దానం నాగేందర్‌తో సహా పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు High Court Notices to Khairatabad MLA Danam Nagender | Sakshi
Sakshi News home page

దానం నాగేందర్‌తో సహా పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

Published Fri, Mar 22 2024 3:37 PM | Last Updated on Fri, Mar 22 2024 4:24 PM

High Court Notices to Khairatabad MLA Danam Nagender - Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్‌ ఎన్నిక‌ను ర‌ద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్ధి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్‌ విజయ్‌ సేన్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దానం నాగేంద‌ర్ ఓటర్లను ప్ర‌లోభ‌పెట్టార‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పున సుంక‌ర న‌రేశ్ కోర్టుకు తెలిపారు. ఓటర్లకు డ‌బ్బులు పంచ‌డంతో పోలీసు స్టేష‌న్లలో కేసులు న‌మోదు అయ్యాయ‌ని చెప్పారు. ఆయ‌న స‌తీమ‌ణి పేరు మీద ఉన్న ఆస్తుల వివ‌రాల‌ను నామినేష‌న్ ప‌త్రాల్లో పేర్కొన‌లేద‌న్నారు. వాదనలు విన్న హైకోర్టు.. వివ‌ర‌ణ ఇవ్వాలంటూ దానం నాగేంద‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే నెల 18కి వాయిదా వేసింది.

దానంతోపాటు పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్‌, కోవా లక్ష్మి, మాగంటి గోపీనాథ్‌, కూనంనేని, మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌ రెడ్డికి నోటీసులు పంపింది. వీరంతా ఎన్నికల్లో తప్పుడు అఫడవిట్లు సమర్పించారని హైకోర్టులో వేర్వేరు పిటిషనలు దాఖలయ్యాయి.

చదవండి: హస్తం గూటికి జీహెచ్‌ఎంసీ మేయర్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement