హ్యుందాయ్ కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు Hyundai Pakistan social media handles to post on Kashmir, Indians call for boycott | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్ కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు

Published Sun, Feb 6 2022 9:23 PM | Last Updated on Sun, Feb 6 2022 10:12 PM

Hyundai Pakistan social media handles to post on Kashmir, Indians call for boycott - Sakshi

హ్యుందాయ్ మోటార్స్ కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేస్తూ పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కాశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కాశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ పాకిస్తాన్ తన ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా చేసిన ఒక పోస్టులో.. "మన కాశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుంచుకుందాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదాం" అని హ్యుందాయ్ #KashmirSolidarityDay అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి పోస్ట్ చేసింది. 

అయితే, ఆ పోస్టులు ఇప్పుడు తొలగించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విటర్ హ్యాండిల్ పోస్టు చేసిన ట్వీట్లను చాలా మందికి స్క్రీన్ షాట్ తీసి ట్విటర్ వేదికగా యూజర్లు షేర్ చేస్తూ కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ ట్విటర్ వినియోగదారులు ఈ పోస్టుపై తన వైఖరిని వివరించాలని కోరుతూ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్)ను కోరుతూ భారీ సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. ఇంకా, చాలా మంది భారతీయ వినియోగదారులు హ్యుందాయ్ ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. చాలా మంది ఆ కంపెనీకి చెందిన కార్లను అస్సలు కొనవద్దు అని కోరుతున్నారు.

వినియోగదారులు ఆ ట్వీట్లను చూడకుండా సంస్థ పరిమితం చేసింది. ఈ సమస్యపై నేరుగా ప్రస్తావించకుండా హెచ్ఎంఐఎల్ తన ప్రకటనలో"హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పుడు 25 సంవత్సరాలకు పైగా భారతీయ మార్కెట్ లో ఉంది. జాతీయవాదాన్ని గౌరవించే మా బలమైన నైతిక తత్వానికి మేము దృఢంగా నిలబడతాము. హ్యుందాయ్ మోటార్ ఇండియాను కలిపే అవాంఛనీయ సోషల్ మీడియా పోస్ట్ ఈ గొప్ప దేశానికి మా అసమాన నిబద్ధత, సేవను దెబ్బతీస్తోంది. హ్యుందాయ్ బ్రాండ్'కు భారతదేశం రెండవ నిలయం, సున్నితమైన విషయాలలో ఎటువంటి ఉపేక్ష వహించేది లేదు. అటువంటి అభిప్రాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశం పట్ల మా నిబద్ధతలో భాగంగా, దేశంతో పాటు దాని పౌరుల మెరుగుదల దిశగా మా ప్రయత్నాలను కొనసాగిస్తాము" అని ఆ ప్రకటనలో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement