రేపు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా? | Is Share Market Closed On June 17 Monday? | Sakshi
Sakshi News home page

రేపు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?

Published Sun, Jun 16 2024 2:43 PM

Is Share Market Closed On June 17 Monday?

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు సోమవారం పనిచేయవు. రోజంతా ఎటువంటి ట్రేడింగ్‌ సెషన్‌లు జరగవు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) జూన్ 17 సోమవారం బక్రీద్ సందర్భంగా మూతపడనున్నాయి.

ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్‌బీ (సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ ఎరాక్టివ్) సెగ్మెంట్లపై ఈ మూసివేత ప్రభావం చూపుతుందని బీఎస్ఈ వెబ్‌సైట్ పేర్కొంది. తిరిగి జూన్ 18న ట్రేడింగ్ పునఃప్రారంభం కానుంది.

ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్) జూన్ 17న ఉదయం సెషన్‌ను మూసివేయనుంది. అయితే సాయంత్రం సెషన్‌లో మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి 11:30/11:55 గంటల వరకు ట్రేడింగ్ కోసం తిరిగి తెరవనున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement