Viral Video: Truck Veers Off Road Man Incredibly Lucky Escape - Sakshi
Sakshi News home page

Viral Video: ఒక్క అడుగు అటువైపు వేసిఉంటే నుజ్జునుజ్జు అయ్యేవాడే.. భయంగొలిపే వీడియో!

Published Tue, May 31 2022 6:39 PM | Last Updated on Tue, May 31 2022 7:27 PM

Watch Viral Video Truck Veers Off Road Man Incredibly Lucky Escape - Sakshi

భూమిపై నూకలు బాకీ ఉంటే పెను ప్రమాదాల నుంచి సైతం ప్రాణాలతో బయటపడొచ్చు అంటారు. ఇక్కడ వీడియోలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం చూస్తే నిజమే అనిపిస్తుంది. లేదంటే అంత భారీ వాహనం ఒక్కసారిగా ఎగిరిపడి.. ఆ వ్యక్తి వైపునకు దూసుకెళ్లడం.. అతని దగ్గరగా వెళ్లి  ఢీకొని రాసుకుంటూ ముందుకుసాగడం.. అతను గోడ, ట్రక్కు మధ్యగా ఇరుక్కుపోయి బయటపడటం.. ఇవన్నీ భయంగొలిపే దృశ్యాలే!
చదవండి👉 యువతి చేతిలో ఫోటో చూడగానే.. కారు ఆపిన ప్రధాని మోదీ!

ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన చేతిలో హెల్మెట్‌, కొన్ని పత్రాలతో ఓ వ్యక్తి నిలుచున్నాడు. అటుగా వస్తున్న ఓ ట్రక్కు చెట్టు కొమ్మలకు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఎగిరిపడింది. వేగంగా కుడివైపునకు దూసుకెళ్లింది. అమాంతం పైకిలేచి ఫుట్‌పాత్‌మీదుగా పరుగులు పెట్టింది. అక్కడే ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. 

చచ్చాన్రా దేవుడో అనుకుంటూ కొద్దిగా వెనక్కి అడుగేశాడు. అప్పటికే అతన్ని సమీపించిన ట్రక్కు ముందుభాగం అతనికి టచ్‌ ఇచ్చింది. ఆ దెబ్బతో అతను గోడవైపునకు మరింత కదిలాడు. అతన్ని రాసుకుంటూ వెళ్లిన ట్రక్కు అడుగుల దూరంలో ఆగిపోయింది. ఊహించని ప్రమాదంతో అటు బాధితుడు, ఇటు ట్రక్కు డ్రైవర్‌ కంగారెత్తిపోయారు. అయితే, అదృష్టం కొద్దీ ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో ఇద్దరూ ఊపిరిపీల్చుకున్నారు. 56 సెకండ్లు ఉన్న ఈ వీడియో తాజాగా వైరల్‌గా మారింది.
చదవండి👉🏾 Viral Video: అటు చూడు బే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement