‘కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’ | BRS Niranjan Reddy Slams Congress Party Over Jurala Project | Sakshi
Sakshi News home page

‘కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’

Published Wed, Feb 21 2024 4:06 PM | Last Updated on Wed, Feb 21 2024 4:32 PM

BRS Niranjan Reddy Slams Congress Party Over Jurala Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వచ్చిన తర్వాతనే జూరాలను నిండుగా నింపుకున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జూరాల సామర్ధ్యం ఆరున్నర టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. ఆయన  తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘జూరాలకు గరిష్టంగా వరద వచ్చేది 40 రోజులు మాత్రమే. నీటి పారుదల శాఖా మంత్రి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణ నీటివాటా తేలేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీర్చిదిద్దుకున్నాం.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అన్ని పనులు పూర్తయ్యాయి.  ఏడు నుండి పది శాతం పనులే మిగిలిపోయాయి.. 90 శాతం పనులు పూర్తయ్యాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ మీద బురదజల్లుతున్నారు. ప్రాజెక్ట్ మీద వంద కేసులు వేసిన పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలు.. వాటిని ఎదుర్కొని పనులు పూర్తి చేశాం. కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’అని నిరంజన్‌రెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement