-
'ది గ్రేట్ వాల్'.. కప్పు కొట్టించాడు! తన ప్రస్ధానాన్ని ముగించాడు
టీ20 వరల్డ్‌కప్-2024 ఘనంగా ముగిసింది. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌ను టీమిండియా ఎగురేసుకోపోయింది. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కీలకమైన ఫైనల్లోనూ సత్తాచాటింది. శనివారం బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత జట్టు.. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది.భారత జట్టుకు సారథిగా వరల్డ్‌కప్ ట్రోఫీని అందించాలన్న రోహిత్ శర్మ కల ఎట్టకేలకు నేరవేరింది. అదే విధంగా భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించి తన ప్రస్ధానాన్ని ముగించాలన్న రాహుల్ ద్రవిడ్ కోరిక కూడా ఈ విజయంతో తీరింది. వీరిద్దరితో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం తన కెప్టెన్ సాధించలేకపోయిన ట్రోఫీని.. కనీసం ఆటగాడిగానైనా దక్కించుకున్నందుకు ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ గుడ్ బై చెప్పగా.. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా భారత జట్టుతో తన ప్రయాణాన్ని ముగించాడు.ముగిసిన రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం..భారత పురుషల జట్టు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం ముగిసింది. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నద్రవిడ్.. తన మార్క్‌ను కోచింగ్‌లోనూ చూపించాలనుకున్నాడు.ఈ క్రమంలోనే 2021 నవంబరులో రవి శాస్త్రి నుంచి భారత హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించాడు. అయితే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. 2013 నుంచి భారత్‌ను ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని సాధించడమే లక్ష్యంగా ద్రవిడ్ పెట్టుకున్నాడు.ఇది అతడి లక్ష్యం మాత్రమే కాదు అతడి ముందు ఉన్న సవాలు కూడా. ఎందుకంటే ద్వైఫాక్షిక సిరీస్‌లలో మాత్రమే అదరగొడుతుందని, ఐసీసీ టోర్నీల్లో మాత్రం తేలిపోతుందన్న ఆపఖ్యాతి అప్పటికే భారత్ మూటకట్టుకుంది. ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి.2022 ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022లోద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ చేరినప్పటకి.. అక్కడ కూడా మళ్లీ నిరాశే. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఎంతమంది కోచ్‌లు మారిన ఐసీసీ టోర్నీల్లో భారత్ తల రాత మారలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ద్రవిడ్ ఎక్కడా కుంగిపోలేదు. ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తాచాటిన టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఆ మెగా టోర్నీలో భారత్ ప్రదర్శన చూసి అంతా కప్ మనదే అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఆసీస్ చేతిలో తుది మెట్టుపై భారత్ బోల్తా పడింది. మళ్లీ ద్రవిడ్‌కు నిరాశే మొదలైంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌తో తన పదవీ కాలం ముగిసినప్పటికి మరో ఏడాది తన కాంట్రాక్ట్‌ను పొడిగించాడు. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టే తన ప్రస్ధానాన్ని ముగించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మిషన్ టీ20 వరల్డ్‌కప్ 2024ను ద్రవిడ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకప్పుడు మైదానంలో బౌలర్ల ఓపికను పరీక్షించిన ద్రవిడ్‌కు.. ఈ నిరీక్షణ పెద్ద లెక్కేమి కాదు. గతం గతహా అన్నట్లు ఆటగాళ్లను పొట్టి ప్రపంచకప్ కోసం అన్ని విధాలగా సన్నద్దం చేశాడు. సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్‌తో కలిసి గొప్ప సమన్వయంతో వ్యవహరించిన ద్రవిడ్ 24 మంది ఆటగాళ్లతో కూడిన ఒక పూల్న్ని సిద్దం చేశాడు. ప్రపంచకప్‌కు కొన్ని నెలల ముందు భారత జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లంతా ఈ పూల్‌లోని వాళ్లే. ఇందులో నుంచి 15 మంది అత్యుత్తమ ఆటగాళ్లను టీ20 వరల్డ్‌కప్-2024కు ఎంపిక చేశారు. ఈ 15 మంది సభ్యుల బృందం వరల్డ్‌కప్‌లో తలపడేందుకు అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్ నుంచే ద్రవిడ్ తెర వెనుకుండి జట్టును నడిపించాడు. రోహిత్‌కు విలువైన సూచనలు ఇస్తూ ఫైనల్‌కు చేర్చాడు.ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలోనూ ఆటగాళ్లకు సపోర్ట్‌గా ఉంటూ కప్పు కొట్టేలా చేశాడు. ఆఖరికి పట్టువదలని విక్రమార్కుడిలా వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడి హెడ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని ముగించాడు. ఆఖరిగా తన కెరీర్లో ఆటగాడిగా, కెప్టెన్‌గా సాధించని వరల్డ్‌కప్ టైటిల్‌ను కోచ్‌గా సాధించి ద్రవిడ్ చరిత్ర సృష్టించాడు. అందుకే విజయం సాధించిన అనంతరం ద్రవిడ్ కప్‌ను పట్టుకుని చిన్న పిల్లాడిలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. Never expected idhi #RahulDravid 😂❤️pic.twitter.com/n7o3Ffa83O— Harsha... (@harshatweets03) June 29, 2024 -
టీమిండియా విన్నింగ్ సెలబ్రేషన్స్.. చిన్న పిల్లాడిలా మారిన ద్రవిడ్! వీడియో
టీమిండియా కల నేరవేరింది. గత 11 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతమైంది. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత జట్టు.. రెండో పొట్టి ప్రపంచకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. భారత్‌కు ఇది రెండో టీ20 వరల్డ్‌కప్ కాగా.. ఓవరాల్‌గా నాలుగో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. అయితే సుధీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. భావోద్వేనికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే కప్ అందుకునే సమయంలో మాత్రం భారత ఆటగాళ్లు నవ్వుతూ సంబరాల్లో మునిగి తేలిపోయారు. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే చిన్నపిల్లాడిలా ప్లేయర్స్‌తో కలిపి సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే ద్రవిడ్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకోవడం అందరిని కట్టిపడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ద్రవిడ్‌కు భారత జట్టు హెడ్ కోచ్‌గా ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20 వరల్డ్‌కప్-2024తో భారత హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. అదే విధంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నారు.Never expected idhi #RahulDravid 😂❤️pic.twitter.com/n7o3Ffa83O— Harsha... (@harshatweets03) June 29, 2024It's that sigh of relief in the end from Rahul Dravid after his aggressive celebration. pic.twitter.com/ZDeXiiLr7k— Aditya Saha (@Adityakrsaha) June 29, 2024 -
T20ప్రపంచ కప్ సొంతం.. ఆనంద క్షణాల్లో ఆటగాళ్ల భావోద్వేగం (ఫొటోలు)
-
భారత్‌దే టి20 ప్రపంచకప్ .. విశ్వవిజేతగా రోహిత్ సేన (ఫోటోలు)
-
T20 World Cup 2024 Final: ద్రవిడ్‌కు చివరి మ్యాచ్.. టైటిల్‌తో వీడ్కోలు పలకండి..!
టీ20 వరల్డ్‌కప్ 2024 చివరి అంకానికి చేరింది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) జరుగబోయే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగస్తుంది. ఈ మ్యాచ్ టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు చివరిది. భారత హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ఈ మ్యాచ్‌తో ముగస్తుంది. టైటిల్ గెలిచి ద్రవిడ్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు. కోచ్‌గా ద్రవిడ్ టీమిండియాకు ఎనలేని సేవలనందించాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడనుంది. తన హయాంలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ద్రవిడ్‌కు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదన్న లోటు మిగిలిపోయింది. ఈ ప్రపంచకప్‌తో ఆ లోటు తీర్చుకోవాలని ద్రవిడ్ పట్టుదలగా ఉన్నాడు. RAHUL DRAVID - ONE FINAL DAY AS HEAD COACH. 🌟- Indian cricket will miss you. pic.twitter.com/Xd7hMZiPBP— Johns. (@CricCrazyJohns) June 28, 2024ఇందుకోసం అతను బాయ్స్‌ను (టీమిండియా క్రికెటర్లను) సమాయత్తం చేస్తున్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా (రిజర్వ్ డేలో కూడా) భారత్ సంయుక్త విజేతగా నిలుస్తుంది కానీ.. అది ద్రవిడ్‌కు అంత సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. భారత ఆటగాళ్లకు, అభిమానులకు కూడా సంయుక్త విజేతలుగా నిలవడం ఇష్టం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరిగి. అందులో టీమిండియా విజేతగా నిలవాలని యావత్ భారత దేశం కోరుకుంటుంది. భారత్ చివరిసారి ప్రపంచకప్ టైటిల్‌ను (వన్డే) 2011లో సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌ను 2007 అరంగేట్రం ఎడిషన్‌లో గెలిచింది. ఈ సారి టీమిండియా టైటిల్ సాధిస్తే.. ప్రపంచకప్ కోసం 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లవుతుంది.మరోవైపు ఈ వరల్డ్‌కప్‌లో మరో ఫైనలిస్ట్ అయిన సౌతాఫ్రికా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క వరల్డ్‌కప్ టైటిల్ కూడా గెలవలేదు. ఫైనల్స్‌కు చేరడం కూడా ఆ జట్టుకు ఇదే మొదటిసారి. కాబట్టి సౌతాఫ్రికా కూడా టైటిల్ సాధించే విషయంలో కృత నిశ్చయంతో ఉంది. మరి ఎవరు టైటిల్ గెలుస్తారో వేచి చూడాలి. -
T20 WC: బాధలో విరాట్ కోహ్లి.. ఓదార్చిన ద్రవిడ్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో విరాట్‌కు మంచి రికార్డు ఉండడంతో ఈ ఏడాది కూడా సత్తాచాటుతాడని అభిమానులు భావించారు. కానీ గయనా వేదికగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో కోహ్లి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో నిరాశతో కోహ్లి తన బ్యాట్‌ను పంచ్ చేస్తూ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా కోహ్లి తన సహచరులతో దిగులుగా కూర్చోన్నాడు. ఊబికి వస్తున్న కన్నీరును ఆపునకుంటూ విరాట్ మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. విరాట్ వద్దకు వెళ్లి భుజం తట్టి ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 75 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు డక్‌లు కూడా ఉన్నాయి. Rahul dravid went to Virat as he was looking broken after that dismissal, can't see him like this man 💔 #INDvsENG pic.twitter.com/X0nPoSdF5s— a v i (@973Kohli) June 27, 2024 -
NCA: వీవీఎస్ లక్ష్మణ్ సైతం గుడ్‌బై!.. కారణం?
భారత క్రికెట్ మేనేజ్మెంట్లో మరో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు సమాచారం. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న సంగతి తెలిసిందే. నిజానికి వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అభ్యర్థన మేరకు ఈ టీ20 మెగా టోర్నీ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండేందుకు ద్రవిడ్ అంగీకరించాడు.ఈ క్రమంలో అతడి స్థానంలో బాధ్యతలు చేపట్టాల్సిందిగా వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు కోరగా అందుకు అతడు నిరాకరించాడనే వార్తలు వినిపించాయి. అనంతరం రేసులోకి దూసుకొచ్చిన మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితుడు కావడం దాదాపుగా ఖరారైపోయింది.కాగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలో 2021లో రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఎన్సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ నియమితుడయ్యాడు.లక్ష్మణ్ పదవీకాలం ఈ ఏడాదితో ముగిసిపోనున్నట్లు సమాచారం. అయితే, కుటుంబానికి సమయం కేటాయించే క్రమంలో అతడు తన కాంట్రాక్టును పునరుద్ధరించుకునేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది.ఎన్సీఏ హెడ్‌గా తప్పుకొన్న తర్వాత కామెంట్రీ చేయడంతో పాటు ఐపీఎల్ మెంటార్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా 2013- 2021 వరకు వీవీఎస్ లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా ఉన్న విషయం తెలిసిందే.కాగా ఎన్సీఏ చైర్మన్‌గా తన పదవీకాలంలో వీవీఎస్ లక్ష్మణ్ అబ్బాయిలు, అమ్మాయిల క్రికెట్లోని అన్ని కేటగిరీలపై దృష్టి సారించి జూనియర్ నుంచి సీనియర్ లెవల్ వరకు రాటుదేలేలా శిక్షణ ఇవ్వడంలో సఫలీకృతమయ్యాడని చెప్పవచ్చు. అదే విధంగా.. గాయపడిన ఆటగాళ్ల పునరావాసం, త్వరగా వాళ్లు కోలుకునేలా సహాయక సిబ్బందిని సరైన మార్గంలో నడిపించాడు. ఈ మేరకు ది టెలిగ్రాఫ్ తన కథనంలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024లో సెమీస్ బెర్తు లక్ష్యంగా ముందుకు సాగుతున్న రోహిత్ సేన.. సోమవారం నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. చదవండి: కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! -
Ind vs Ban: అతడిపై వేటు.. సంజూకు ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో శుభారంభం చేసిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. తమ రెండో మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చింది. అఫ్గనిస్తాన్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో విజయానంతరం.. మరుసటి రోజే ప్రాక్టీస్ సెషన్‌తో బిజీగా గడిపింది.ప్రత్యేకంగా ప్రాక్టీస్ఫామ్లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా కూడా నెట్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శుక్రవారం జరిగిన సెషన్లో సంజూ శాంసన్‌తో రిజర్వ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా సంజూ శాంసన్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు నెట్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సంజూ బ్యాటింగ్‌ను వీరిద్దరు పరిశీలించినట్లు రెవ్‌స్పోర్ట్స్ వెల్లడించింది.అతడిపై వేటు?ఈ నేపథ్యంలో... టోర్నీ ఆరంభం నుంచి బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్‌కు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే స్థానంలో ఈ కేరళ బ్యాటర్‌ను తుదిజట్టులోకి తీసుకోనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హిట్టర్‌గా ఐపీఎల్-2024లో ఇరగదీసిన శివం దూబే వరల్డ్‌కప్-2024లో మాత్రం బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 44 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 83.అందుకే సంజూకు లైన్ క్లియర్ఈ నేపథ్యంలో దూబేను తప్పించి సంజూకు మార్గం సుగమం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత టీమిండియా తదుపరి ఆస్ట్రేలియాతో తలపడనుంది.పటిష్ట ఆసీస్‌ను ఢీకొట్టేకంటే ముందే తుదిజట్టులో ఈ మేరకు మార్పులతో ప్రయోగం చేయాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. మిడిలార్డర్లో ఉన్న ఒకే ఒక్క లెఫ్టాండర్ బ్యాటర్ శివం దూబే విషయంలో టీమిండియా రిస్క్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అంటిగ్వాలోని వివియన్ రిచర్ట్స్ స్టేడియంలో శనివారం టీమిండియా- బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉండటం ఆందోళనకరంగా పరిణమించింది.చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి!Barbados ✈️ Antigua #TeamIndia have arrived for today's Super 8 clash against Bangladesh 👌👌#T20WorldCup pic.twitter.com/RM54kEWP3W— BCCI (@BCCI) June 22, 2024 -
కొత్తగా చేయాల్సిందేమీ లేదు.. థాంక్యూ: ద్రవిడ్ కౌంటర్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. బ్యాటర్‌గా తన ఆట తీరును గుర్తుచేస్తూ.. టీమిండియాను కించపరచాలని చూసిన జర్నలిస్టుకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 లీగ్ మ్యాచ్‌లను అమెరికాలో ఆడిన టీమిండియా.. సూపర్-8 కోసం వెస్టిండీస్‌కు చేరుకుంది. ఇందులో భాగంగా గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తన ప్రశ్నలతో ఇరుకున పెట్టాలని ఓ జర్నలిస్టు ప్రయత్నించాడు. ఆటగాడిగా ఇదే వేదికపై ద్రవిడ్‌కు, టీమిండియాకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేశాడు.‘‘రాహుల్.. మీరు ఇక్కడ మ్యాచ్‌లు ఆడారు కదా. కానీ 97 టెస్టులో మీకంటూ గొప్ప జ్ఞాపకాలు ఏమీ లేవు’’ అని సదరు జర్నలిస్టు ద్రవిడ్‌తో అన్నాడు.ఇందుకు బదులిస్తూ.. ‘‘గీజ్.. ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు! ఇక్కడ నాకు కొన్ని మధుర జ్ఞాపకాలు కూడా ఉన్నాయి’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.అయితే, అంతటితో సంతృప్తి చెందని రిపోర్టర్.. ‘‘నేనూ అదే అంటున్నా. ఇక్కడ మీకున్న కాస్తో కూస్తో మంచి జ్ఞాపకాలను గొప్ప జ్ఞాపకాలుగా మార్చుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.దీంతో సహనం కోల్పోయిన ద్రవిడ్.. ‘‘అన్నీ తెలిసిన వ్యక్తి కదా మీరు.. నేను ఇక్కడ కొత్తగా చేయాల్సిందేమీ లేదయ్యా. గతాన్ని మరిచి ముందుకు సాగడంలో నేను ముందుంటాను. వెనక్కి తిరిగి చూసుకుని.. పదే పదే గతాన్ని తవ్వుకోవడం నాకు అలవాటు లేదు.ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను, నా విధి ఏమిటన్న అంశాలపైనే దృష్టి పెడతాను. 97లో ఏం జరిగింది? ఆ తర్వాతి సంవత్సరంలో ఏం జరిగింది? అంటూ కూర్చోను.ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. మంచైనా.. చెడైనా.. రెండింటినీ సమంగా స్వీకరిస్తాను. ఆటగాడిగా ఉన్ననాటి విషయాల గురించి ఆలోచించే సమయమే లేదు. భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. ఈ మ్యాచ్ ఎలా గెలవాలన్న విషయం మీద మాత్రమే ఫోకస్ చేస్తా’’ అంటూ ద్రవిడ్ కౌంటర్ ఇచ్చాడు.కాగా 1997లో బార్బడోస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో రాహుల్ ద్రవిడ్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 78, 2 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నాటి విషయాన్ని గుర్తు చేస్తూ.. సదరు రిపోర్టర్ ద్రవిడ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయగా.. ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం... కోచ్‌గా జట్టును సరైన దిశలో నడపడం మాత్రమే తన తక్షణ కర్తవ్యమని సమాధానమిచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ తర్వాత ద్రవిడ్ హెడ్ కోచ్‌గా వైదొలగనున్న విషయం తెలిసిందే. అతడిస్థానంలో గౌతం గంభీర్ ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.చదవండి: T20 WC 2024: అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు.. కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా? -
BCCI: ద్రవిడ్‌తో పాటు వాళ్లందరూ అవుట్! గంభీర్ కొత్త టీమ్?
టీమిండియా హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ నియామకం ఖరారు కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ప్రక్రియను మంగళవారం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.రవిశాస్త్రి తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వన్డే వరల్డ్‌కప్-2023 నాటికే ముగిసిపోయింది. అయితే, టీ20 ప్రపంచకప్-2024 పూర్తయ్యే వరకు కొనసాగమని బీసీసీఐ కోరగా.. ద్రవిడ్ అందుకు అంగీకరించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.గంభీర్ వైపే మొగ్గుఈ క్రమంలో బీసీసీఐ ద్రవిడ్ వారసుడి ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ వైపు మొగ్గుచూపిన బోర్డు పెద్దలు.. అతడితో సంప్రదింపులు జరిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.అందుకు అనుగుణంగానే గంభీర్ సైతం తాను టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలపడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలో గంభీర్ ఒక్కడే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం ఇంటర్వ్యూకి అతడు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులైన అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్‌లు గంభీర్‌ను జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం సహాయక సిబ్బందికి సంబంధించి.. గంభీర్ తన సొంత టీమ్‌ను ఎంచుకోనున్నట్లు సమాచారం.ద్రవిడ్‌తో పాటు వాళ్లంతా అవుట్!ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌ల పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరందరికి ఉద్వాసన పలికి.. గౌతం గంభీర్ కొత్త వాళ్లను తన టీమ్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరు వినిపిస్తుండగా.. మిగతా కోచ్‌లు ఎవరన్న అంశం చర్చనీయంగా మారింది.ఇదిలా ఉంటే.. సలీల్ అంకోలా స్థానంలో కొత్త సెలక్టర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గంభీర్‌కు ఇంత వరకు కోచ్‌గా పనిచేసిన అనుభవం లేదు. అయితే, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్‌గా వ్యవహరించాడు గంభీర్. తాజా సీజన్లో కోల్‌కతా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. -
టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్.. అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారు
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్) చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో పూర్తి కానున్న నేపథ్యంలో బీసీసీఐ అతి త్వరలోనే రాహుల్ వారసుడి పేరును ప్రకటించవచ్చని సమాచారం.ఒకవేళ ఇదే నిజమైతే 42 ఏళ్ల గంభీర్‌కు ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా ఇదే మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్ గతంలో ఏ జట్టుకు ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్లో మెంటార్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్‌కు మెంటార్‌గా పని చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతోనే గంభీర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా అవకాశం వచ్చింది.టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మహేళ జయవర్దనే, జస్టిన్ లాంగర్ లాంటి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. బీసీసీఐ గంభీర్వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు గంభీర్ తన సపోర్టింగ్ స్టాఫ్‌ను తనే ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ గంభీర్ పెట్టిన ఈ షరతుకు బీసీసీఐ అంగీకరిస్తే ప్రస్తుతమున్న సపోర్టింగ్ స్టాఫ్ ద్రవిడ్‌తో పాటు తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్‌గా పరస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నారు.టీ20 వరల్డ్‌కప్ 2024 తర్వాత భారత్ జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గంభీర్ కోచ్‌గా నియమితుడైతే జింబాబ్వే పర్యటన నుంచే అతని విధులు మొదలవుతాయి. జులై 6 నుంచి 14 మధ్యలో జరిగే జింబాబ్వే పర్యటనలో భారత్ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. -
అమెరికా-పాక్ థ్రిల్లింగ్ సూపర్ ఓవర్.. ఫాలో అయిన ద్రవిడ్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికా-పాకిస్తాన్ మధ్య జరిగన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. సూపర్ ఓవరకు దారితీసిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఆతిథ్య అమెరికా చిత్తు చేసింది.యావత్తు క్రికెట్ ప్రపంచం తమ వైపు చూసేలా యూఎస్ఎ అద్బుతమైన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో యూఎస్ఏ కూడా 159/3 స్కోరుతో నిలిచింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్లో మొదటి బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా.. పాక్ 13 పరుగులు మాత్రమే చేసింది. ఇక అమెరికా-పాక్ మధ్య జరిగిన ఈ థ్రిల్లింగ్ పోరుకు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఆకర్షితుడయ్యాడు. న్యూయర్క్‌లో సబ్వేలో ద్రవిడ్ ప్రయాణిస్తూ ఇరు జట్ల మధ్య జరిగిన సూపర్ ఓవర్ బాల్ టూ బాల్‌ను తన ఫోన్లో ఫాలోయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.Rahul Dravid following the Super Over of Pakistan vs USA on Espn Cricinfo. [📸: Vishal Misra] pic.twitter.com/eanrXe6my6— Johns. (@CricCrazyJohns) June 6, 2024 -
BCCI: అందుకే తప్పుకొంటున్నా.. ద్రవిడ్ ఫస్ట్ రియాక్షన్
టీమిండియా ప్రధాన కోచ్‌గా తాను కొనసాగబోవడం లేదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోచ్‌గా తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు. ఏదేమైనా భారత జట్టు మార్గదర్శకుడిగా వ్యవహరించడం తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఈ మాజీ కెప్టెన్ హర్షం వ్యక్తం చేశాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత ద్రవిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ ఈ మెగా ఈవెంట్ కోసం కొనసాగమని బీసీసీఐ అతడిని కోరిన విషయం తెలిసిందే. ఇందుకు అంగీకరించిన ద్రవిడ్ ప్రస్తుతం టీమిండియాతో కలిసి అమెరికాకు వెళ్లాడు.అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న వరల్డ్‌కప్-2024 జూన్ 1న మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనున్న తరుణంలో రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా.. ‘‘ప్రతి టోర్నమెంట్ నాకు ముఖ్యమైనదే. టీమిండియా కోచ్‌గా ప్రతి మ్యాచ్‌లోనూ పూర్తి ఎఫర్ట్ పెట్టాను. టీ20 వరల్డ్‌కప్ కూడా అంతే. అయితే, నేను ఇన్చార్జ్గా ఉన్న సమయంలో ఇదే ఆఖరిది కాబట్టి మరింత ప్రాముఖ్యం ఏర్పడింది.నా పనిని పూర్తి నిష్ఠగా.. ప్రేమతో చేశాను. టీమిండియాకు కోచింగ్ ఇవ్వడం అనేది నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనది. గొప్ప ఆటగాళ్లున్ను జట్టుతో పని చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించాను.అయితే, బిజీ షెడ్యూల్స్, పని ఒత్తిడి కారణంగా తిరిగి ఈ జాబ్‌కు తిరిగి అప్లై చేయాలనుకోవడం లేదు’’ అంటూ తాను హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైనట్లు రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.కాగా ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గౌతీ సైతం తాను ఈ గౌరవప్రదమైన బాధ్యతను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం గమనార్హం. -
ట్రోఫీ గెలిచే వ్యూహాలే లేవు.. ఇకనైనా: ద్రవిడ్‌పై లారా వ్యాఖ్యలు
టీమిండియాను ఉద్దేశించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో లీగ్ దశలో రాణిస్తున్నా.. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే భారత జట్టు నాకౌట్ మ్యాచ్‌లలో తేలిపోతోందన్నాడు.జట్టులో ఎంత మంది సూపర్స్టార్లు ఉన్నా టైటిల్ గెలవకపోతే ఏం లాభమని పెదవి విరిచాడు. కనీసం ఈసారైనా బలహీనతలు అధిగమించి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచేలా వ్యూహాలు రచించాలని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు లారా సూచించాడు.పదకొండేళ్లుగా నిరీక్షణకాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచిన టీమిండియా.. మళ్లీ ఇప్పటి వరకు ఐసీసీ టైటిల్ నెగ్గలేదు. పదకొండేళ్లుగా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.ఇక హెడ్‌కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లో నిష్క్రమించగా.. వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్లో ఓడిపోయింది. ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేక టైటిల్ వేటలో వెనుకబడింది.మరో అవకాశంఈ నేపథ్యంలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024 రూపంలో వీరిద్దరు తమను తాము నిరూపించుకునే మరో అవకాశం వచ్చింది. జూన్ 1 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీ నేపథ్యంలో బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు.వ్యూహాలే లేవుటీమిండియాను కలవరపెడుతున్న అంశాలేమిటి అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘గత టీ20, వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లలో భారత జట్టును గమనిస్తే.. వారి వద్ద టోర్నీలో ముందుకు సాగేందుకు సరైన ప్రణాళికలు లేవని అనిపించింది.మీ దగ్గర వరల్డ్‌కప్ గెలిచే వ్యూహాలు లేనపుడు.. జట్టులో ఎంత మంది సూపర్స్టార్లు ఉంటే ఏం లాభం? ఎలా బ్యాటింగ్ చేయాలి? ప్రత్యర్థిని ఎలా అటాక్ చేయాలి అన్న విషయాలపై స్పష్టత ఉండాలి కదా!ఈసారైనా ద్రవిడ్ఈసారి రాహుల్ ద్రవిడ్ తమ ప్లేయర్లందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి.. ప్రపంచకప్ గెలిచే ప్లాన్ చేస్తాడనే ఆశిస్తున్నా’’ అని లారా ఐసీసీ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్‌కప్ టోర్నీలో.. టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్‌తో కలిసి View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
ఫోటో అడిగిన అభిమాని.. వర్షంలో పరిగెత్తిన రోహిత్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024కు టీమిండియా సిద్దమవుతోంది. ఇప్పటికే అమెరికా చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేసింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తమ సన్నాహక శిబరాన్ని భారత జట్టు ఏర్పాటు చేసుకుంది.అయితే ప్రాక్టీస్ లేని సమయంలో భారత ఆటగాళ్లు న్యూయార్క్ సీటీలో చక్కెరల్లు కొడుతున్నారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బుధవారం న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ కన్పించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. షాపింగ్‌కు వెళ్లిన ద్రవిడ్, రోహిత్ భారీ వర్షంలో చిక్కుకున్నారు. భారీ వర్షం కురుస్తుండంతో రోహిత్, ద్రవిడ్ ఇద్దరూ ఓ షాప్‌లో ఉండిపోయారు. ఈ క్రమంలో ఓ అభిమాని రోహిత్ దగ్గరకు వచ్చి ఫోటో కావాలని అడగగా.. హిట్‌మ్యాన్ అందుకు నిరాకరించాడు. "నో ఫోటో, బయట భారీ వర్షం పడుతోంది" అంటూ రోహిత్ సమాధనమిచ్చాడు.వెంటనే కారు తీసుకురావలంటూ డ్రైవర్‌ను రోహిత్ సూచించాడు. కుండపోత వర్షం పడుతుండగానే రోహిత్, ద్రవిడ్ ఇద్దరూ కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. పాపం వారిద్దరితో ఫోటో కోసం ఎదురు చూసిన సదరు అభిమానికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. భారత తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. Team India spotted in New York. Wait for Rohit Sharma’s sprint. 😂 pic.twitter.com/QlfPlSSLAW— Vipin Tiwari (@Vipintiwari952_) May 29, 2024 -
టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. భారత్ హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి ఉన్నట్లు గంభీర్ స్వయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన షారుఖ్ ఖాన్‌కు కూడా ఈ విషయం తెలుసని సదరు వెబ్సైట్ వెల్లడించింది. హెడ్ కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం ముమ్మాటికి నిజమేనని సోషల్‌మీడియా సైతం కోడై కూస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్ల మధ్య డీల్ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఈ డీల్ క్లోజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక గంభీర్-జై షా చాలాసేపు బహిరంగంగా డిస్కస్ చేసుకోవడం జనమంతా చూశారు. ఆ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ పదవిపైనే చర్చ జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కాని ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. టీ20 వరల్డ్‌కప్ 2024తో భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ పదవి వీడేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ప్రకటన వెలువడేందుకు ఆస్కారం ఉంది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. పదేళ్లకు ముందు ఇదే గంభీర్ కెప్టెన్‌గా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతకు రెండేళ్ల ముందు కూడా గంభీర్ ఓసారి కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. ఘనమైన ట్రాక్ రికార్డుతో పాటు దేశం పట్ల గంభీర్‌కు ఉన్న కమిట్మెంట్ భారత్ హెడ్ కోచ్ పదవి రేసులో అతన్ని ముందుంచుతుంది. -
ముగిసిన డెడ్ లైన్.. భారత కొత్త హెడ్ కోచ్ ఎవరో?
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్-2024తో ముగియున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త కోచ్‌ను భర్తీ చేసే పనిలో బీసీసీఐ పడింది. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకునేందుకు గడువు సోమవారం(మే 27) సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది.కాగా ధరఖాస్తులను బీసీసీఐ స్వీకరించినప్పటకి..కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరింత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే టీమిండియా హెడ్‌కోచ్ పదవికి విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలుత ఆస్ట్రేలియా దిగ్గజాలు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ పేర్లు వినిపించినప్పటికి.. వారవ్వరూ హెడ్‌కోచ్ పదవికి ఆప్లై చేసేందుకు ఆసక్తి చూపలేదని బీసీసీఐ మాలాలు వెల్లడించాయి. నో చెప్పిన వీవీఎస్ లక్ష్మణ్..!కాగా భారత హెడ్ కోచ్ రేసులోప్రధానంగా దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం హెడ్‌కోచ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయలేదంట. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్‌కు పూర్తి స్ధాయి హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి లేనిట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ ఎంపికైతే జట్టుతో పాటు 10 నెలల పాటు కలిసి ప్రయాణం చేయాలి. ఈ క్రమంలోనే లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవి వైపు మొగ్గు చూపకపోయినట్లు తెలుస్తోంది. గంభీర్ కోచ్ అవుతాడా? ఇక వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించడంతో ద్రవిడ్ వారుసుడుగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు గంభీర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఐపీఎల్-2024లో అతడి నేతృత్వంలోనే కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును వీడి గౌతీ వస్తాడా అనే విషయం సందిగ్ధంగా ఉంది. -
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
టీమిండియా కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ వేటను మొదులెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ధరఖాస్తులను సైతం బీసీసీఐ అహ్హనించింది. హెడ్ కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకునేందుకు మే 27 సాయంత్రం ఆరు గంటలతో గడువు ముగియునుంది. ఈ క్రమంలో హెడ్‌కోచ్ రేసులో గౌతం గంభీర్, రికీ పాంటింగ్, వీవీఎస్ లక్ష్మణ్,జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి దిగ్గజ క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ పెద్దలు మాత్రం భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. గంభీర్ కూడా భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెడ్‌కోచ్ పదవికి ధరఖాస్తు చేసేముందు గంభీర్ బీసీసీఐకు ఒక కండీషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'సెలక్షన్ గ్యారెంటీ' ఇస్తేనే హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేస్తానని బీసీసీఐతో గంభీర్ చెప్పినట్లు దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లు వినికిడి. ప్రస్తుత సమాచారం ప్రకారం ద్రవిడ్ వారసుడిగా గంభీర్ బాధ్యతలు చెపట్టడం దాదాపు ఖాయమన్పిస్తోంది. కాగా గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కేకేఆర్ తలపడనుంది. -
టీమిండియా హెడ్ కోచ్‌గా డివిలియర్స్?.. హింట్ ఇచ్చిన ఏబీడీ
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. విదేశీ కోచ్‌లకు కూడా తలుపు తెరిచే ఉన్నాయంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేయడంతో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రిక్కీ పాంటింగ్, మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ తదితరులు టీమిండియా హెడ్‌కోచ్ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రిక్కీ, లాంగర్ తాము ఈ పదవి పట్ల ఆసక్తిగా లేమని చెప్పగా.. జై షా సైతం తాము ఎవరికీ ఇంకా ఆఫర్ ఇవ్వలేదంటూ కౌంటర్ ఇచ్చాడు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా ఆఫర్ వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నాకైతే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనా లేదు.అయితే, ఏదేని జట్టుకు కోచింగ్ ఇవ్వడాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. అదే సమయంలో.. నన్ను ఇబ్బంది పెట్టే అంశాలు కూడా కొన్ని ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు.నాకు తెలియని విషయాలను కూడా త్వరత్వరగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కోచ్‌గా ఉండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.40 ఏళ్ల వయసులో.. ఇప్పుడు నేను పూర్తి పరిణతి చెందిన వ్యక్తిని. నా కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమేం జరిగాయో అన్న దానిపై మరింత స్పష్టత వచ్చింది. చాలా పాఠాలు నేర్చుకున్నాను.కొంత మంది యువ ఆటగాళ్లకు.. మరికొంత మంది సీనియర్లకు కూడా నా అనుభవం ఉపయోగపడవచ్చు. కొంత మంది ఆటగాళ్లతో.. కొన్ని జట్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.కానీ పూర్తిస్థాయిలో హెడ్ కోచ్‌గా ఉండేందుకు ఇది సరైన సమయం కాదనుకుంటున్నా. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా. అయితే, ముందుగా చెప్పినట్లు కోచ్ మారడానికి నేనెప్పుడూ నో చెప్పను. పరిస్థితులు మారుతూనే ఉంటాయి కదా!’’ అని ఏబీ డివిలియర్స్ న్యూస్18తో పేర్కొన్నాడు.భవిష్యత్తులో తనను కోచ్ అవతారంలో తప్పక చూస్తారనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఏబీ డీ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చేయమంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. ఆర్సీబీ ఫ్యాన్స్ సైతం వచ్చే ఏడాది డివిలియర్స్ తమ బెంగళూరు జట్టుకు మెంటార్‌గా రావడం ఖాయమని ఫిక్సయిపోతున్నారు.చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు -
BCCI: అవన్నీ అబద్ధాలే: ఆసీస్ మాజీలకు జై షా కౌంటర్
టీమిండియా కొత్త హెడ్ కోచ్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కొట్టిపారేశారు. ఈ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా తాము ఇంత వరకు ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ అతడి వారసుడిని ఎంపిక చేసే క్రమంలో దరఖాస్తులు ఆహ్వానించింది. విదేశీ కోచ్‌ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.హెడ్ కోచ్ రేసులోఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ సహా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్, శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్ధనే తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో రిక్కీ పాంటింగ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ తనకు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించానని పేర్కొన్నాడు. మరోవైపు.. జస్టిన్ లాంగర్ సైతం కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడంటూ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం తాను అప్లై చేసుకోనని పరోక్షంగా వెల్లడించాడు.వాళ్లకు మేమే ఆఫర్ ఇవ్వలేదురిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు. ‘‘టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం నేను గానీ, బీసీసీఐ గానీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లెవరికీ ఆఫర్ చేయలేదు.మీడియా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. జాతీయ జట్టు కోసం సరైన కోచ్‌ను ఎంపిక చేసుకోవడం క్లిష్టతరమైన ప్రక్రియ. భారత క్రికెట్ స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకోగల వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నాం.పూర్తి అవగాహన ఉన్నవాళ్లకే ప్రాధాన్యంటీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నవారికి భారత దేశవాళీ క్రికెట్ గురించి, ఆటగాళ్ల గురించి పూర్తి అవగాహన ఉండాలి. అలాంటి వాళ్ల కోసమే మేము ఎదురుచూస్తున్నాం.భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండటం కంటే అంతర్జాతీయ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన పదవి ఇంకోటి ఉంటుందని అనుకోను. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత క్రికెట్ చరిత్ర, ఔన్నత్యం.. ఆట పట్ల మా అంకితభావం.. అన్నీ వెరసి ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్నాం.ఇలాంటి చోట జాబ్ చేయడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?. ఇలాంటి జట్టుకు గురువుగా బాధ్యతలు నిర్వర్తించే సరైన వ్యక్తి కోసం మేము జల్లెడపట్టాల్సి ఉంటుంది’’ అని జై షా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించారు. చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. అలా అయితేనే సన్‌రైజర్స్ ముందుకు -
టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే సరైనోడు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ వేటలో ఉంది. టీ20 ప్రపంచకప్-2024 ముగిసే నాటికి రాహుల్ ద్రవిడ్ వారసుడిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రం టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేయడానికి సరైన వ్యక్తి ఇతడేనంటూ ఓ మాజీ క్రికెటర్ పేరును ప్రతిపాదించాడు. ఇంతకీ అతడు ఎవరు?..టీ20 వరల్డ్‌కప్-2021 తర్వాత రవిశాస్త్రి హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలగగా.. టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ద్రవిడ్ మార్గదర్శనంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నంబర్ వన్‌గా నిలిచింది.అయితే, టీ20 ప్రపంచకప్-2022, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్-2023లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో రెండుసార్లు ఆస్ట్రేలియా చేతిలో చిత్తైంది.ఇక వన్డే వరల్డ్‌కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో అతడిని కొనసాగాల్సిందిగా బీసీసీఐ కోరింది. అయితే, ఈ మెగా టోర్నీ అనంతరం అతడు తన పదవి నుంచి తప్పుకోనుండగా.. అభ్యర్థుల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.మరోవైపు.. విదేశీ కోచ్‌ల నియామకానికి బీసీసీఐ సుముఖంగా ఉందన్న వార్తల నేపథ్యంలో స్టీఫెన్ ఫ్లెమింగ్, జస్టిన్ లాంగర్, రిక్కీ పాంటింగ్ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘టీమిండియా హెడ్‌కోచ్‌గా అత్యుత్తమ వ్యక్తి ఎవరంటే గౌతం గంభీర్ అనే చెప్తా. గౌతం ఈ బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది అతడి ఇష్టం.నిజానికి గౌతం ఇప్పుడు రాజకీయాలు కూడా వదిలేశాడు. తన కుటుంబానికి సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక హెడ్‌కోచ్ విషయానికొస్తే.. ఎప్పుడూ బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి తను ఇది ఎంచుకుంటాడా లేదా అన్నది చూడాలి.గౌతం గంభీర్ చాలా సింపుల్‌గా ఉంటాడు. తాను చెప్పాలనుకున్నది ఏదైనా సరే.. రెండో మాటకు తావులేకుండా సూటిగా చెప్తాడు. నిజానికి టీమిండియా క్రికెట్ కల్చర్‌కు ఇది విరుద్ధం.కానీ గంభీర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాడు. ఏదేనా ముఖం మీదే చెప్పేస్తాడు. అతడికి దూకుడు ఎక్కువ. జట్టును కూడా తనలాగే అగ్రెసివ్‌గా తయారుచేయగలడు. నిజంగా తను కోచ్‌గా వస్తే బాగుంటుంది. కానీ అందుకు అతడు ఒప్పుకొంటాడో లేదో?!’’ అని వసీం అక్రం స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు.కాగా గంభీర్ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్నాడు. ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక కేకేఆర్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. -
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్‌కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.మే 27 సాయంత్రం ఆరు గంటలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. టీమిండియా హెడ్‌కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, గౌతం గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, పాంటింగ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అవకాశం లభిస్తే టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు భజ్జీ తెలిపాడు.భారత హెడ్‌కోచ్ పదవికి నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ, టీమిండియాకు కోచింగ్ అనేది మ్యాన్ మేనేజ్మెంట్. భారత ఆటగాళ్లకు క్రికెట్ గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. వారికి మార్గదర్శకత్వంగా ఉంటే చాలు. నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది. కోచ్ రూపంలో ఎంతోకొంత తిరిగి ఇచ్చే అవకాశం వస్తే సంతోషిస్తా" అని ఓ స్పోర్ట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. -
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్..!
