Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ksr Comments On Chandrababu Naidu's Criticism Of The Polavaram Project
పోలవరంపై రివర్స్‌ గేర్‌ ఏం చెబుతుందంటే..

ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించాయి. కారణాలు ఏవైనా, ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదన్న సమాచారం బాధ కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌డ్డిను విమర్శించడానికి, పోలవరం జాప్యం నెపం మొత్తాన్ని ఆయనపై నెట్టడానికే అన్నట్లు పర్యటన సాగించారు.2014 నుంచి ఐదేళ్లపాటు చేసిన పాలనలో ఈ ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశానని చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి. అందులో వాస్తవం ఉందా? లేదా? అనేది వేరే విషయం. నిజంగా అంత పని పూర్తి అయిపోయి ఉంటే కీలకమైన డయాఫ్రం వాల్ వరదలలో కొట్టుకుని పోయేది కాదు కదా అనే లాజిక్‌కు సమాధానం దొరకదు. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నిర్మాణ సంస్థను మార్చిందని చంద్రబాబు అంటున్నారు. దానివల్ల జాప్యం అయిందని చెబుతున్నారు. ఒకవేళ అది నిజమే అనుకుంటే చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను ఎందుకు మార్చారో చెప్పాలి కదా! నామినేషన్ పద్దతిన నవయుగ సంస్థకు ఎందుకు ఇచ్చారో వివరించాలి కదా! డయాఫ్రం వాల్‌తో సహా ఆయా పనులు నామినేటెడ్ పద్దతిన కొన్ని కంపెనీలకు ఎందుకు కేటాయించారన్నది వివరించాలి కదా!2014 టరమ్‌లో కేంద్రంలో పొత్తులో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి సత్వరమే పూర్తి చేయించేలా ఒత్తిడి తేవడం మాని, రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని ఎందుకు కోరినట్లు? ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును తనకు కావల్సినవారికే ఇచ్చుకునేందుకే అన్న విమర్శలకు ఎందుకు తావిచ్చారు. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ అయిందని ఎందుకు విమర్శించారు. దానికి చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేదు! మళ్లీ పొత్తు కుదిరింది కనుక మోడీ కూడా ఆ పాయింట్ మర్చిపోయినట్లు నటిస్తుండవచ్చు. అది వేరే విషయం. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించదలచినప్పుడు వ్యయ అంచనాలపై కేంద్రంతో ఎందుకు సరైన అవగాహనకు రాలేదు?కేవలం ప్రాజెక్టు నిర్మాణమే కాకుండా, ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అక్కడనుంచి తరలించడం, వారికి పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయం గురించి ఎందుకు కేంద్రంతో ఒప్పందం కాలేదు? కేంద్ర ప్రభుత్వం తాము ప్రాజెక్టు కడతాము కానీ, నిర్వాసితుల సమస్య రాష్ట్రమే చూసుకోవాలని చెప్పినప్పుడు ఎందుకు ప్రతిఘటించలేదు? అలాంటప్పుడు మొత్తం ప్రాజెక్టును కట్టి, రాష్ట్రానికి అప్పగించాలని ఎందుకు కోరలేదు. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం స్పిల్ వే, గేట్ల అమరిక తదితర పనులను పూర్తి చేసింది నిజం కాదా? ఇవన్నీ అవ్వకుండానే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెబితే అది నిజమే అవుతుందా?2018 నాటికే ప్రాజెక్టును పూర్తి చేస్తామని శాసనసభలోనే టీడీపీ ప్రభుత్వం ప్రకటించిందా? లేదా? అయినా ఎందుకు పూర్తి కాలేదు? వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ ద్వారా నిధులు ఆదాచేసే ప్రయత్నం చేసింది. పోలవరం ప్రాజెక్టులో కూడా సుమారు 850 కోట్ల మేర తక్కువ వ్యయానికి మెఘా సంస్థ టెండర్ పొందింది. దీనిని తప్పు పడుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను కొనసాగించదలిచారా? లేదా? పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంపుదల కోసం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారా? లేదా?బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ఆ మొత్తం గురించి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా టీడీపీ నాయకత్వమే ఆపుచేయించిందన్న విమర్శల గురించి ఏమి చెబుతారు? బీజేపీతో పొత్తు పెట్టుకునే క్రమంలో ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల వ్యయం కేంద్రం పూర్తిగా భరించి సహకరించాలని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఎందుకు కోరలేకపోయారు? చంద్రబాబు తన హయాంలో ఆయా కీలక పనుల ప్రాధాన్యతలను మార్చి పనులు చేయించడంవల్లే ఈ సమస్య వచ్యిందన్నది వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి వాదన. దీనిని ఆయన గత అసెంబ్లీలో వివరణాత్మకంగా వివరించారు.కాఫర్ డామ్ పూర్తి కాకుండానే, గ్యాప్‌లు ఉంచి డయాఫ్రం వాల్ నిర్మాణం తలపెట్టింది చంద్రబాబు ప్రభుత్వమా? కాదా? డయాఫ్రం వాల్ నిర్మాణం వరద కారణంగా దెబ్బతిన్నదంటే అది నాణ్యతాలోపమా? లేక మరేదైనా కారణమా? దీనిపై కేంద్ర జల కమిషన్ ఎందుకు ఒక నిర్ణయం తీసుకోవడానికి తాత్సారం చేస్తోంది? కేంద్రంలో ఇప్పుడు కూడా టీడీపీ భాగస్వామి కనుక ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి ఏమి చర్యలు తీసుకుంటుందో చెప్పకుండా వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై నిందలు వేస్తే ఏమి ప్రయోజనం. తాను పూర్తి చేసి చూపిస్తే ఆయనకే పేరు వస్తుంది కదా! ఇన్ని రాజకీయాలు ఎందుకు!మొత్తం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే పూర్తి చేయిస్తామని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గతంలో అన్నారు కదా? ఆ ప్రకారం ముందుకు వెళ్లే ఆలోచన చేస్తారా? కీలకమైన ఢయాప్రం వాల్ నిర్మాణం, సీపేజీ నీరు రాకుండా అడ్డుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టి, డామ్ నిర్మాణం పూర్తి చేయడానికి నాలుగు సీజన్‌లు అంటే నాలుగేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. దానిని ఎంత వీలైతే అంత తగ్గించడానికి ప్రయత్నించాలి కదా! కేవలం సాంకేతిక నిర్ణయం చేయడంలో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని ఎందుకు చంద్రబాబు ప్రశ్నించడం లేదు?పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఎంత వ్యయం చేసింది? అందులో ఎంత మొత్తాన్ని కేంద్రం తిరిగి చెల్లించింది?మొదలైన వివరాలను చంద్రబాబు ఎందుకు వెల్లడించలేదు? ఇప్పుడు సమస్య రాష్ట్రం పరిధిలో లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిను తప్పు పట్టడానికే అయితే చంద్రబాబు సోమవారం.. పోలవరం కార్యక్రమం చేపట్టినా ప్రయోజనం ఉండదు.వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిను రాజకీయంగా విమర్శిస్తే విమర్శించండి. తద్వారా రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తే యత్నించండి. ప్రాజెక్టు విషయంలో ఎవరు ఎలా ప్రవర్తించారు. ఎవరు ఏ మేరకు కృషి చేశారు? ఎవరు ద్రోహం చేశారు? ఎవరు మేలు చేశారు? అనే అంశాలు చరిత్రలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రస్తుతం వాటి జోలికి వెళ్లడం ముఖ్యం కాదు. ప్రాజెక్టును పూర్తి చేసిన రోజున చంద్రబాబు కాలర్ ఎగురవేసుకుని ఏమి చెప్పినా వినవచ్చు. అలాకాకుండా కుంటి సాకులు చెబుతూ కాలక్షేపం చేస్తే మాత్రం రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు అవుతుంది.ప్రాజెక్టులో తొలిదశలో నీటిని నిల్వ ఉంచే విషయంలో కూడా వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై అప్పట్లో చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేసేవారు. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో 194 టీఎమ్‌సీల నీటిని నిల్వ ఉంచాలంటే నిర్వాసితులకు ఇవ్వవలసిన పరిహారం సుమారు ముప్పైవేల కోట్లను కూడా కేంద్రం నుంచి ఎంత తొందరగా రాబట్టుకోగలిగితే అంత మంచిది. ఈ ప్రాజెక్టు ఆంధ్రుల దశాబ్దాల కల. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీలో చాలా వరకు నీటి సమస్య లేకుండా పోయే అవకాశం ఉంటుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ ప్రాజెక్టు ఒక రూపానికి వచ్చింది. రాజశేఖరరెడ్డి కేంద్రం నుంచి అనుమతులు తేవడంలో చాలా కృషి చేశారు. అలాగే ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు కూడా చొరవ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన అనూహ్య మరణంతో ఉమ్మడి ఏపీ గతి మారిపోయింది. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై చూపవలసినంత శ్రద్ద చూపలేదు. కాంట్రాక్టర్ ఎంపికే పెద్ద వివాదంగా మారుతూ వచ్చింది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపడుతుందని పేర్కొనడంతో మళ్లీ ఆశలు చివురించాయి.వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం పనులపై ఎంతో శ్రద్దపెట్టి అనుమతులు తేకపోతే, విభజన సమయంలో ఈ ప్రాజెక్టు చట్టంలోకి కూడా వచ్చేది కాదేమో! విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ఈ ప్రాజెక్టు ఒక వరం అవుతుందని అంతా భావించారు. ఈ తరుణంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టకుండా పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్యింది. తదుపరి కేంద్రం బదులు తామే నిర్మిస్తామని తీసుకోవడంతో అనేక కొత్త సమస్యలు వచ్చాయి.తర్వాత వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కొన్ని పనులు పూర్తి చేసినప్పటికీ, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడం, వరదలు, కరోనా వంటి సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇంతలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. దాంతో ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో టీడీపీపై ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది కనుక బీజేపీపై ఒత్తిడి పెంచి సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏపీకి మేలు జరుగుతుంది. మరి ఆ విధంగా చంద్రబాబు చేయగలుగుతారా? లేక జగన్‌మోహన్‌ రెడ్డిను నిందించడానికే ప్రాధాన్యత ఇస్తారా?– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Kalki 2898 AD Release Trailer
ఈసారి ప్రిపేరై వచ్చాను!

ప్రభాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. భైరవ పాత్రలో ప్రభాస్, సుమతి పాత్రలో దీపిక, అశ్వత్థామ పాత్రలో అమితాబ్, సుప్రీమ్‌ యాక్సిన్‌గా కమల్‌ కనిపిస్తారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సి. అశ్వినీదత్‌ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ నెల 27న రిలీజ్‌ కానుంది.ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘సమయం వచ్చింది. భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపున భగవంతుడే ఉన్నాడు, నేను కాపాడతా..’ (అమితాబ్‌), ‘ఎన్ని యుగాలైనా... ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు... మారలేడు’ (కమల్‌) ‘ఒక పెద్ద బౌంటీ... వన్‌ షాట్‌... కాంప్లెక్స్‌కి వెళ్లిపోతా..., సరే... ఇంక చాలు, ఈసారి ప్రిపేరై వచ్చాను... దా’ అనే డైలాగ్స్‌తో పాటు ‘మాధవా...’ అనే పాట కూడా ఈ ట్రైలర్‌లో వినిపిస్తుంది. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ స్వరకర్త.

Centre will protect interests of Singareni says Kishan Reddy
సింగరేణిపై ప్రధానితో చర్చిస్తా

సాక్షి, హైదరాబాద్‌: బొగ్గు గనుల వేలం ద్వారా సింగరేణి సంస్థకి నష్టం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి సంస్థకు లాభం చేయాలన్న ఉద్దేశమే కేంద్రానికి ఉంటుందని అన్నారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞ ప్తితో పాటు ఆయన లేవనెత్తిన ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.కేంద్ర బొగ్గు, గనుల శాఖ సీనియర్‌ అధికారులతో పాటు సింగరేణి సంస్థ అధికారులతో ఈ అంశాలపై చర్చిస్తానన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో బొగ్గు గనుల 10వ దఫా వేలం ప్రక్రియను శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో కిషన్‌రెడ్డి ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను ఈ కార్యక్రమంలో ప్రారంభించగా, ఇందులో సింగరేణి ప్రాంతం పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి సంస్థకు ఉన్న ప్రాముఖ్యత ఈ ప్రాంత వాసిగా నాకు బాగా తెలుసు.అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల వేలం నిర్వహిస్తున్నాం. బహిరంగ వేలంలో గనులు పొందిన ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు.. కేటాయింపుల ద్వారా గనులు పొందడం కంటే ఎక్కువ లాభాన్ని పొందుతున్నాయి. దేశాభివృద్ధికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిని పెంచడం, పారదర్శకతను తీసుకురావడం, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడడమే వేలం లక్ష్యం. కేంద్రానికి ఆదాయం కోసం కాదు.ఓపెన్‌ రెవెన్యూ షేరింగ్‌ పద్ధతిలో గనులను కేటాయిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలే లబ్ధి పొందుతున్నాయి. 10 ఏళ్ల రాష్ట్రంలో తీవ్ర విద్యుత్‌ కొరత ఉండేది. విద్యుత్‌ కోసం పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేశారు. కానీ కేంద్రం అవలంభిస్తున్న విధానాలతోనే నేడు విద్యుత్‌ కొరత లేదు..’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నైనీలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు ‘సింగరేణి సంస్థకు 2015లో ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గని కేటాయించగా, అనేక సమస్యలతో ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఇటీవల ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచి్చంది. అక్కడి సీఎంతో స్వయంగా మాట్లాడి నైనీ బొగ్గు బ్లాకులో సత్వరం ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటా. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో 15 శాతం నైనీలోనే ఉత్పత్తి కానుంది..’అని కేంద్రమంత్రి తెలిపారు. గుదిబండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాలు ‘గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సింగరేణికి గుదిబండగా మారాయి. సింగరేణి సంస్థను నష్టాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థలతో పోలి్చతే సింగరేణి సంస్థ ఉత్పత్తి తగ్గింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి కార్మికులకు మేలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సింగరేణి కార్మికులతో కూడా మాట్లాతాం.సింగరేణి సంస్థలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. సంస్థ విషయంలో మాకూ బాధ్యత ఉంది..’అని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్‌ చంద్రదూబే, కార్యదర్శి అమ్రీత్‌లాల్‌ మీనా, సహాయ కార్యదర్శి ఎన్‌.నాగరాజు, సింగరేణి సంస్థ ఇన్‌చార్జి సీఎండీ ఎన్‌.బలరామ్, ఇంధన శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సింగరేణి’సమస్యల పరిష్కారానికి కృషి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞప్తులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మరిన్ని విషయాలు చెబుతానని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత తమ శాఖ అధికారులతో చర్చించి సింగరేణి సంస్థకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో తెల్లకాగితాలపై రాసిస్తే బొగ్గు బ్లాకులు కేటాయించారని విమర్శించారు. తాము అత్యంత పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు.

Quinton de Kock, David Miller guide South Africa to 163-6 against England
T20 WC 2024: చెలరేగిన డికాక్‌, మిల్లర్‌.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ ఎంతంటే?

టీ20 వరల్డ్‌కప్‌-2024 సూపర్‌-8లో​ భాగంగా సెయింట్‌ లూసియా వేదికగా దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. డికాక్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ఇంగ్లీష్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా 38 బంతులు ఎదుర్కొన్న డికాక్‌.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. అతడితో పాటు డేవిడ్‌ మిల్లర్‌ మెరుపులు మెరిపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న మిల్లర్‌ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 పరుగులు చేశాడు. ప్రోటీస్‌ బ్యాటర్లలో వీరిద్దరి మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్‌ మార్‌క్రమ్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా మార్‌క్రమ్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా అర్చర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. మొయిన్‌ అలీ, రషీద్‌ తలా వికెట్‌ సాధించారు.

Indian Government Responded On Canada parliament Tribute
నిజ్జర్‌కు కెనడా నివాళి.. స్పందించిన భారత ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్‌ సంతాపం ప్రకటించడంపై భారత ప్రభుత్వం శుక్రవారం(జూన్‌ 21) స్పందించింది. వేర్పాటువాదం, హింసను సమర్థించే చర్యలను వ్యతిరేకిస్తామని తెలిపింది. గతేడాది జూన్‌లో కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా బయట నిజ్జర్‌ను కొందరు దుండగులు కాల్చి చంపారు.ఈ ఘటన వెనుక భారత ‘రా’ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య విభేదాలు ఏర్పడ్డాయి. ట్రూడో ఆరోపణలను అప్పట్లో భారత్‌ ఖండించింది. హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా ప్రభుత్వం ఆ దేశ పార్లమెంట్‌లో ఇటీవల నిజ్జర్‌కు నివాళులర్పించడం గమనార్హం. ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించడమే కాకుండా ఇంటర్‌పోల్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న వ్యక్తి మృతికి దేశ పార్లమెంట్‌లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం దీనికి తగిన కౌంటర్ కూడా ఇచ్చింది.ఎయిర్‌ ఇండియాా కనిష్క విమానాన్ని గాల్లో పేల్చివేసి ఈ జూన్‌ 23కు 39 సంవత్సరాలు పూర్తవుతుంది. ఖలిస్తానీ తీవ్రవాదులు పెట్టిన బాంబుకు ఆ విమానం ముక్కలు కావడంతో 329 మంది మృతి చెందారు. ఆ రోజున వాంకోవర్‌లో ఉన్న ఎయిర్‌ ఇండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించనున్నట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Cracks On Atal Setu, Alleges Mumbai Vs Bjp
అటల్‌ సేతుకి పగుళ్లా?..అందులో నిజమెంత?

ముంబై : రాకపోకలు ప్రారంభించిన నెలల వ్యవధిలో అటల్‌ సేతు పగుళ్లు ఏర్పడ్డాంటూ మహరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు‌ నానా పటోలే ఆగ్రహం వ్యక్తం చేశారు. అటల్‌ సేతు పగుళ్లు ఏర్పడిన ప్రాంతానికి మీడియాను వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అటల్‌ సేత నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు.వంతెన నిర్మాణంలో నాణ్యతలేదు. కాబట్టే పగుళ్లు ఏర్పడ్డాయని, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని కర్రతో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అటల్ సేతు వంతెన ప్రారంభోత్సవం జరిగిన కొన్ని నెలల్లో ఒక భాగం పగుళ్లు ఏర్పడింది. నిర్మాణ కోసం రూ.18,000 కోట్లు ఖర్చు చేసింది అని అన్నారు. అయితే, బీజేపీతో పాటు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించిన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ) మాత్రం ఈ పగుళ్లు బ్రిడ్జిపైన కాకుండా నవీ ముంబైలోని ఉల్వే రహదారిపై ఏర్పడ్డాయని పేర్కొంది.ఈ సందర్భంగా ఎంటీహెఎల్‌ వంతెనపై పగుళ్లు ఏర్పడ్డాయని పుకార్లు వ్యాపించాయి. ఈ పగుళ్లు బ్రిడ్జిపైనే కాకుండా ఉల్వే నుండి ముంబై వైపు ఎంటీహెచ్‌ఎల్‌ని కలిపే రోడ్డుపైనే ఏర్పాడ్డాయని గుర్తించాలని అని ఎంఎంఆర్‌డీఏ తెలిపింది. అటల్ సేతుపై దుష్ప్రచారం ఆపండి అంటూ బీజేపీ ఎక్స్‌ వేదికగా స్పందించింది. ఇది సర్వీస్ రోడ్డు. ఇది ప్రధాన వంతెనకు అనుసంధానించే భాగం. ఇవి చిన్నపాటి పగుళ్లు. రేపు సాయంత్రంలోగా వాటిని సరిచేస్తాం. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడలేదు అని అటల్‌ సేతు ప్రాజెక్ట్‌ హెడ్‌ కైలాష్ గణత్ర తెలిపారు.

French Woman Sues Employer for 20 Year Salary Without Work Check The Full Details
పని చెప్పకుండా జీతం ఇస్తోంది.. కంపెనీపై కేసు పెట్టిన మహిళ

ఆఫీసులో ఏదైనా పని చెబితే తప్పుంచుకోవాలని చూసే ఉద్యోగులు ప్రతి సంస్థలోనూ కొంత మంది ఉంటారు. పని చెప్పకుండా జీతం ఇస్తే చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ పని చేయకుండా 20 సంవత్సరాలుగా జీతం ఇస్తున్న కంపెనీ మీదే ఓ మహిళ కేసు వేసింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? వివరాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.ఫ్రాన్స్‌కు చెందిన లారెన్స్ వాన్ వాసెన్‌హోవ్ అనే మహిళకు తమ కంపెనీ ఎలాంటి పని చెప్పలేదని, అయితే ప్రతి నెలా జీతం మాత్రం ఇచ్చేస్తున్నారని.. సంస్థ మీద దావా వేసింది. 1993లో వాసెన్‌హోవ్‌ను ఫ్రాన్స్ టెలికాం నియమించుకుంది. ఆ తరువాత ఈ కంపెనీని ఆరెంజ్ సంస్థ టేకోవర్ చేసింది.ఆరెంజ్ కంపెనీ టేకోవర్ చేసిన తరువాత వాసెన్‌హోవ్‌కు ఒక వైపు పక్షవాతం, మూర్ఛతో బాధపడుతున్నట్లు తెలుసుకుంది. ఈ కారణంగానే ఆమెకు నచ్చిన ఆఫర్ ఎంచుకోమన్నారు. ఆ సమయంలో ఆమె ఫ్రాన్స్‌లోని మరొక ప్రాంతానికి బదిలీని అభ్యర్థించింది. కానీ తనకు తగిన వర్క్‌ప్లేస్‌ను కంపెనీ ఎంపిక చేయలేకపోయింది. దీంతో ఆమె కోరికను కంపెనీ తీర్చలేకపోయింది.ఫ్రాన్స్‌లోని మరొక ప్రాంతానికి బదిలీ చేయడానికి కంపెనీ సాహసం చేయలేదు, దీంతో ఆమెకు ఎలాంటి పని అప్పగించేలేదు. పని అప్పగించకపోయినా.. జీతం మాత్రం ప్రతి నెల అందించేవారు. ఇలా దాదాపు 20 ఏళ్లుగా తనకు కంపెనీ జీతం ఇస్తున్నట్లు వాసెన్‌హోవ్‌ పేర్కొన్నారు.ఏ పని చేయకుండా జీతం పొందడం అనేది చాలా మందికి కల కావొచ్చు. కానీ వాసెన్‌హోవ్‌కు ఇది నచ్చలేదు. దీంతో ఈమె 2015లో తనపై వివక్ష చూపుతున్నారని ప్రభుత్వానికి & అథారిటీకి ఫిర్యాదు చేసింది. పని చేయకపోవడం ఒక ప్రత్యేక హక్కు కాదు అని ఆమె వాదించింది.వాసెన్‌హోవ్‌ తరపున న్యాయవాది డేవిడ్ నాబెట్-మార్టిన్ కూడా ఒంటరిగా ఉండటం వల్ల ఆమె డిప్రెషన్‌కు లోనయ్యిందని పేర్కొన్నారు. అయితే కంపెనీ ఈమెకు అన్ని పరిస్థితుల్లోనూ అండగా ఉందని, ఆమెకు ఆరోగ్యం కుదుటపడితే అడాప్టెడ్ పొజిషన్‌లో మళ్ళీ విధులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.

Singer Lucky Ali Filed Complaint Karnataka Lokayukta Police Against Ias Officer Rohini Sindhuri
ఐఏఎస్‌ రోహిణి సింధూరి నా భూమిని కబ్జా చేశారు.. ప్రముఖ సింగర్‌ ఫిర్యాదు

బెంగళూరు : కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదం చిక్కుకున్నారు. బెంగళూరు శివార్లలోని తన వ్యవసాయ భూమిని ఐఏఎస్ అధికారిణి, ఆమె కుటుంబ సభ్యులు కబ్జా చేశారంటూ దివంగత హాస్యనటుడు మెహమూద్ అలీ కుమారుడు,గాయకుడు లక్కీ అలీ ఆరోపించారు. వివాదాస్పద ఆస్తి యలహంకలోని కంచెనహళ్లి ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం.తన భూమి కబ్జాకు గురైందని కలెక్టర్‌ రోహిణి సింధూరి, ఆమె భర్త సుధీర్ రెడ్డి, బావమరిది మధుసూదన్ రెడ్డిలపై లక్కీ అలీ కర్ణాటక లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.pic.twitter.com/GeUF0N9Y4k— Lucky Ali (@luckyali) June 20, 2024లక్కీ అలీకి, రోహిణి సింధూరి ట్రస్ట్‌కు చెందిన వ్యవసాయ భూమిపై వివాదం కొనసాగుతుంది. కొన్నేళ్ల క్రితం తన భూమి కబ్జాకు గురవుతుందని, సదరు ఐఏఎస్‌ అధికారికి స్థానిక పోలీసులు సహకరిస్తున్నారని లక్కీ అలి ఆరోపించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులను అభ్యర్థించారు. వ్యవసాయ భూమిని అక్రమంగా లాక్కోవడానికి 'ల్యాండ్ మాఫియా' కుట్ర పన్నిందని కూడా ఆయన పేర్కొన్నారు.డిసెంబర్ 2022లో, అలీ కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ఒక థ్రెడ్‌లో ట్యాగ్ చేసి, ట్రస్ట్ యాజమాన్యంలోని తన వ్యవసాయ భూమిని రోహిణి సింధూరి, సుధీర్ రెడ్డి,మధు రెడ్డి సహాయంతో ల్యాండ్ మాఫియా అక్రమంగా లాక్కుంటున్నారని తెలిపారు. తాజాగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

Actress Poonam Kaur Tweet Goes Viral In Social Media
మోసం, కుట్రలతో గెలవడం కంటే ఓటమే మేలు: టాలీవుడ్ హీరోయిన్‌ సంచలన పోస్ట్

నటి పూనమ్ కౌర్‌ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది బ్యూటీ. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా పూనమ్ కౌర్‌ తాజాగా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్‌ ఏముందో ఓ లుక్కేద్దాం పదండి.పూనమ్ కౌర్‌ తన ట్వీట్‌లో రాస్తూ.. కుట్రపూరితంగా, మోసం చేసి గెలవడం కంటే.. ఒక యోధుడిగా ఓడిపోవడమే మేలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఏపీలో జరిగిన ఎన్నికల గురించే పోస్ట్ చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. Loosing as a principled warrior is better than winning as conspiring cheater .#justthoughts— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 21, 2024

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement