Pro Kabaddi 2024: పట్నా పైరేట్స్‌కు ఎనిమిదో గెలుపు Pro Kabaddi 2024: Patna Pirates Outstanding Defence Takes Them To Huge Win Over Gujarat Giants | Sakshi
Sakshi News home page

Pro Kabaddi 2024: పట్నా పైరేట్స్‌కు ఎనిమిదో గెలుపు

Published Tue, Jan 30 2024 7:30 AM | Last Updated on Tue, Jan 30 2024 8:37 AM

Pro Kabaddi 2024: Patna Pirates Outstanding Defence Takes Them To Huge Win Over Gujarat Giants - Sakshi

పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో సొంతగడ్డపై పట్నా పైరేట్స్‌ జట్టు అదరగొట్టింది. గుజరాత్‌ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ జట్టు 32–20 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఈ టోర్నీలో పైరేట్స్‌కిది ఎనిమిదో విజయం కావడం విశేషం.

పట్నా తరఫున సందీప్‌ (7 పాయింట్లు), అంకిత్‌ (6 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 41–36తో బెంగాల్‌ వారియర్స్‌ను ఓడించింది. హరియాణా తరఫున శివమ్‌ 12 పాయింట్లు, సిద్ధార్థ్‌ 11 పాయింట్లు, వినయ్‌ 6 పాయింట్లు స్కోరు చేశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement