ప్రభాస్‌ రేంజే వేరు.. అందుకు ఇదే నిదర్శనం.. Prabhas Stands No 1 in Top Hashtags on X in India | Sakshi
Sakshi News home page

టాప్‌ లిస్ట్‌లో ప్రభాస్‌.. డార్లింగ్‌తో మామూలుగుండది మరి!

Published Wed, Mar 13 2024 6:47 PM | Last Updated on Wed, Mar 13 2024 7:19 PM

Prabhas Stands No 1 in Top Hashtags on X in India - Sakshi

స్టార్ హీరోలు ఎందరున్నా తాను ప్రత్యేకమని ఎన్నో రికార్డులు, ఘనతల ద్వారా నిరూపించుకుంటున్నాడు పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్. రేర్ కాంబినేషన్స్, రికార్డు స్థాయి బాక్సాఫీస్ నెంబర్స్, పాన్ వరల్డ్ మూవీ లైనప్స్...ఇలా ఏ అంశంలో చూసినా రేసులో ఆయనెప్పుడూ మిగతా స్టార్స్ అందుకోలేనంత దూరంలోనే ఉంటాడు.

అందుకే ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్‌ను దాటి పాన్ ఇండియా స్థాయికి చేరుకుని చాలాకాలమవుతోంది. మరోసారి తన క్రేజ్‌ ఎలాంటిదో చూపించే సంఘటనే ఇది! తాజాగా ఎక్స్(ట్విట్టర్)లో టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులోనూ ఆయన చోటు దక్కించుకున్నాడు. ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా జాబితాలో నిలిచిన ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు.

ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్‌డ్‌ హ్యాష్ ట్యాగ్స్‌లో ప్రభాస్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ట్విటర్ ఇండియా ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఇది ప్రభాస్ స్టార్ డమ్‌కు ఓ బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ అని చెప్పవచ్చు. ప్రభాస్ సాధించిన ఈ క్రెడిట్‌తో డార్లింగ్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అభిమానుల సంతోషాలను రెట్టింపు చేసేందుకు కల్కి 2898 ఎడి, రాజా సాబ్ వంటి పెద్ద చిత్రాలతో త్వరలో సందడి చేయనున్నాడు.

చదవండి: OTT: 36 దేశాల్లో ట్రెండ్‌ అవుతున్న ఇండియన్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ అక్కడే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement