రాష్ట్రంలో పేట్రేగిపోతున్న వ్యక్తిత్వ హంతకులు Krishnamraju comments on LV Subramaniam | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పేట్రేగిపోతున్న వ్యక్తిత్వ హంతకులు

Published Fri, Jun 28 2024 5:44 AM | Last Updated on Fri, Jun 28 2024 5:44 AM

Krishnamraju comments on LV Subramaniam

వైఎస్‌ జగన్‌పై మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ల దు్రష్పచారం 

ఎన్నికలకు ముందు నిమ్మగడ్డ, పీవీ రమేష్ లు జగన్‌ లక్ష్యంగా పనిచేశారు 

ఎన్నికలవగానే వారు మాయమయ్యారు 

ఇప్పుడు ఎల్వీ సుబ్రమణ్యం, ఇక్బాల్‌లు జగన్‌పై పడుతున్నారు 

ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కృష్ణంరాజు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యక్తిత్వాన్ని హననం చేసే హంతకులు రోజురోజుకు పేట్రేగిపోతున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. కేరక్టర్‌ అసాసినేషన్‌ చేసే వారు వేల సంఖ్యలో పెరిగిపోయారని, నిత్యం కొన్ని వేల మందిని వెంటాడి వేధిస్తున్నారని చెప్పారు. గతంలో ఏపీలో పని చేసి మాజీలైన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం శోచనీయమని అన్నారు. వారి చేష్టలు ఒక వర్గానికి, ఒక పార్టీకి, ఒక నాయకుడికి అనుకూలంగా ఉంటున్నాయని, వారికి ఇష్టం లేని మరో నాయకుడి వ్యక్తిత్వాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అండ్‌ కో, మాజీ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పీవీ రమేష్‌ ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ పరిపాలనను, జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారన్నారు. దీని కోసం సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సంస్థను ఏపీ వరకే పరిమితం చేశారని, తెలంగాణ వైపు కన్నెతి చూడలేదన్నారు. వీరి కార్యకాలపాలన్నీ వైఎస్‌ జగన్‌ అండ్‌ కోని అధఃపాతానికి తొక్కేయాలన్న విధంగానే సాగాయని తెలిపారు. వారి లక్ష్యం పూర్తయిందని, ఇప్పుడు వారి జాడ లేదని, సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యక్రమాలు లేవని చెప్పారు.

ఇప్పుడు తాజాగా మరికొందరు వైఎస్‌ జగన్‌ని టార్గెట్‌ చేశారని తెలిపారు. ఆయనకు పరిపాలన చేతకాదని, ఎవరినీ గౌరవించడని,  సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి మీద పాలనంతా వదిలేశారంటూ వింత విషయాలు చెబుతున్నారని చెప్పారు. తాజాగా ఎల్‌వీ సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌లు ఖాళీగా ఇంట్లో ఉండి వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని చెప్పారు. విశాఖలో స్టీల్‌ ఫ్యాక్టరీ అమ్మేసి అక్కడ రాజధాని పెడదామని జగన్‌ చెప్పారని సుబ్రమణ్యం అనడం వింతగా ఉందన్నారు. జగన్‌ రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారంలో అనుభవం ఉందని, స్టీల్‌ ఫ్యాక్టరీ అమ్మటం సాధ్యం కాదని ఆయనకు తెలీదా అని అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయొద్దని జగన్‌ కేంద్రానికి లేఖ కూడా రాశారని తెలిపారు.

జగన్‌కి పాలన తెలీదని అని అంటున్న ఐఏఎస్‌ సుబ్రమణ్యంకి కూడా తెలియని విధంగా వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక మార్పులు, పాలనా సంస్కరణలు  తీసుకొచ్చారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ 30లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇలా ఇమ్మని ఎల్వీ గానీ, ఇక్బాల్‌ కానీ చెప్పారా.. అని నిలదీశారు. ఎల్వీ సుబ్రమణం ఫైల్స్‌ ఏమీ తేల్చడనే ప్రచారం ఉందని, టీటీడీ నిధులను విలాసాలకు వాడుకొన్నారన్న ఆరోపణలు ఉన్నాయని, వీటికి ఆయన ఏమి సమాధానం చెబుతారని అన్నారు.

2019 ఎన్నికల కౌంటింగ్‌ కాగానే జగన్‌ను కలిసి ఆయన ప్రాపకం కోసం ఎందుకు ప్రయతి్నంచారని, గవర్నర్‌ ఆదేశిస్తేనే కలవాలి కదా.. అని నిలదీశారు. ఇక్బాల్‌ వక్ఫ్‌ బోర్డు అధికారిగా ఉన్నప్పుడు ఆయన సామాజికవర్గం వారే ఇక్బాల్‌ పనికిరాడని ఆరోపించారన్నారు. ఇక్బాల్‌ ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్‌ జగన్‌ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని చెప్పారు. జగన్‌కు పాలన తెలియదని వీరు ఎలా అంటారని ప్రశి్నంచారు. వీరి వెనుక ఉన్న మూల విరాట్‌ ఎవరో అందరికీ తెలుసునని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement