Prabhas: అరుదైన రికార్డ్‌ | Rebel Star Prabhas Tops X List Of Top Hashtags In Entertainment Category In India, Deets Inside - Sakshi
Sakshi News home page

Prabhas X Hashtags Record: అరుదైన రికార్డ్‌

Published Thu, Mar 14 2024 5:04 AM | Last Updated on Thu, Mar 14 2024 10:01 AM

Rebel star Prabhas tops X list of top hashtags in entertainment category in India - Sakshi

హీరో ప్రభాస్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పాన్‌ ఇండియా స్థాయిలోనే కాదు.. పాన్‌ వరల్డ్‌ రేంజ్‌లో అభిమానులను అలరిస్తున్నారాయన. రేర్‌ కాంబినేషన్స్, రికార్డ్‌ స్థాయి బాక్సాఫీస్‌ నంబర్స్, భారీ పాన్‌ వరల్డ్‌ మూవీ లైనప్స్‌... ఇలా అన్ని అంశాల్లో ఎన్నో రికార్డులు, ఘనత సాధించిన ప్రభాస్‌ తాజాగా మరో అరుదైన రికార్డ్‌  సొంతం చేసుకున్నారు. తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్‌) టాప్‌ హ్యాష్‌ ట్యాగ్స్‌ ఆఫ్‌ ఇండియా లిస్టులో నిలిచిన ఏకైక హీరోగా రికార్డ్‌ సాధించారు ప్రభాస్‌.

ట్విట్టర్‌ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో టాప్‌ 10 మోస్ట్‌ యూజ్డ్‌ హ్యాష్‌ ట్యాగ్స్‌లో ప్రభాస్‌ మాత్రమే చోటు దక్కించుకున్నారు. తమ అభిమాన హీరో సాధించిన ఈ క్రెడిట్‌తో ఫుల్‌ ఖుషీ అవుతున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. ఇదిలా ఉంటే.. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం మే 9న విడుదల కానుంది. అలాగే మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్‌. మంచు విష్ణు టైటిల్‌ రోల్‌లో రూ΄÷ందుతున్న ‘కన్నప్ప’లో కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌ 2’, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలషూటింగ్‌ ఆరంభం కావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement