తొందరపాటు నిర్ణయాలొద్దు: సబిత Telangana Education Minister Sabitha Indra Reddy Appealed To Students | Sakshi
Sakshi News home page

తొందరపాటు నిర్ణయాలొద్దు: సబిత

Published Wed, Jun 29 2022 1:11 AM | Last Updated on Wed, Jun 29 2022 8:13 AM

Telangana Education Minister Sabitha Indra Reddy Appealed To Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించ లేదని, మంచి మార్కులు రాలేదని.. విద్యార్థులెవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు ఏడాది నష్ట పోకుండా ఉండేందుకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెం టరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్ప టికే ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు. ఈ సమయంలో విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని కళాశాల లెక్చరర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement