మందు మింగడానికి మీ ‘పప్పీ’ మారాం చేస్తోందా? ఇదిగో ఇంట్రస్టింగ్‌ టిప్‌ | How To Give Medicine Creatively To Dogs Check These Interesting Tips In Telugu | Sakshi
Sakshi News home page

మందు మింగడానికి మీ ‘పప్పీ’ మారాం చేస్తోందా? ఇదిగో ఇంట్రస్టింగ్‌ టిప్‌

Published Wed, Jun 12 2024 11:47 AM | Last Updated on Wed, Jun 12 2024 12:46 PM

how to give medication to dogs check these interesting tip

ఆధునిక కాలంలో ఇంట్లో పెంపుడు జంతువు (పెట్స్‌) పెంచుకోవడం ఒక అవసరంగా మారిపోయింది. వీటిల్లో కుక్క, పిల్లిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే జాగ్రత్తగా చూసుకోవడం, వాటి ఆరోగ్యం, ఆహారం, వ్యాయామం , శ్రద్ధ  సంరక్షణ  ఇవన్నీ యజమాని  బాధ్యత. 

పెంపుడు జంతువుల బ్రీడ్ లేదా సైజుతో సంబంధం లేకుండా, సంతోషంగా,  ఆరోగ్యంగా ఉండడానికి సాధారణ వ్యాయామం,  మానసిక ప్రేరణ అవసరం. ఇంట్లో , బయటా ఆడుకోవడానికి, పరిగెత్తడానికి అవకాశం ఉండేలా చూసుకోవాలి.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. మనుషుల మాదిరిగానే పోషకాలతో నిండిన,సమతుల్య ఆహారం చాలా అవసరం. వాటి బ్రీడ్‌  వయస్సుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా  పశువైద్యుడిని సంప్రదించి టీకాలు వేయించాలి. గ్రూమింగ్, జనరల్‌ చెక్-అప్‌లు   చేయించాలి.  ఏదైనా అనారోగ్యం వస్తే సరైన చికిత్స చేయించాలి.  అంతేకాదు పెంపుడు జంతువు వైద్య ఖర్చుల కోసం పెట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌  కూడా ఉన్నాయి.

సాధారణంగా  అనారోగ్యానికి గురైన కుక్కలకు మందులు వేయడం యజమానులకు  ఒక పెద్ద టాస్క్‌అని చెప్పాలి. ఒక్క పట్టాన మాట వినవు.  మారాం చేస్తాయి. ఈ నేపథ్యంలో వాటికి మందులు  ఎలా వేయాలో చిన్న చిట్కా అంటూ ఒక వీడియో ఇంటర్‌ నెట్‌లో ఆసక్తికరంగా మారింది.  చిన్ని పిల్లల్ని మాయ చేసి, మ్యాజిక్‌ చేసినట్టే.. పెట్స్‌కి కూడా వాటికిష్టమైన ఆహారంలో పెట్టి తినిపించేయడమే. అదెలాగో  మీరూ చూసేయండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement