ఇషా అంబానీకి జియో బంపర్‌ డీల్‌! సక్సెస్‌ అయితే.. Jio Financial Services Plans Rs 36000 Crore Deal With Reliance Retail | Sakshi
Sakshi News home page

ఇషా అంబానీకి జియో బంపర్‌ డీల్‌! సక్సెస్‌ అయితే..

Published Fri, May 24 2024 7:28 PM | Last Updated on Fri, May 24 2024 7:38 PM

Jio Financial Services Plans Rs 36000 Crore Deal With Reliance Retail

ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌ బంపర్‌ డీల్‌ అందుకుంటోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ముకేశ్ అంబానీకి చెందిన జియో లీజింగ్ సర్వీసెస్ ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌తో రూ.35,904 కోట్ల డీల్ కుదుర్చుకోనుంది.

టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, జియో లీజింగ్ సర్వీసెస్ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ .35, 904 కోట్ల విలువైన రౌటర్లు, సెల్‌ ఫోన్‌లు వంటి టెలికాం పరికరాలు, కస్టమర్ కేంద్రాల ఎక్విప్‌మెంట్‌ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డీల్ కు ఆమోదం పొందడానికి కంపెనీ వాటాదారులకు పోస్టల్ బ్యాలెట్ నోటీసును పంపినట్లు సమాచారం.

జియో లీజింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎల్ఎస్ఎల్) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగదారులకు అనుబంధ సేవలతో పాటు టెలికాం పరికరాలను లీజుకు ఇచ్చే వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ డీల్ విజయవంతమైతే భారత టెలికాం రంగంలో ఇదే అతిపెద్ద ఎక్విప్‌మెంట్ లావాదేవీ అవుతుంది. 

నివేదిక ప్రకారం, జెఎల్ఎస్ఎల్ లీజింగ్ మోడల్ ద్వారా, ముఖేష్ అంబానీ లేటెస్ట్‌ 5జీ పరికరాలను ప్రజలకు అందుబాటు ధరలో అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మోడల్ ఆకాష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు మరింత మంది చందాదారులను ఆకర్షిస్తుంది. జియో ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2025 మార్చి నుంచి 2026 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరాల్లో ఈ లావాదేవీ జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement