T20 WC Semis: 56 పరుగులకే ఆలౌట్‌.. ఆఫ్ఘనిస్తాన్‌ ఖాతాలో చెత్త రికార్డులు T20 World Cup 2024 1st Semis: Afghanistan Bags Unwanted Records By Scoring Just 56 Runs Against South Africa | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024 1st Semi Final: 56 పరుగులకే ఆలౌట్‌.. ఆఫ్ఘనిస్తాన్‌ ఖాతాలో చెత్త రికార్డులు

Published Thu, Jun 27 2024 9:00 AM | Last Updated on Thu, Jun 27 2024 9:13 AM

T20 World Cup 2024 1st Semis: Afghanistan Bags Unwanted Records By Scoring Just 56 Runs Against South Africa

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా సౌతాఫ్రికా ఇవాళ (జూన్‌ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ 56 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేవలం ఒకే ఒక్కరు (అజ్మతుల్లా (10)) రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో ఎక్సట్రాల రూపంలో వచ్చిన పరుగులు అత్యధికం (13) కావడం విశేషం. 

ఆఫ్ఘన్‌ ఆటగాళ్లు రహ్మనుల్లా గుర్బాజ్‌ (0), ఇబ్రహీం జద్రాన్‌ (2), గుల్బదిన్‌ నైబ్‌ (9), మొహమ్మద్‌ నబీ (0), ఖరోటే (2), కరీమ్‌ జనత్‌ (8), రషీద్‌ ఖాన్‌ (8), నూర్‌ అహ్మద్‌ (0), నవీన్‌ ఉల్ హక్‌ (2) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ విభాగంలో దారుణంగా విఫలమైన ఆఫ్ఘనిస్తాన్‌ కొన్ని చెత్త రికార్డులు మూటగట్టుకుంది. ఆ రికార్డులేంటో చూద్దాం.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీల సెమీఫైనల్స్‌లో అత్యల్ప స్కోర్‌

టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ టీమ్‌ చేసిన రెండో అత్యల్ప స్కోర్‌

టీ20ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు అత్యల్ప స్కోర్‌

ప్రస్తుత వరల్డ్‌కప్‌లో పవర్‌ ప్లేల్లో (తొలి 6 ఓవర్లలో) అత్యధిక వికెట్లు (5)

టీ20ల్లో సౌతాఫ్రికాపై ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోర్‌ (56)

కాగా, ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ చేసిన స్వల్ప స్కోర్‌ను సౌతాఫ్రికా ఆడుతూపాడుతూ ఛేదించి తొలి సారి ప్రపంచకప్‌ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది. తొలుత సఫారీ బౌలర్లు జన్సెన్‌ (3-0-16-3), షంషి (1.5-0-6-3), రబాడ (3-1-14-2), నోర్జే (3-0-7-2) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా 8.5 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోయి విజయతీరాలకు చేరింది. డికాక్‌ 5 పరుగులు చేసి ఫజల్‌ హక్‌ ఫారూఖీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. రీజా హెండ్రిక్స్‌ (29), మార్క్రమ్‌ (23) సౌతాఫ్రికాను గెలుపు తీరాలు దాటించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement