సొత్తుతో పాటు.. కుక్కపిల్లనూ వదలలేదు సార్‌..! - | Sakshi
Sakshi News home page

సొత్తుతో పాటు.. కుక్కపిల్లనూ వదలలేదు సార్‌..!

Published Sat, Apr 6 2024 7:20 AM | Last Updated on Sat, Apr 6 2024 11:31 AM

- - Sakshi

హైదరాబాద్‌: పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. సొత్తుతో పాటు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న శునకాన్ని సైతం ఎత్తుకెళ్లిన ఘటన ఘట్‌కేసర్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎఫ్‌సీనగర్‌ బాలాజీ నగర్‌కు చెందిన ఐలయ్య గురువారం కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ జిల్లా అంబాల గ్రామంలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి మెయిన్‌ డోర్‌ తాళాలు పగులగొట్టి కనిపించాయి.

లోపలికి వెళ్లి పరిశీలించగా అల్మరా తాళం పగులగొట్టి వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అందులో దాచిన 7.5 గ్రాముల బంగారం, 11 తులాల వెండి రూ. 5 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. వీటితో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లను కూడా అపహరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్‌ టీం (వేలి ముద్రల నిపుణులు)తో కలిసి వివరాలు సేకరించారు. ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవి చదవండి: ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్‌ను ఢీకొట్టడంతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement