20 రౌండ్ల కాల్పులు: శిరోమణి అకాలీ దళ్ యూత్‌ వింగ్‌ నేత హత్య SAD Leader Vicky Middukhera Assassinated By Gun Fire At Mohali In Punjab | Sakshi
Sakshi News home page

20 రౌండ్ల కాల్పులు: శిరోమణి అకాలీ దళ్ యూత్‌ వింగ్‌ నేత హత్య

Published Sat, Aug 7 2021 6:44 PM | Last Updated on Sat, Aug 7 2021 6:59 PM

SAD Leader Vicky Middukhera Assassinated By Gun Fire At Mohali In Punjab - Sakshi

మొహాలి: శిరోమణి అకాలీ దళ్ యూత్‌ వింగ్‌ నేత విక్రమ్‌జిత్ సింగ్ మిద్దుఖేరా అలియాస్‌ విక్కీ శనివారం దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో మృతి చెందారు. ఈ ఘటన మొహాలీలోని సెక్టార్ 71లో చేటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌యూవీ కారులో కూర్చున్న విక్కీనిపై మాస్కులు ధరించిన నాలుగురు దుండగుల్లో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కారు నుంచి పరుగులు తీశాడు. దుండగులు వెంబడించి మరీ 20 రౌండ్ల కాల్పులు జరపడంతో విక్కీ మృతి చెందాడు.

ఈ ఘటనపై శిరోమణి అకాలీ దళ్ నేత దల్జిత్ సింగ్ చీమా స్పందిస్తూ.. దుండగులు జరిపిన కాల్పుల్లోయూత్‌ లీడర్‌  విక్రమ్‌జిత్ సింగ్ మిద్దుఖేరా మృతి చెందినట్లు తెలిపారు. ఆయన సోదరుడు స్థానిక మున్సిపల్‌ ఎన్నికలు పార్టీ తరఫున పోటీ చేసినట్లు పేర్కొన్నారు. విక్కీ వద్ద లైసెన్స్‌ తుపాకీ ఉ‍న్నప్పటికీ దుండగలు జరిపిన భీకర కాల్పుల్లో తనను రక్షించుకోలేకపోయాడు.
 

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే విక్కీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement