RRR Movie Pre Release Event In Dubai: Tom Cruise As Chief Guest, Deets Inside - Sakshi
Sakshi News home page

RRR Movie: దుబాయ్​లో 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రీరిలీజ్ ఈవెంట్​ !.. అతిథిగా హాలీవుడ్ స్టార్​​ హీరో ?

Published Fri, Feb 25 2022 5:51 PM | Last Updated on Fri, Feb 25 2022 8:34 PM

Tom Cruise Chief Guest In RRR Movie Pre Release Event At Dubai - Sakshi

Tom Cruise Chief Guest In RRR Movie Pre Release Event At Dubai: దర్శక ధీరుడు జక్కన్న, యంగ్ టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్​ రామ్​ చరణ్​ కాంబోలో భారీ మల్టీ స్టారర్​గా వస్తున్న చిత్రం చిత్రం 'రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్ఆర్‌)'. 14 భాషల్లో తెరకెక్కిన సినిమా కోసం ప్రేక్షకలోకం, అభిమానగనం ఎంతగానో ఎదురచూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్​ ప్రకటించారు. దీంతో చిత్రబృందం త్వరలోనే ప్రమోషన్స్​ కార్యక్రమాలను తిరిగి మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​ను గ్రాండ్​గా ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ విషయానికి సంబంధించి ఒక క్రేజీ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రం ప్రీరిలీజ్​ వేడుకను త్వరలో దుబాయ్​లో జరిపేందుకు జక్కన్న టీం సన్నహాలు చేస్తుందని టాక్​. ఈ అతిపెద్ద ఈవెంట్​కు ప్రముఖ హాలీవుడ్​ యాక్షన్ హీరో టామ్​ క్రూజ్​ ముఖ్య అతిథిగా హాజరు కానున్నడనే వార్త సోషల్​ మీడియాలో గింగిరాలు తిరిగుతోంది. కాగా ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ వార్త ఆర్​ఆర్​ఆర్​ మూవీపై మరింత ఆసక్తిని పెంచుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement