అత్యాచారం కేసులో దోషిగా తేలిన అంతర్జాతీయ క్రికెటర్‌ | Nepals Former Cricket Team Captain Sandeep Lamichhane Convicted By A Court Of Raping A Minor, See Details - Sakshi
Sakshi News home page

Nepal Cricketer Sandeep Lamichhane: అత్యాచారం కేసులో దోషిగా తేలిన అంతర్జాతీయ క్రికెటర్‌

Published Fri, Dec 29 2023 8:46 PM | Last Updated on Sat, Dec 30 2023 11:30 AM

Nepals Former Cricket Team Captain Sandeep Lamichhane Convicted Of Raping A Minor - Sakshi

మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో నేపాల్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సందీప్‌ లామిచ్చెన్‌ను ఖాట్మండు జిల్లా కోర్డు దోషిగా తేల్చింది. గతేడాది ఆగస్టులో ఖాట్మండులోని ఓ హోటల్ గదిలో సందీప్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మైనర్‌ బాలిక కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కొన్నాళ్ల పాటు జైల్‌లో ఉన్న సందీప్‌ను ఈ ఏడాది జనవరిలో బెయిల్‌పై విడుదల చేశారు. అప్పటినుంచి ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సందీప్‌ను తాజాగా ఖాట్మండు కోర్టు దోషిగా నిర్ధారించింది. తదుపరి విచారణలో సందీప్‌కు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 

23 ఏళ్ల సందీప్‌ ఐపీఎల్‌ ఆడిన తొలి నేపాల్‌ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. సందీప్‌.. ఐపీఎల్‌తో  పాటు బిగ్‌బాష్‌ లీగ్‌, కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ల్లో కూడా వేర్వేరే ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. నేపాల్‌ క్రికెటర్‌గా సందీప్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు ఉంది. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన సందీప్‌ నేపాల్‌ తరఫున 51 వన్డేలు, 52 టీ20లు ఆడి 3256 పరుగులు చేశాడు. అలాగే 210 వికెట్లు కూడా పడగొట్టాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement