ప్రతిష్టాత్మక చెస్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న అర్జున్‌ ఎరిగైసి | Arjun Erigaisi Wins Prestigious Stepan Avagyan Memorial Chess Tournament, More Details Inside| Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మక చెస్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న అర్జున్‌ ఎరిగైసి

Published Tue, Jun 18 2024 4:26 PM | Last Updated on Tue, Jun 18 2024 6:10 PM

Arjun Erigaisi Wins Prestigious Stepan Avagyan Memorial Chess Tournament

భారత టాప్‌ రేటెడ్‌ చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌, వరల్డ్‌ నంబర్‌ 4 అర్జున్‌ ఎరిగైసి ప్రతిష్టాత్మక స్టెపాన్‌ అవగ్యాన్‌ మెమోరియల్‌ 2024 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆర్మేనియాలోని జెర్ముక్‌లో జరిగిన ఈ టోర్నీని అర్జున్‌ మరో రౌండ్‌ మిగిలుండగానే గెలుచుకున్నాడు. ఎనిమిదో రౌండ్‌లో తెల్ల పావులతో ఆడిన అర్జున్‌.. రష్యాకు చెందిన వోలోడర్‌ ముర్జిన్‌ను 63 ఎత్తులో చిత్తు చేశాడు. తద్వారా ఐదో స్టెపాన్‌ అవగ్యాన్‌ మెమోరియల్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 

మొత్తం 10 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నీలో అర్జున్‌ ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలువగా.. రెండో స్థానంలో నిలిచిన ముగ్గురు ప్లేయర్లు 4.5 పాయింట్లు సాధించారు. నామమాత్రపు చివరి రౌండ్‌లో అర్జున్‌ లోకల్‌ బాయ్‌ మాన్యుయల్‌ పెట్రోస్యాన్‌తో తలపడతాడు.

ఈ టోర్నీలో అర్జున్‌ నాలుగు విజయాలు, నాలుగు డ్రాలతో తొమ్మిది ఎలో రేటింగ్‌ పాయింట్లు సాధించి, ఓవరాల్‌గా తన రేటింగ్‌ పాయింట్ల సంఖ్యను 2779.9కు పెంచుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (2831.8), హకారు నకమురా (2801.6), ఫాబియానో కరువానా (2795.6) టాప్‌-3లో ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఫాబియానోకు అర్జున్‌కు కేవలం 16 రేటింగ్‌ పాయింట్లే తేడా ఉన్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement