ఈ నెల 29 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం Amarnath Yatra: Security intensified ahead of commencement on June 29 | Sakshi
Sakshi News home page

ఈ నెల 29 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

Published Thu, Jun 27 2024 5:27 PM | Last Updated on Thu, Jun 27 2024 5:41 PM

Amarnath Yatra: Security intensified ahead of commencement on June 29

న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో క‌లిగిన హిందువుల పుణ్య‌క్షేత్రం అమర్‌నాథ్‌ యాత్ర ఈ నెల 29 నుంచి  మొదలు కానుంది.. యాత్రకు ముందురోజు అంటే శుక్రవారం మొదటి బ్యాచ్‌ బేస్‌ క్యాంప్‌ భగవతినగర్‌ జమ్మూ నుంచి బల్తాల్‌, పహల్గామ్‌ బయలుదేరి వెళ్లనున్నాయి. ఈ క్రమంలో బుధవారం జమ్మూలోని సరస్వతి ధామ్‌లో ఇన్‌స్టంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం టోకెన్ల జారీ ప్రారంభ‌మైంది.

తొలిరోజు బల్తాల్, పహల్గాం నుంచి వెళ్లేందుకు సుమారు 1000 టోకెన్లు జారీ చేశారు. యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు భారీగా తరలివచారు. సరస్వతి ధామ్‌కు తెల్లవారుజామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకొని.. క్యూలైన్లలో బారులు తీరారు. భద్రతలో ఎలాంటి లోపం లేకుండా చూసేందుకు భద్రతా బలగాలు మార్క్ డ్రిల్ నిర్వహించి, ఏర్పాట్లను పరిశీలించాయి.

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే వారంతా సాయంత్రం 7గంటల్లోగా భగవతినగర్‌లోని బేస్‌ క్యాంప్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. యాత్ర కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారంతా ఇప్పటికే జమ్మూకు తరలివస్తున్నారు. యాత్రికుల కోసం తక్షణ రిజిస్ట్రేషన్ గురువారం ఉదయం వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, రైల్వే స్టేషన్ సమీపంలోని మహాజన్ హాల్.. అలాగే, పురాణి మండిలోని శ్రీరామ దేవాలయం, గీతా భవన్ (సాధుల కోసం) వద్ద మొదలు కానుంది.

కాగా జ‌మ్మూక‌శ్మీర్ ఉగ్ర‌దాడులు పెరిగిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల  ప్రయాణికుల వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో భద్రతా బలగాలను భారీగా మోమరించారు. డ్రోన్లు, 365 డిగ్రీస్‌ యాంగిల్ సీసీ కెమెరాల సాయంతో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై ప్రతి 500 మీటర్లు, కిలోమీటరుకు సెక్యూరిటీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ 24 గంటలూ సాయుధ సైనికులను మోహరించి తనిఖీలు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement