మూడు వారాల తర్వాత కూలీగా... Rajinikanth Coolie shoot to commence on June 6 in Chennai | Sakshi
Sakshi News home page

మూడు వారాల తర్వాత కూలీగా...

Published Wed, May 15 2024 3:30 AM | Last Updated on Wed, May 15 2024 3:30 AM

Rajinikanth Coolie shoot to commence on June 6 in Chennai

జస్ట్‌ చిన్న బ్రేక్‌... ఆ తర్వాత కూలీగా కూల్‌గా సెట్‌లోకి అడుగుపెట్టడానికి రజనీకాంత్‌ ప్లాన్‌ చేసుకున్నారట. ‘వేట్టయాన్‌’ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్‌ని పూర్తి చేసిన రజనీకాంత్‌ ఓ మూడు వారాలు విరామం తీసుకుంటారని సమాచారం. ఆ తర్వాత జూన్‌ 6 నుంచి తన మరో చిత్రం ‘కూలీ’ షూటింగ్‌లో పాల్గొంటారట.

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం చెన్నైలో భారీ  సెట్‌ రూపొందించారట. ఆ సెట్‌లోనే కొత్త షెడ్యూల్‌ ఆరంభించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. కాగా ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ నటించనున్నారు. రజనీ కుమార్తె పాత్రలో ఆమె కనిపిస్తారట. ఈ పాత్ర కథకి కీలకంగా ఉంటుందని తెలిసింది. సన్‌ పిక్చర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement