రూ.500కే జియో స్మార్ట్‌ ఫోన్‌ ! షరతులు వర్తిస్తాయి Jio Phone Next Sale For As Low As Rs 500 | Sakshi
Sakshi News home page

Jio Phone Next: రూ.500కే జియో స్మార్ట్‌ ఫోన్‌, షరుతులు వర్తిస్తాయ్‌!

Published Fri, Sep 3 2021 2:21 PM | Last Updated on Fri, Sep 3 2021 2:38 PM

Jio Phone Next Sale For As Low As Rs 500 - Sakshi

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయనుంది. ప్రపంచంలోనే అతి చవకైన ఫోన్‌ 'జియో ఫోన్‌ నెక్ట్స్‌' ఫోన్‌ అమ్మకాలపై సరికొత్త బిజినెస్‌ మోడల్‌ను అప్లయ్‌ చేయనుంది. ఈ 4జీ జియో ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వీలుగా అతి తక్కువ ధరకే  అంటే ఫోన్‌  ధరలో పదోవంతుకే అందివ్వనుంది. 
10వేల కోట్ల టార్గెట్‌ 

వినాయకచవితి పండగ సందర్బంగా జియో నెక్ట్స్‌ మార్కెట్‌లోకి రానుంది. రాబోయే ఆరు నెలల్లో 5 కోట్ల హ్యాండ్‌ సెట్లు అమ్మడం ద్వారా ఏకంగా రూ. 10 వేల కోట్ల రూపాయల బిజినెస్‌ చేయాలని రిలయన్స్‌ జియో లక్క్ష్యంగా పెట్టుకుంది. దీనికి తగ్గట్టు భారీ స్థాయిలో కొనుగోల్లు జరగాలంటే ఫైనాన్స్‌ సహకారం ఉండటం అవసరం . దీంతో పలు నాన్‌ బ్యాకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.  ఫోన్‌  ధరలో కేవలం పదిశాతం సొమ్ము చెల్లించి హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా కొనుగోలుదారులు చెల్లించే వీలును కల్పిస్తున్నారు. దీనికి అనుగుణంగా  రిలయన్స్‌ జియో అధినేత ముఖేష్‌ అంబానీ భారీ ఎత్తున ప్లాన్‌ వేస్తున్నారు. ఇందుకోసం ఎస్‌బీఐ,పిరమల్ క్యాపిటల్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ అస్యూర్, డీఎంఐ ఫైనాన్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. 

షరతులు ఇలా వర్తిస్తాయి!
సాధారణంగా ఫైనాన్స్‌ కంపెనీల సాయంతో ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే ఫోన్‌ ధరలో సగం మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌ కింద చెల్లించాల్సి ఉంటుంది. కానీ జియో ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే అలాకాదు. రూ.5వేల ఫోన్‌ ధరపై రూ.500, రూ.7వేల ఫోన్‌ ధరపై రూ.700 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 

చదవండి: జియో స్మార్ట్‌ఫోన్‌ ప్రీ బుకింగ్స్‌ ఎప్పుడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement