అమెరికా మత స్వేచ్ఛ రిపోర్టు.. రిజెక్ట్‌ చేసిన భారత్‌ Indian Government Rejects Us Religious Freedom Report | Sakshi
Sakshi News home page

అమెరికా మత స్వేచ్ఛ రిపోర్టులో వాస్తవాల్లేవు: భారత్‌

Published Fri, Jun 28 2024 6:46 PM | Last Updated on Fri, Jun 28 2024 7:24 PM

Indian Government Rejects Us Religious Freedom Report

న్యూఢిల్లీ: అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023 పూర్తిగా పక్షపాతవైఖరితో కూడినదని భారత్‌ విమర్శించింది. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు  ప్రకటించింది. 

ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ శుక్రవారం(జూన్‌28) ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. 

భారత్‌లో సామాజిక కూర్పును అర్థం చేసుకోకుండా కేవలం ఓట్‌బ్యాంకు పాలిటిక్స్‌​ ఆధారంగా తయారు చేసిన నివేదికలా అది కనిపిస్తోందన్నారు. ‘రిపోర్టులో చాలా పొరపాట్లున్నాయి. 

ఎంపిక చేసుకున్న అంశాలను వారికి కావల్సిన చోట కావల్సినట్లుగా అన్వయించుకున్నారు. పక్షపాత వైఖరితో తయారు చేశారు. రాజ్యాంగ నిబంధనలను చట్టాలకు కూడా తమకు కావల్సినట్లుగా భాష్యం చెప్పారు’అని జైస్వాల్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement