కొనసాగుతున్న శిలాఫలకాల ధ్వంసం Jangareddygudem Municipality Lighting Board destroyed | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న శిలాఫలకాల ధ్వంసం

Published Wed, Jun 12 2024 5:38 AM | Last Updated on Wed, Jun 12 2024 5:38 AM

Jangareddygudem Municipality Lighting Board destroyed

నవరత్నాల స్థూపం, బోర్డులు కూడా..  

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ లైటింగ్‌ బోర్డు ధ్వంసం  

ఆర్బీకేలో ఫ్యాను అపహరణ  

వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మె తొలగింపు 

సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల విధ్వంసకాండ కొనసాగుతోంది. పలుచోట్ల మంగళవారం ఇష్టారీతిన వ్యవహరించారు. పలు ప్రభుత్వ కార్యాలయాలపై పేర్లను తొలగించారు. ప్రగతిపనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అధికారం పార్టీ ఆగడాలతో ప్రజలు భయపడుతున్నారు.  

» జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కార్యాలయ లైటింగ్‌ సైన్‌ బోర్డును ధ్వంసం చేశారు. నూతనంగా ని­రి్మంచిన జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కార్యాలయా­నికి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మున్సిపల్‌ కార్యాలయంగా పేరును నిర్ధారిస్తూ లైటింగ్‌ నే­మ్‌ బోర్డును కార్యాలయ భవనంపై ఏర్పాటు చేశా­రు. ఈ లైటింగ్‌ బోర్డును టీడీపీ మండల క­మి­టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, మ­రో ఎనిమిదిమంది ధ్వంసం చేశారు. నిచ్చెన­లు వేసుకుని కర్రలతో కొట్టి ధ్వంసం చేయగా, నేల­రాలిన అక్షరాలతో ఆ ప్రాంతం చిందర వందర­గా తయారైంది. ఘటనపై మున్సిపల్‌ కార్యా­ల­య మేనేజర్‌ కె.వి.రమణ పోలీసులకు ఫిర్యా­దు చేశారు.  

» దెందులూరు మండలం పోతునూరులోని సచివాలయం, రైతుభరోసా కేంద్రం, రోడ్డు వద్ద ఉన్న శిలాఫలకం, చల్లచింతలపూడిలోని సచివాలయం వద్ద నవరత్నాలతో ఉన్న బోర్డులను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ సంఘటనల్ని పోతునూరు సర్పంచ్‌ బోదుల స్వరూప్, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత డి.ఎన్‌.వి.డి.ప్రసాద్‌ తప్పుబట్టారు.  

»  తిరుపతిలో ఒక శిలాఫలకంపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేరును కొందరు ధ్వంసం చేశారు. తిరుపతి నగరంలో గతంలో ఎమ్మెల్యే హోదాలో భూమన కరుణాకర్‌ రెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి చేసిన భూపిరాట్టి మార్గాన్ని గత ఏడాది నవంబర్‌ 26వ తేదీన అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నగర మేయర్‌ డాక్టర్‌ శిరీషతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకంపై భూమన కరుణాకర్‌రెడ్డి పేరును కొందరు ధ్వంసం చేశారు.  

» శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం ఆత్మకూరు పంచాయతీలో నిరి్మంచిన రైతుభరోసా కేంద్రం వద్ద శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. గది తాళాన్ని పగలగొట్టి లోపల ఉన్న ఫ్యాన్‌ను అపహరించారు. టీడీపీ కార్యకర్తలు ఈ పనిచేసి ఉండొచ్చని, దీనిపై ఫిర్యాదు చేస్తామని కాంట్రాక్టర్‌ తెలిపారు. మండలంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని వైఎస్సార్‌సీపీ కనీ్వనర్‌ పోతురాజు, జేసీఎస్‌ కనీ్వనర్‌ ధనకోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.  

»  బాపట్ల జిల్లా వేమూరు బస్టాండ్‌ సెంటర్‌లోని నవరత్నాల స్థూపాన్ని టీడీపీ దుండగులు సోమవారం అర్థరాత్రి కూల్చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నవరత్న పథకాలు ప్రజలకు గుర్తుండేలా వేమూరు బస్టాండ్‌ సెంటరులో పంచాయతీ అనుమతితో స్థూపం నిర్మించారు. ఈ నెల 7వ తేదీన స్థూపం కూల్చేసేందుకు జేసీబీతో ప్రయత్నించారు.

 సిమెంట్‌ కాంక్రీట్‌తో గట్టిగా నిరి్మంచడం వల్ల జేసీబీ వల్ల కాలేదు. పంచాయతీ అధికారులు, ఎంపీడీవో దగ్గర ఉండి, స్థూపంపై ఉన్న  శిలాఫలకాలు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నందిగం సురే‹Ù, మేరుగ నాగార్జున బొమ్మలను పూర్తిగా తొలగించారు. తిరిగి సోమవారం రాత్రి యంత్రాన్ని తీసుకొచ్చి స్థూపాన్ని పూర్తిగా తొలగించారు. తెల్లవారుజామున సెంటరుకు వచ్చిన ప్రజలు స్థూపం కూలి్చవేసి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు.  

»చిత్తూరు జిల్లా చౌడేపల్లె ప్రవేటు బస్టాండు ప్రాంతంలో ఏర్పాటుచేసిన వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మె­ను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి తొలగించారు. కూడలి సమీపంలో ఏర్పాటుచేసిన జెండా దిమ్మెను జేసీబీ సహాయంతో పెకలించినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. ఈవిషయమై  పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు  చెప్పారు.  

»  అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో శృంగవరం గ్రామ సచివాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. సచివాలయంపై ఉన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ బొమ్మలతో పాటు నవరత్నాల పోస్టర్‌ను «ధ్వంసం చేశారు. ఈ విధ్వంసం హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యవర్గసభ్యుడు, సర్పంచ్‌ భర్త ఉలబాల శ్రీనువాసు పేర్కొన్నారు. కోర్టు వివాదంలో ఉన్న ప్రభుత్వ భవనం తాళం విరగొట్టి టీడీపీ కార్యకర్తలు ప్రవేశించటం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement