వారసుడిని ప్రకటించిన డేవిడ్‌ వార్నర్‌.. ఆసీస్‌ ​​కొత్త ఓపెనర్‌ ఎవరంటే? Retiring David Warner hands over baton to Jake Fraser McGurk | Sakshi
Sakshi News home page

T20 WC: వారసుడిని ప్రకటించిన డేవిడ్‌ వార్నర్‌.. ఆసీస్‌ ​​కొత్త ఓపెనర్‌ ఎవరంటే?

Published Wed, Jun 26 2024 10:51 AM | Last Updated on Wed, Jun 26 2024 12:04 PM

Retiring David Warner hands over baton to Jake Fraser McGurk

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ప్ర‌యాణం ముగిసింది.  ఇప్ప‌టికే వ‌న్డేల‌కు, టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వార్న‌ర్‌.. ఇప్పుడు టీ20ల నుంచి త‌ప్పుకున్నాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో అఫ్గానిస్తాన్‌- బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంతో వార్న‌ర్ అంత‌ర్జాతీయ కెరీర్ ముగిసింది. 

ఇదివ‌ర‌కే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ అనంత‌రం త‌న రిటైర్ అవుతానని వార్న‌ర్ ప్ర‌క‌టించేశాడు. దీంతో త‌న చివ‌రి మ్యాచ్‌ను వార్న‌ర్ భార‌త్‌పై ఆడేశాడు. ఇక వార్న‌ర్ త‌న వారసుడిగా ఆసీస్ యువ సంచ‌ల‌నం  జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌ను ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం క‌రేబియ‌న్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న వార్న‌ర్‌ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌తో కలిసి ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

"ఇక నుంచి అంతా నీదే ఛాంపియ‌న్ అంటూ" వార్నర్ క్యాప్షన్‌గా ఇచ్చాడు. కాగా మెక్‌గర్క్‌కు టీ20 వరల్డ్‌కప్ ప్రధాన జట్టులో చోటు దక్కకపోయినప్పటికి బ్యాకప్  ఓపెనర్‌గా రిజర్వ్‌లో ఉన్నాడు. మెక్‌గర్క్ కూడా ప్రస్తుతం ఓపెనర్‌గా సత్తాచాటుతున్నాడు. ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఫ్రెజర్.. 9 మ్యాచ్‌ల్లో 230 పరుగులు చేశాడు. 

ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ట్రావిస్‌ హెడ్‌తో కలిసి మెక్‌గర్క్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. ఇక ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8786,  6932, 3277 పరుగులు సాధించాడు. వార్నర్‌ ఇక పై ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగనున్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement