Hyundai Exter Get 6 Airbags and Design Features Launch Details - Sakshi
Sakshi News home page

Hyundai Exter: హ్యుందాయ్ ఎక్స్‌టర్ గురించి లేటెస్ట్ న్యూస్.. ఇక ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?

Published Tue, May 16 2023 7:24 PM | Last Updated on Tue, May 23 2023 12:54 PM

Hyundai Exter launch time and details - Sakshi

Hyundai Exter: హ్యుందాయ్ కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త 'ఎక్స్‌టర్' మైక్రో SUV గురించి కొంత కొంత సమాచారంగా వెల్లడిస్తూనే ఉంది. ప్రారంభంలో టీజర్లను మాత్రమే విడుదల చేసిన కంపెనీ కొన్ని రోజులకు ముందు కారుకి సంబంధించిన ఒక అధికారిక ఫోటో విడుదల చేసింది. అయితే ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ గురించి వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వేరియంట్స్..
భారతదేశంలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టాటా పంచ్ కారుకి ప్రధాన ప్రత్యర్థిగా నిలబడటానికి సిద్దమవుతున్న ఎక్స్‌టర్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుందని తెలుస్తోంది. అవి EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుందని ఇటీవల వెల్లడైన ఫోటోల ద్వారా స్పష్టంగా తెలిసింది.

సేఫ్టీ ఫీచర్స్..
హ్యుందాయ్ ఎక్స్‌టర్ అన్ని వేరియంట్లలోనూ ప్రామాణికంగా ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. అవి డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్, సైడ్ ఎయిర్ బ్యాగ్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో సహాయపడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరి. ఈ నియమాన్ని హ్యుందాయ్ అనుసరిస్తోంది.

ఎయిర్ బ్యాగులు మాత్రమే కాకుండా హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా లభిస్తాయి. కావున భద్రత పరంగా ఈ కారు పటిష్టంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిపోయింది.

(ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!)

లాంచ్ టైమ్ & ఇంజిన్ డీటైల్స్..
ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందనుంది. ఇది 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందనుంది. ఈ కొత్త SUV CNG వెర్షన్ లో కూడా రానున్నట్లు సమాచారం, ఇది కేవలం 5 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. ఈ కారు 2023 జులై చివరలో లేదా ఆగష్టు ప్రారంభంలో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement