BAN Vs AFG: Usman Ghani Announces Break From Afghanistan Cricket Due To Corrupt Leadership - Sakshi
Sakshi News home page

Usman Ghani Quits AFG Cricket: స్టార్‌ ప్లేయర్‌ సంచలన నిర్ణయం.. బోర్డుపై అవినీతి ఆరోపణలు

Published Tue, Jul 4 2023 11:23 AM | Last Updated on Tue, Jul 4 2023 11:51 AM

I Have Decided To Take Break From Afghanistan Cricket, Usman Ghani Bombshell Statement - Sakshi

ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ ప్లేయర్‌, 26 ఏళ్ల యువ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఘనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ నుంచి పాక్షికంగా విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆఫ్ఘన్‌ క్రికెట్‌ బోర్డులో అవినీతి నాయకత్వమే తన కఠిన నిర్ణయానికి కారణమని వెల్లడించాడు. మేనేజ్‌మెంట్‌, సెలెక్షన్‌ కమిటీలు మారే వరకు తన నిర్ణయాన్ని మార్చుకోనని, వారు మారాక గర్వంగా జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తానని, అప్పటివరకు ఆటపై పట్టు కోల్పోకుండా హార్డ్‌ వర్క్‌ చేస్తూనే ఉంటానని తెలిపాడు.  

17 వన్డేల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీలతో 435 పరుగులు.. 35 టీ20ల్లో 4 అర్ధసెంచరీలతో 786 పరుగులు చేసిన ఉస్మాన్‌ ఘనీని ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌ మేనేజ్‌మెంట్‌ జట్టుకు దూరంగా ఉంచింది. అతను ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నా సెలెక్టర్లు అతన్ని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదు. దీంతో చిర్రెత్తిపోయిన ఘనీ.. తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలుసుకునేందుకు మేనేజ్‌మెంట్‌కు సంప్రదించే ప్రయత్నం చేశాడు.

అయితే ఘనీ.. బోర్డు చైర్మన్‌ను, చీఫ్‌ సెలెక్టర్‌ను ఎన్నిసార్లు కలుద్దామని ప్రయత్నించినా వారు ఇతనికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇ‍వ్వలేదు.దీంతో అతను చేసేదేమీ లేక క్రికెట్‌ నుంచి పాక్షిక విరామం తీసుకున్నాడు. ఘనీ ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లే ఆడినా, జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆఫ్ఘన్‌ క్రికెట్‌లో ఘనీకి హార్డ్‌ హిట్టర్‌గా పేరుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement