![Tamil Movie Lock Down Nights First Look Poster Released Today - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2023/08/14/lock-down.jpg.webp?itok=idptjgBu)
జీవీ, 8 తోట్టాగల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ వెట్రి హీరోగా.. పూచ్చాండి చిత్రం ఫేమ్ హంశినీ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం లాక్డౌన్ నైట్స్. ఈ చిత్రానికి ఎస్ ఎస్.స్టాన్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ నిర్మాత వినోద్ శబరీస్ తాజాగా తమిళంలో నిర్మిస్తున్న చిత్రం లాక్డౌన్ నైట్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చిత్ర టైటిల్ పోస్టర్‌ను సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా.. ఇటీవల కన్నడలో కిశోర్, పూజా గాంధీ జంటగా సంహారిణి అనే భారీ చిత్రాన్ని వినోద్ శబరీస్ నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
(ఇది చదవండి: 'అతనికి ఏ మహిళతోనూ రిలేషన్ లేదు'.. స్టార్ హీరోపై కంగనా ప్రశంసలు!)
ఎస్ ఎస్.స్టాన్లీ ఇంతకు ముందు ఏప్రిల్ మాదత్తిల్, పుదుకోట్టైయిలిరుందు సరవణన్, వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు గంగై అమరన్, మదియళగన్, లోగన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సాలై సహదేవన్ ఛాయాగ్రహణం, జస్టిస్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిగా మలేషియాలో చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు.
(ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్)
Comments
Please login to add a commentAdd a comment