టీ20 వరల్డ్‌కప్-2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం విధితమే. భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. మే 27 లోపు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే భారత హెడ్‌కోచ్ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కోచ్‌గా ఉండాలని గంభీర్‌ను బీసీసీఐ కోరినట్లు సమాచారం. గంభీర్ ప్రస్తుతం కేకేఆర్ జట్టుకు గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన తర్వాత గంభీర్‌తో బీసీసీఐ పూర్తి స్ధాయి చర్చలు జరపనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గంభీర్ గతంలో ఎప్పుడూ కోచ్‌గా పనిచేయనప్పటికి మెంటార్‌గా మాత్రం అపారమైన అనుభవం ఉంది. ప్రస్తుతం కేకేఆర్‌తో పాటు గతంలో రెండు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా కూడా గంభీర్ పనిచేశాడు. ప్రస్తుతం అతడు మెంటార్‌గా ఉన్న కోల్‌కతా అద్భుత ఆటతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. కెప్టెన్‌గా కూడా కేకేఆర్‌కు రెండు సార్లు టైటిల్‌ను గౌతీ అందించాడు. అంతేకాకుండా ఆటగాడిగా గంభీర్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలోనే గౌతీకి భారత హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు వినికిడి. -
BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ అత్యున్నత పదవి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగలవారు ఈనెల 27వ తేదీలోపు తమ దరఖాస్తులు పంపించాలి.ఎంపికైన కొత్త హెడ్ కోచ్ పదవీకాలం మూడేన్నరేళ్లపాటు (1 జూలై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు) ఉంటుంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం గత ఏడాది నవంబర్‌లో వన్డే వరల్డ్‌కప్ అనంతరం ముగిసింది.అయితే టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ముగిసేవరకు టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ పదవి కోసం ద్రవిడ్ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. నో చెప్పిన ద్రవిడ్అయితే, ఇందుకు ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరికొంత కాలం పాటు అతడిని కోచ్‌గా కొనసాగాలని టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో కొందరు అభ్యర్థించినట్లు సమాచారం. కనీసం టెస్టు జట్టుకైనా ద్రవిడ్ మార్గదర్శకుడిగా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.కానీ వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌ల నియామకంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం అని.. ఏదేమైనా ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందకపోవచ్చని జై షా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ సైతం హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.లక్ష్మణ్‌కు ఆ ఛాన్స్ లేదుమరోవైపు.. ద్రవిడ్ గైర్హాజరీలో టీమిండియా కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే, బీసీసీఐ అతడిని అక్కడి నుంచి కదిలించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.ఫ్లెమింగ్ లేదంటే రిక్కీ పాంటింగ్?ఈ నేపథ్యంలో.. ఈసారి విదేశీ కోచ్‌ను రంగంలోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్లు జై షా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా.. మరో పేరు కూడా తెర మీదకు వచ్చింది.ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రిక్కీ పాంటింగ్ కూడా టీమిండియా హెడ్‌కోచ్ పదవి రేసులో ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు హెడ్కోచ్లుగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో కృషి చేయగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం) జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం పాంటింగ్‌కు ఉంది.అది సాధ్యం కాదన్న పాంటింగ్అయితే, వీళ్లిద్దరు కూడా టీమిండియా హెడ్‌కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే వరుస సిరీస్‌లతో బిజీగా ఉండే టీమిండియా కోసం కోచ్ ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు అంకితం కావాల్సి ఉంటుంది.కాబట్టి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే వీలుండదు. అందుకే భారత జట్టు హెడ్‌కోచ్ పదవి ఆఫర్ వచ్చినా తాను చేపట్టలేదని రిక్కీ పాంటింగ్ గతం(2021)లో వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్‌గా ఎవరు వస్తారో? అంటూ క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ -
మళ్లీ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి?
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మరోసారి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది.భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 2017- 2021 మధ్య టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో.. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడంసహా నంబర్ వన్ జట్టుగా ఎదిగింది.అయితే, వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గలేకపోయింది టీమిండియా. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియగా.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి యుగానికి తెరపడింది. ఈ క్రమంలో కోహ్లి రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతుండగా.. రవిశాస్త్రి తిరిగి కామెంటేటర్‌గా మారాడు.ఈ నేపథ్యంలో తాజాగా రవిచంద్రన్ అశ్విన్‌తో మాట్లాడుతూ రవిశాస్త్రి.. హెడ్‌కోచ్‌గా పనిచేయడంపై తనకున్న ఆసక్తిని వివరించాడు. భవిష్యత్తులో తాను ఐపీఎల్ జట్టు కోచ్‌గా పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేనని తెలిపాడు.భారత్‌లో ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారని.. వారిని మెరికల్లా తీర్చిదిద్దే అవకాశం తనకు వస్తే కచ్చితంగా మళ్లీ కోచ్‌గా మారతానని రవిశాస్త్రి సంకేతాలు ఇచ్చాడు. ఇప్పటికే సూపర్ స్టార్లుగా ఎదిగిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అయితే, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తనకు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని స్పష్టం చేశాడు.ఏడేళ్లు టీమిండియాతో పనిచేసిన తర్వాత .. తిరిగి కామెంటేటర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్న రవిశాస్త్రి.. తదుపరి ఐపీఎల్ కోచ్‌గా మారేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేశాడు. కాగా రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.