ఆస్ట్రేలియాకు గూగుల్‌ బెదిరింపులు Google Threatens To Remove Search Engine In Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాకు గూగుల్‌ బెదిరింపులు

Published Sat, Jan 23 2021 4:29 AM | Last Updated on Sat, Jan 23 2021 9:33 AM

Google Threatens To Remove Search Engine In Australia - Sakshi

వెల్లింగ్టన్‌: ‘బెదిరింపులపై మేం స్పందించం. కానీ మీరు చేయగలిగే స్థాయిలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టాలు చేస్తుంది’.. ఇదీ గూగుల్‌ బెదిరింపులకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ఇచ్చిన సమాధానం. వివరాల్లోకెల్తే.. ఆస్ట్రేలియాలోని మీడియా సంస్థలకు చెందిన వార్తలను గూగుల్‌ ఉపయోగించు కుంటున్నందుకుగానూ ఆయా మీడియా సంస్థలకు డబ్బు చెల్లించేలా ఆస్ట్రేలియా ఇటీవల కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఈ చట్టాలపై గూగుల్‌ బెదిరింపు వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ల గూగుల్‌ డైరెక్టర్‌ మెల్‌ సిల్వా మాట్లాడుతూ.. ‘ఈ కోడ్‌ గనక చట్టంగా మారితే, గూగుల్‌ సెర్చ్‌ను ఆస్ట్రేలియాలో లేకుండా చేయడం తప్ప ఇంకేమీ చేయలేం. అప్పుడు మా ప్రొడక్ట్‌లను ఉపయోగించే దేశ ప్రజలకు అది బ్యాడ్‌ న్యూస్‌’ అంటూ ఆ దేశ సెనెటర్లకు చెప్పారు. మీడియా సంస్థలకు డబ్బు చెల్లించడానికి తాము సిద్ధమేనని, అయితే చట్టంలో ఉన్న నియమాల ప్రకారం కాదని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement