A Video From Pigeon Performs Backflips Thrice Shows Goes Viral - Sakshi
Sakshi News home page

పావురం బ్యాక్‌ జంప్‌!.. చూస్తే అవాక్కవ్వాల్సిందే: వీడియో వైరల్‌

Published Fri, Jul 29 2022 4:25 PM | Last Updated on Fri, Jul 29 2022 8:48 PM

A Video From Pigeon Performs Backflips Thrice Shows Goes Viral  - Sakshi

ఇంతవరకు పక్షులకు సంబంధించిన పలు వీడియోలు చూశాం. కొన్ని పక్షులు మనుషుల వలే మాట్లాడటం వంటివి కూడా విన్నాం. నిపుణుడి పరివేక్షణలోనూ లేదా ఏ సర్కస్‌లోనూ ఆయా సంరక్షకుల సమక్షంలో విన్యాసాలు చేయడం చూసి ఉంటాం. అంతే గానీ వాటంతట అవి చేయడం జరగదు. కానీ ఈ పావురం తనంతట తాను విచిత్రమైన విన్యాసం చేసింది. 

వివరాల్లోకెళ్తే... ఒక తెల్లటి పావురం తనంతట తానుగా ఒక్కసారిగా రెక్కలు విప్పుతూ.. అనుహ్యంగా వెనుకకు జంప్‌ చేస్తుంది. ఏదో అనుకోకుండా చేసింది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అది అలా మూడుసార్లు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు వావ్‌ భలే జిమ్నాస్టిక్స్‌ చేసింది అంటూ ఆ పావురాన్ని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి: వీడియో: రియల్‌ బాహుబలి.. ఇలా చేయాలంటే గట్స్‌ ఉండాలి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement