టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024 ఛాంపియ‌న్స్‌గా భార‌త్.. T20 WC 2024: South Africa vs India, Final live updates and highlights | Sakshi
Sakshi News home page

T20 WC 2024: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024 ఛాంపియ‌న్స్‌గా భార‌త్..

Published Sat, Jun 29 2024 6:56 PM | Last Updated on Sun, Jun 30 2024 12:05 AM

T20 WC 2024: South Africa vs India, Final live updates and highlights

IND vs SA T20 WC Final Live Updates:

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024 ఛాంపియ‌న్స్‌గా భార‌త్.. 
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024 ఛాంపియ‌న్స్‌గా టీమిండియా నిలిచింది. బార్బోడస్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్‌.. రెండో సారి టీ20 వరల్డ్‌కప్‌ టైటిల్‌ను ముద్దాడింది. 

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా,  అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. 

భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా,  అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్ల‌తో స‌త్తాచాట‌గా.. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఐదో వికెట్ కోల్పోయిన ద‌క్షిణాఫ్రికా..
ద‌క్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 52 ప‌రుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్‌.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. సౌతాఫ్రికా విజ‌యానికి 23 బంతుల్లో 26 ప‌రుగులు కావాలి.

విజ‌యం దిశ‌గా ద‌క్షిణాఫ్రికా..
15 ఓవ‌ర్లు ముగిసే సరికి ద‌క్షిణాఫ్రికా 4 వికెట్ల న‌ష్టానికి 147 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ 49 ప‌రుగుల‌తో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అత‌డితో పాటు మిల్ల‌ర్‌(14) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. ద‌క్షిణాఫ్రికా విజ‌యానికి 30 బంతుల్లో 30 ప‌రుగులు కావాలి.

 

సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్‌.. స్టబ్స్‌ ఔట్‌
70 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్‌ కోల్పోయింది. 31 పరుగులు చేసిన స్టబ్స్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి క్లాసెన్‌ వచ్చాడు. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ద‌క్షిణాఫ్రికా మూడు వికెట్ల న‌ష్టానికి 81 ప‌రుగులు చేసింది.

6 ఓవ‌ర్ల‌కు సౌతాఫ్రికా స్కోర్‌: 42/2
6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ద‌క్షిణాఫ్రికా రెండు వికెట్ల న‌ష్టానికి 42 ప‌రుగులు చేసింది. క్రీజులో డికాక్‌(20), స్ట‌బ్స్(12) ప‌రుగుల‌తో ఉన్నారు.

సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్‌.. మార్‌క్ర‌మ్ ఔట్‌
ద‌క్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన మార్‌క్ర‌మ్‌.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులో స్ట‌బ్స్ వ‌చ్చాడు.

సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్‌.. హెండ్రిక్స్ ఔట్‌
177 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికాకు ఆదిలోనే బిగ్ షాక్ త‌గిలింది. 4 ప‌రుగులు చేసిన రీజా హెండ్రిక్స్‌.. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు.

2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ద‌క్షిణాఫ్రికా వికెట్ న‌ష్టానికి 11 ప‌రుగులు చేసింది. క్రీజులో డికాక్, మార్‌క్ర‌మ్‌(4) ప‌రుగుల‌తో ఉన్నారు.
ఫైన‌ల్లో చెల‌రేగిన విరాట్ కోహ్లి.. 
ద‌క్షిణాఫ్రికాతో ఫైన‌ల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా అద‌ర‌గొట్టింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి భార‌త్ 176 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 

59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 76 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. విరాట్‌తో పాటు అక్ష‌ర్ పటేల్(47) ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో కేశ‌వ్ మ‌హారాజ్‌, నోర్జే త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జానెస‌న్‌, ర‌బాడ ఒక్క వికెట్ సాధించారు.

విరాట్ కోహ్లి ఫిప్టీ.. 
కీల‌కమైన ఫైన‌ల్లో విరాట్ కోహ్లి ఫామ్‌లోకి వ‌చ్చాడు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 64 ప‌రుగుల‌తో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. 18 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్‌: 150/4

భార‌త్ నాలుగో వికెట్ డౌన్.. అక్ష‌ర్ ప‌టేల్ ఔట్
టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 47 ప‌రుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన అక్ష‌ర్ ప‌టేల్ ర‌నౌట్ రూపంలో ఔట‌య్యాడు. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ 4 వికెట్ల న‌ష్టానికి 118 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(46), దూబే(9) ప‌రుగుల‌తో ఉన్నారు.

12 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 93/3
విరాట్‌ కోహ్లి, అక్షర్‌ పటేల్‌ నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 50 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(41), అక్షర్ పటేల్‌(38) పరుగులతో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న విరాట్‌, అక్షర్‌..
వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత టీమిండియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ లభించిన అక్షర్‌ పటేల్‌ అద్బుతంగా ఆడుతున్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(31), అక్షర్ పటేల్‌(25) పరుగులతో ఉన్నారు.

టీమిండియా మూడో వికెట్ డౌన్‌..
34 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌​ కోల్పోయింది. 3 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్‌.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(22), అక్షర్ పటేల్‌(5) పరుగులతో ఉన్నారు.

భారత్‌కు బిగ్ షాక్‌.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓకే ఓవర్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. కేశవ్ మహారాజ్ వేసిన రెండో ఓవర్‌లో తొలుత రోహిత్ శర్మ ఔట్ కాగా.. అనంతరం రిషబ్ పంత్ పెవిలియన్‌కు చేరాడు. 

3 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(14), సూర్యకుమార్ యాదవ్‌(0) పరుగులతో ఉన్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌
బార్బోడ‌స్ వేదిక‌గా భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా ఫైన‌ల్ మ్యాచ్‌కు విజిల్ మ్రోగింది. ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.

తుది జట్లు
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్‌), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

స్టేడియంకు చేరుకున్న ఇరు జ‌ట్లు
ఇక ఫైన‌ల్ మ్యాచ్ కోసం భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానానికి చేరుకున్నాయి. ప్ర‌స్తుతం ఇరు జ‌ట్లు వామాప్ చేస్తున్నాయి. మరో 30 నిమిషాల్లో టాస్ ప‌డ‌నుంది.

అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. 
భార‌త్-ద‌క్షిణాఫ్రికా ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్‌. ఫైనల్ జరిగే  బార్బోడ‌స్‌లో ప్రస్తుతం ఎటువంటి వర్షం పడడం లేదు. ప్రస్తుతం ఎండకాస్తోంది. దీంతో మ్యాచ్ సజావుగా జరిగే సూచనలు కన్పిస్తున్నాయి.

టైటిల్ పోరులో భార‌త్-ద‌క్షిణాఫ్రికా
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో తుది స‌మ‌రానికి స‌మ‌యం అస‌న్న‌మైంది. బార్బోడ‌స్ వేదిక‌గా టైటిల్‌పోరులో భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మెగా టోర్నీలో ఆజేయంగా నిలిచిన ఇరు జ‌ట్లు.. ఆఖ‌రి పోరులో తాడోపేడో తెల్చుకోనున్నాయి.

 భార‌త్ త‌మ రెండో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ట్రోఫీపై క‌న్నేయ‌గా.. సౌతాఫ్రికా తొలి సారి వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను ముద్దాడాల‌ని ఉవ్విళ్లూరుతోంది. ఇరు జ‌ట్లు స‌మ‌వుజ్జీగా ఉన్నాయి. ఈ టైటిల్ పోరులో ఎవ‌రిది పై చేయో మ‌రి కొన్ని గంటల్లో తేలిపోనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement