ప్రెసిడెంట్‌ పోటీ నుంచి ట్రంప్‌ తప్పుకోవాలంటున్న అమెరికన్లు! | 49% of Americans say Trump should suspend 2024 presidential campaign | Sakshi
Sakshi News home page

ప్రెసిడెంట్‌ పోటీ నుంచి ట్రంప్‌ తప్పుకోవాల్సిందే..! : అమెరికన్లు

Published Wed, Jun 5 2024 8:48 AM | Last Updated on Wed, Jun 5 2024 9:12 AM

49% of Americans say Trump should suspend 2024 presidential campaign

న్యూయార్క్‌:  పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్‌ రికార్డులు తారుమారు చేసిన  హష్‌ మనీ కేసులో న్యూయార్క్‌ కోర్టు  డొనాల్డ్‌ ట్రంప్‌ను దోషిగా తేల్చటం అమెరికా రాకీయంగా చర్చనీయాంశం అయింది. ట్రంప్‌పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని  కోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతోపాటు శిక్ష ఖరారు చేయనుంది.

ఇక.. ఈ వ్యవహారంలో ట్రంప్‌కు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ.. మరో ఆరు నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా ట్రంప్‌ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని సగం మంది అమెరికన్లు అభిప్రాయపడినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ సర్వేను మే 31 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించినట్లు సదరు  సర్వే సంస్థ పేర్కొంది.  హష్‌ మనీ కేసులో ట్రంప్‌ను కోర్టు దోషిగా ప్రకటించటంపై  సరైందేని 50 శాతం అమెరికన్లు అభిప్రాయపడినట్లు సర్వేను బట్టి తెలుస్తోంది. 23 శాతం మంది ఈ కేసులోని సరైందా? కాదా? అనే విషయంలో ఎటువంటి అభిప్రాయాన్ని కలిగిలేరని కూడా తెలిపింది.

అదే విధంగా 27 శాతం మంది మాత్రం ట్రంప్‌ను దోషిగా తెల్చటాన్ని తప్పుపడుతున్నారు. ఈ కేసులో ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలు 47 శాతం రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని సర్వేలో పాల్గొన్న అమెరికన్లు వెల్లడించారు.  38 శాతం మంది మాత్రం ఈ అభిప్రాయాన్ని ఏకిభవించలేదు. ముఖ్యంగా ఈ కేసులో ట్రంప్‌ అక్రమానికి పాల్పడినట్లు 51 శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వే రిపోర్టు వెల్లడించింది.

దీంతో మొత్తంగా 49 శాతం మంది అమెరికన్లు ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని సూచించిట్లు తెలిపింది. ట్రంప్‌  పలు ప్రైమరి ఎన్నికల్లో విజయం సాధించి రిపబ్లికన్‌ పార్టీ తరఫున  అధక్ష పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇక.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. ట్రంప్‌ను దోషిగా ప్రకటించటం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారటం.. ఆయన గెలుపు అవకాశాలపై ఎలాంటి  ప్రభావం చూపుతుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement