వరల్డ్ ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచ్ ఎప్పుడంటే? | Bajaj CNG Bike Launch On 5th July 2024 By Nitin Gadkari, Check Specifications And Other Details | Sakshi
Sakshi News home page

Bajaj CNG Bike: వరల్డ్ ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?

Published Tue, Jun 18 2024 9:11 PM | Last Updated on Wed, Jun 19 2024 10:41 AM

Bajaj CNG Bike Launch On 5th July 2024

బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్‌జీ బైక్ ఈ నెల 18న లాంచ్ అవుతుందని గతంలో వెల్లడైంది. అయితే ఈ డేట్ ఇప్పుడు జూలై 5కి మారింది. ఇప్పటి వరకు ప్రపంచ మార్కెట్లో సీఎన్‌జీ బైక్ లేదు.

బజాజ్ లాంచ్ చేయనున్న ఈ కొత్త సీఎన్‌జీ 125 సీసీ విభాగంలో లాంచ్ అవుతుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ పేరు 'బ్రూజర్' అని తెలుస్తోంది. ఈ బైక్ సీఎన్‌జీ, పెట్రోల్‌తో నడిచే ప్రపంచంలోనే మొదటి ప్రొడక్షన్ స్పెక్ మోటార్‌సైకిల్. ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. వాహన వినియోగదారులకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

భారతదేశంలో ఇంధన ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలతో పోలిస్తే.. సీఎన్‌జీ ధరలు తక్కువ. కాబట్టి దేశీయ మార్కెట్లో సీఎన్‌జీ బైక్ లాంచ్ అనేది ఆటోమొబైల్ చరిత్రలో ఓ సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. ఈ బైకుకు సంబంధించిన మరిన్ని వివరాలు జూలై 5న వెల్లడయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement