ఆవురా... ఎంత క్రమశిక్షణ! Cow waits patiently for traffic light to turn green in Pune | Sakshi
Sakshi News home page

ఆవురా... ఎంత క్రమశిక్షణ!

Published Sun, Jun 30 2024 12:59 AM | Last Updated on Sun, Jun 30 2024 12:59 AM

Cow waits patiently for traffic light to turn green in Pune

వైరల్‌ 

క్రమశిక్షణ తప్పిన వారిని ‘పశువులా ప్రవర్తించకు’ అంటాం. ఈ వైరల్‌ వీడియోను చూస్తే మాత్రం ‘పశువును చూసి నేర్చుకో’ అంటాం. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా ఎడా పెడా దూసుకుపోయేవాళ్లు ఈ వీడియోను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పుణెలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గరకు వచ్చిన ఒక ఆవు ఎరుపురంగు ట్రాఫిక్‌ లైట్‌ను చూసి అడుగు ముందుకు వెయ్యలేదు.

 ట్రాఫిక్‌ లైట్‌ ఆకుపచ్చ రంగులో మారే వరకు ఓపికగా ఎదురు చూసింది. ఆ తరువాతే ముందుకు కదిలింది. మ్యూజిక్‌ జోడించి ఈ వీడియోను పుణె పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. రోడ్డు భద్రత గురించి ప్రచారం చేయడానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. ఆవు క్రమశిక్షణకు ముచ్చటపడిన నెటిజనులు ప్రశంసలతో  ముంచెత్తుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement