ట్రాఫిక్‌పై డ్రోన్‌ కన్ను Police to deploy drone to ensure smoother traffic flow in Cyberabad: ts | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌పై డ్రోన్‌ కన్ను

Published Mon, Jun 17 2024 6:31 AM

Police to deploy drone to ensure smoother traffic flow in Cyberabad: ts

వాహనాల రద్దీ, ట్రాఫిక్‌ జామ్‌లు, రోడ్డు ప్రమాదాలపై లైవ్‌ ఫోకస్‌ వానాకాలంలో నీరు నిలిచే ప్రాంతాల గుర్తింపు కూడా.. 

ఈ పరిశీలన ఆధారంగా వాహనాల మళ్లింపు, సిగ్నల్‌ ఆపరేటింగ్, ఇతర చర్యలకు వీలు 

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో డ్రోన్‌ కెమెరాల అనుసంధానం 

అందుబాటులోకి తెచ్చిన సైబరాబాద్‌ పోలీసులు

తొలుత ఐటీ కారిడార్‌లోని పలు ప్రాంతాల్లో వినియోగం

సాక్షి, హైదరాబాద్‌:  నిత్యం బిజీగా ఉండే రోడ్డు.. మధ్యలో ఓ కారు మొరాయించి నిలిచిపోయింది. దాంతో ట్రాఫిక్‌ జామ్‌ మొదలైంది. ఆ ప్రాంతానికి పైన గాల్లో ఎగురుతున్న ‘డ్రోన్‌’ద్వారా పోలీసులు ఇది చూశారు. వెంటనే ట్రాఫిక్‌ రిలీఫ్‌ వ్యాన్‌ వచి్చ, మొరాయించిన కారును అక్కడి నుంచి తరలించింది. వాహనాలన్నీ సాఫీగా ముందుకు సాగిపోయాయి. అంటే భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కాకముందే.. సమస్య పరిష్కారమైపోయింది. ఇదేదో చాలా బాగుంది కదా. ఇకపై గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ చిక్కులకు ఇలా సింపుల్‌గా చెక్‌ పడిపోనుంది. 

తొలుత సైబరాబాద్‌ పరిధిలో.. 
సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో దీనికి సంబంధించి ‘థర్డ్‌ ఐ ట్రాఫిక్‌ మానిటరింగ్‌ డ్రోన్‌’అందుబాటులోకి వచ్చేసింది. పైలట్‌ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి, హఫీజ్‌పేట, హైటెక్‌ సిటీ, మాదాపూర్, రాయదుర్గం తదితర ఐటీ కారిడార్‌ ప్రాంతాల్లో ఆదివారం ఈ డ్రోన్‌ను వినియోగించారు. రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌లు, వాహనాల రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉంది? జంక్షన్ల వద్ద వాహనాల వేగం ఎలా ఉంది? ఎక్కడైనా నీరు నిలిచి ఉందా? అనే అంశాలతోపాటు రోడ్డు ప్రమాదాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఏదైనా సమస్య ఏర్పడితే ట్రాఫిక్‌ పోలీసు బృందాలు వెంటనే స్పందించి పరిష్కరించవ చ్చు. వాహనాలు సు లభంగా, వేగంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. 

ఎలా పనిచేస్తాయంటే..? 
థర్మల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీల సాయంతో ఈ డ్రోన్‌ సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానమై ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 150–170 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ డ్రోన్‌కు ఉండే మూడు అత్యాధునిక కెమెరాలతో, ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు మీద ట్రాఫిక్‌ జామ్‌లు, వాహనాల రద్దీ, కదలికలను చిత్రీకరిస్తుంది.

రియల్‌ టైమ్‌లో కంట్రోల్‌ సెంటర్‌కు పంపిస్తుంది. కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బంది ట్రాఫిక్‌ పరిస్థితి, రద్దీని విశ్లేíÙంచి, ఏదైనా సమస్య ఉంటే గమనించి క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇస్తారు. తద్వారా ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరిస్తారు. గాలిలో ఏకధాటిగా 45 నిమిషాల పాటు తిరగగలిగే సామర్థ్యమున్న ఈ డ్రోన్‌ 15 కిలోమీటర్ల దూరం వరకు హెచ్‌డీ క్వాలిటీ వీడియోను పంపించగలదు. 

ఇతర కమిషనరేట్లలో.. 
సైబరాబాద్‌ పోలీసుల ట్రాఫిక్‌ నిర్వహణ కోసం డ్రోన్లను వినియోగించాలని గతంలోనూ ఆలోచన చేశారు. అప్పుడప్పుడు డ్రోన్లను అద్దెకు తీసుకొచ్చి వినియోగించేవారు. తాజాగా కార్పొరేట్‌ సామాజిక సేవ (సీఎస్‌ఆర్‌) కింద ‘సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్సీఎస్సీ)’నిధులతో సొంతంగా ఒక డ్రోన్‌ను కొనుగోలు చేశారు. దీని ఫలితాలను బట్టి మరిన్ని డ్రోన్లను సమకూర్చుకోనున్నారు.

ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్‌ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్‌–ఈ–బరాత్‌ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు. ఇకపై ట్రాఫిక్‌ పర్యవేక్షణ కోసమూ వినియోగించనున్నారు. హైదరాబాద్‌లో డ్రోన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘డీ–కెమో’విభాగం ఉంది. దీనికి డీసీపీ/ఏసీపీ ర్యాంకు అధికారి హెడ్‌గా ఉంటారు.

ట్రాఫిక్‌ పోలీసులకు శిక్షణ 
డ్రోన్‌ ఆపరేషన్‌ ప్రాథమిక దృష్టి ముఖ్యంగా ఐటీ కారిడార్‌ మీద ఉంటుంది. ఇక్కడ అధిక ట్రాఫిక్‌ ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్‌ పోలీసులకు డ్రోన్‌ సాయం అందిస్తుంది. ఈ మేరకు డ్రోన్‌ వినియోగంపై ట్రాఫిక్‌ పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నాం. – అవినాష్‌ మహంతి,పోలీస్‌ కమిషనర్, సైబరాబాద్‌

‘ట్రాఫిక్‌’కు వాడే డ్రోన్‌ ప్రత్యేకతలు ఇవీ:

డ్రోన్‌ పేరు:    మావిక్‌ 3 ప్రో 
ధర:    రూ.5.5 లక్షలు 
బరువు:    ఒక కిలో 
బ్యాటరీ:    5 వేల ఎంఏహెచ్‌. సుమారు 4 గంటల బ్యాకప్‌ 
గరిష్ట ఎత్తు: భూమి ఉపరితలం నుంచి  400 మీటర్లు 
విజిబులిటీ:    5 కిలోమీటర్ల దూరం వరకు 
గరిష్ట వేగం:    సెకన్‌కు 8 మీటర్లు. గాలి, వర్షం లేకపోతే వరి్టకల్‌గా సెకన్‌కు 21 మీటర్ల వేగంతో  ఎగరగలదు. 
స్టోరేజ్‌       8 జీబీ నుంచి 1 
సామర్థ్యం: టీబీ వరకు ఉంటుంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement