కోచ్‌ అనే పదానికి అర్థం మారుస్తున్న ద్రవిడ్‌.. వీడియో వైరల్‌ Rahul Dravid Turns Spinner For Team India Nets Ahead Of Kanpur Test vs NZ | Sakshi
Sakshi News home page

Rahul Dravid: కోచ్‌ అనే పదానికి అర్థం మారుస్తున్న ద్రవిడ్‌.. వీడియో వైరల్‌

Published Wed, Nov 24 2021 6:24 PM | Last Updated on Wed, Nov 24 2021 8:28 PM

Rahul Dravid Turns Spinner For Team India Nets Ahead Of Kanpur Test vs NZ - Sakshi

Head Coach Rahul Dravid Turns Spinner For Team India During Practice.. రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా అవతారం ఎత్తినప్పటి నుంచి టీమిండియా ప్రాక్టీస్‌లో వైవిధ్యత కనిపిస్తుంది. ఇంతవరకు జట్టు హెడ్‌కోచ్‌ అంటే దగ్గరుండి పర్యవేక్షిస్తాడు అని మాత్రమే ఉండేది. ద్రవిడ్‌ మాత్రం ఆ మాటకు అర్థాన్ని మార్చేసి కోచ్‌గా తనదైన ముద్ర చూపిస్తున్నాడు. కోచ్‌గా కాస్త కఠినంగా కనిపించే ద్రవిడ్‌.. క్రమశిక్షణ విషయంలోనూ అంతే కచ్చితంగా ఉంటాడు. ఇక నవంబర్‌ 25 నుంచి న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు జరగనున్న నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్‌లో స్పీడ్‌ పెంచింది.  ప్రాక్టీస్‌లో భాగంగా స్పిన్నర్‌ అవతారమెత్తిన ద్రవిడ్‌ బ్యాట్స్‌మెన్‌కు బంతులు విసరడం వైరల్‌గా మారింది. 

చదవండి: T.Natarajan: అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా

ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి చవిచూసిన టీమిండియా దానికి బదులు తీర్చుకోవాలని చూస్తుంది. రహానే సారధ్యంలోని టీమిండియా జట్టు కొత్తగా కనిపిస్తుంది. కోహ్లి, రోహిత్‌, షమీ, బుమ్రా లాంటి సీనియర్లు గైర్హాజరీలో.. టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఇక కేఎల్‌ రాహుల్‌ గాయంతో సిరీస్‌ నుంచి వైదొలగడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. మరోవైపు న్యూజిలాండ్‌ మాత్రం పూర్తిస్థాయి టెస్టు టీమ్‌తో బరిలోకి దిగనుంది.

చదవండి: ICC T20 Rankings: విరాట్‌ కోహ్లి ఔట్‌.. కేఎల్‌ రాహుల్‌ ఒక్కడే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement