టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగుతున్న నాథన్‌ లయోన్‌ హవా.. వాల్ష్‌ రికార్డు బద్దలు AUS VS NZ 1st Test: With 521 Wickets Nathan Lyon Becomes 7th Leading Test Wicket Taker, Overtook Courtney Walsh | Sakshi
Sakshi News home page

AUS VS NZ 1st Test: టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగుతున్న నాథన్‌ లయోన్‌ హవా.. వాల్ష్‌ రికార్డు బద్దలు

Published Fri, Mar 1 2024 12:54 PM | Last Updated on Fri, Mar 1 2024 1:07 PM

AUS VS NZ 1st Test: With 521 Wickets Nathan Lyon Becomes 7th Leading Test Wicket Taker, Overtook Courtney Walsh - Sakshi

టెస్ట్‌ క్రికెట్‌లో ఆసీస్‌ వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయోన్‌ హవా కొనసాగుతుంది. తాజాగా అతను దిగ్గజ పేసర్‌, విండీస్‌ మాజీ బౌలర్‌ కోట్నీ వాల్ష్‌ రికార్డును బద్దలు కొట్టాడు. వాల్ష్‌ 1984-2001 మధ్యలో 128 టెస్ట్‌లు ఆడి 519 వికెట్లు పడగొట్టాడు.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన లయెన్‌.. తన టెస్ట్‌ వికెట్ల కౌంట్‌ను 521కి పెంచుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లయోన్‌.. వాల్ష్‌ను అధిగమించి, ఏడో స్థానానికి ఎగబాకాడు.

ఇటీవలే టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా టెస్ట్‌ల్లో 500 వికెట్ల మార్కును తాకాడు. ప్రస్తుతం అతను 507 వికెట్లతో అత్యధిక టెస్ట్‌ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మురళీథరన్‌ (800) టాప్‌లో ఉండగా.. షేన్‌ వార్న్‌ (708), ఆండర్సన్‌ (698), అనిల్‌ కుంబ్లే (619), స్టువర్ట్‌ బ్రాడ్‌ (604), మెక్‌గ్రాత్‌ (563) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఆసీస్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉస్మాన్‌ ఖ్వాజా (5), నాథన్‌ లయోన్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. కెమరూన్‌ గ్రీన్‌ (174 నాటౌట్‌) భారీ శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లతో రాణించాడు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌.. ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 179 పరుగులకే ఆలౌటైంది. లయోన్‌ 4, హాజిల్‌వుడ్‌ 2, స్టార్క్‌, కమిన్స్‌, మార్ష్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కివీస్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (71) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement