Vijay Hazare Trophy: తన్మయ్‌ అగర్వాల్‌ మెరుపులు. హైదరాబాద్‌ శుభారంభం  | Vijay Hazare Trophy 2021: Hyderabad Won By 5 Wickets Vs Haryana | Sakshi
Sakshi News home page

Vijay Hazare Trophy: తన్మయ్‌ అగర్వాల్‌ మెరుపులు. హైదరాబాద్‌ శుభారంభం 

Published Thu, Dec 9 2021 9:02 AM | Last Updated on Thu, Dec 9 2021 9:10 AM

Vijay Hazare Trophy 2021: Hyderabad Won By 5 Wickets Vs Haryana - Sakshi

మొహాలీ: విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు శుభారంభం చేసింది. హరియాణాతో బుధవారం జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’ లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తిలక్‌ వర్మ (4/23), రవితేజ (3/23) ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హరియాణా 39.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హైదరాబాద్‌ 41 ఓవర్లలో ఐదు వికెట్లకు 167 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (77 నాటౌట్‌; 5 ఫోర్లు), కొల్లా సుమంత్‌ (20), తనయ్‌ (18 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్‌ ఆడుతుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement