అది ఆపిల్‌ పండు కాదమ్మా.. ఆపిల్‌ కంపెనీ! Pakistani TV Anchor Confuses Apple Inc with Fruit | Sakshi
Sakshi News home page

అది ఆపిల్‌ పండు కాదమ్మా.. ఆపిల్‌ కంపెనీ!

Published Sat, Jul 6 2019 4:30 PM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM

లైవ్‌ టీవీలో చర్చ నడుస్తోంది. చర్చలో మాట్లాడుతున్న విశ్లేషకుడు యాపిల్‌ గురించి ఉదాహరణగా చెప్పాడు. ఆపిల్‌ బిజినెస్‌ మన దేశ బడ్జెట్‌ కంటే కూడా ఎన్నోరెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పాడు. దానికి, ‘ఔనౌను.. ఆపిల్‌ పండ్ల బిజినెల్‌ చాలా బాగా జరుగుతోందట. ఆపిల్‌ పండ్లలో ఎన్నో వెరైటీలు కూడా ఉంటాయంటూ ఆ విశ్లేషకుడితోపాటు టీవీ చూస్తున్న జనాలకు షాక్‌ ఇచ్చింది ఓ టీవీ యాంకర్‌. పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ చానెల్‌లో చర్చ సందర్భంగా ఈ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. టీవీలో లైవ్‌ చర్చకు వచ్చిన ప్యానలిస్ట్‌.. పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. పాక్‌ బడ్జెట్‌ కంటే కూడా యాపిల్‌ బిజినెస్‌ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. దీనికి ఆపిల్‌ అంటే అనుకున్నయాంకర్‌ ఇచ్చిన బదులు ఇప్పుడు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో సెటైర్లు, జోకులు వెళ్లువెత్తుతున్నాయి. పాక్‌ టీవీ చర్చలు ఇలానే కామెడీగా ఉంటాయని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement