కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 జారీ చేయడానికి చివరి తేదీ జూన్ 15. మరోవైపు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఆ తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే పెనాల్టీ, పన్నుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వేతన జీవులు ఇప్పటి నుంచే రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియను ప్రారంభించాలి.రిటర్న్ ఫైలింగ్‌కు ఈ డాక్యుమెంట్లు అవసరంఐటీఆర్‌ దాఖలుకు ఫారం-16తో పాటు వార్షిక సమాచార ప్రకటన(AIS), ఫారం 26ఏఎస్ అవసరం. ఈ మూడు డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ నుంచి ఏఐఎస్, ఫారం 26 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ కావాలి.ఫారం-16 పొందడం ఎలా?మీ కంపెనీ యాజమాన్యం మీకు ఈమెయిల్ ద్వారా ఫారం-16 పంపి ఉండవచ్చు లేదా ఆఫీస్‌ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసి ఉండవచ్చు. ట్రేసెస్ (TRACES)పోర్టల్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ పాన్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించి సైస్‌లో రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత ఆధార్-ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్ ఎంచుకోవచ్చు.ఆదాయపు పన్ను శాఖ మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్‌ వంటి వ్యక్తిగత వివరాలను సరిపోల్చుతుంది. ఇవన్నీ మీ ఆధార్, పాన్ సమాచారంతో సరిపోలాలి. ఈ వివరాలు సరిపోలకపోతే ధ్రువీకరణ ప్రక్రియ ముందుకు సాగదు. వివరాలను సరిపోల్చిన తర్వాత ధ్రువీకరణ విజయవంతమైతే, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత సంబంధిత ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకోవడం ద్వారా ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఫారం-16లో ఏముంటుంది?ఫారం-16లో ఎ, బి అనే రెండు భాగాలుంటాయి. పార్ట్-ఎ లో మీ పేరు, చిరునామా, పాన్, కంపెనీ వివరాలు, టీడీఎస్‌ వంటి వివరాలు ఉంటాయి. ఇందులో ప్రభుత్వానికి జమ చేసిన పన్నుకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. పార్ట్-బి లో మీ జీతం బ్రేకప్ ఉంటుంది. సెక్షన్ 10 కింద మినహాయింపులు ఉంటాయి. వీటిలో లీవ్ ట్రావెల్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్ ఉన్నాయి. చాప్టర్ 6-ఏ కింద కూడా మినహాయింపులు ఉంటాయి.ఫారం-16లో ఇచ్చిన సమాచారాన్ని ఫారం-26ఏఎస్‌తో సరిపోల్చాలి. దీన్ని ఏఐఎస్ తో కూడా సరిపోల్చుకోవచ్చు. డేటాలో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే సరిదిద్దుకోవాలి. దీని కోసం, మీరు మీ కంపెనీ, ఇతర పన్ను మినహాయింపు సంస్థను సంప్రదించవచ్చు. ఫారం-16లో ఇచ్చిన సమాచారానికి, ఐటీఆర్‌లో ఇచ్చిన సమాచారానికి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు నోటీసు రావచ్చు.

Advertisement
 

Business exchange section

Currency Conversion Rate

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 92500.00 1500.00
Gold 22K 10gm 900.00 1000.00 200.00
Gold 24k 10 gm 72440.00 220.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name Rate Change%
Emkay Global Financial Services Ltd 174.7 13.5891
Ramco Systems Ltd 340.9 19.993
Sadbhav Engineering Ltd 34.85 -9.9483
Dangee Dums Ltd 7.95 -11.6667
Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement