No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 12:30 AM | Last Updated on Tue, May 7 2024 9:15 PM

No He

పార్టీల వారీగా ప్రత్యేక కమిటీలు

పార్లమెంట్ ఎన్నికల్లో తాజా పరిస్థితిపై ఆరా

పార్టీ, ప్రత్యర్థుల బలాబలాలపై నివేదికలు

వీక్‌గా ఉన్నచోట అధిష్టానాల ఫోకస్

సరిదిద్దే యత్నాల్లో కీలక నేతలు

ఇంటెలిజెన్స్‌ నివేదికలు..

స్టేట్‌, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ శాఖలు కూడా పార్లమెంట్‌ ఎన్నికల్లో పరిస్థితులపై రిపోర్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ రిపోర్టులు ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌లు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌పై ఉన్న పరిస్థితిపై నివేదిక ఇవ్వడంతో వాటి బలాబలాలు, బలహీనతలపై తీవ్ర చర్చ సాగుతోంది. ప్రధానంగా ముఖ్యనేతలు ఈ సర్వేల రిపోర్టులతో ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దే విషయంలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. అంతలోపే వాటిని సరిదిద్దుకోగలుగుతామా.. లేదా అన్న మీమాంస వారిని వెంటాడుతుంది. మొత్తంగా పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీకి ముందు ఈ అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సాక్షి,ఆదిలాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజల ఆదరణ ఎంత శాతం ఉంది.. తమకెంత ఉంది.. తమ అభ్యర్థిని, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను జనం ఏ మేరకు ఆదరిస్తున్నారు.. సెగ్మెంట్‌ పరిధి లోని ఏయే నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాం.. ప్రత్యర్థులు ఎక్కడ గట్టిగా ఉన్నారు.. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలి.. లోటుపాట్లను ఎలా సరిదిద్దుకోవాలని ఆయా పార్టీల నుంచి సర్వే చేస్తు న్న కమిటీలు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా రిపోర్టు అందించారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌కు సంబంధించి పార్టీల పరంగా ఆయా కమిటీలు ఇప్పటికే అధిష్టానాలకు నివేదికలు ఇచ్చా యి. ప్రచారానికి గడువు సమీపిస్తున్న తరుణంలో మిగిలిన రోజుల్లో ఆ లోపాలు అధిగమించాలని అక్కడి నుంచి ఆదేశాలు అందాయి. దీంతో అభ్యర్థులతో పాటు పార్టీ ఇన్‌చార్జీలు, ముఖ్య నేతలు ఇందులో తలమునకలయ్యారు. ప్రస్తుతం సర్వేల అలజడి కొనసాగుతుంది.

పార్టీ కమిటీల రిపోర్ట్‌..

బీజేపీ పరంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునిల్‌ బన్సల్‌ కమిటీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిస్థితిపై కూడా ఇప్పటికీ ఒకట్రెండు సార్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ఆధారంగా లోటుపాట్లు సరిదిద్దుకునే చర్యలు ఇప్పటికే చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సునిల్‌ కనుగోలు కమిటీ నివేదికను తయారు చేసి ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ నుంచి సివిక్స్‌ పోల్స్‌ అనాలసిస్‌ (సీ–ప్యాక్‌)కమిటీ రిపోర్టు ఇచ్చింది. ప్రధానంగా అందులో నియోజకవర్గం వారీగా పరిస్థితులను వివరించినట్లు సమాచారం. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ, అభ్యర్థి బలంగా ఉన్నారు.. ఎక్కడ పార్టీ, అభ్యర్థి బలహీనంగా ఉన్నారు.. అక్క డ నష్ట నివారణకు చర్యలు చేపట్టాలి.. ఇందుకోసం ఆ నియోజకవర్గాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణ, ఇన్‌చార్జీలు పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఆ లోటుపాట్లను అధిగమించేలా ఆయా కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పార్టీల్లో చర్యలు చేపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline
1/1

No Headline

Advertisement
 
Advertisement
 
Advertisement