తుస్సుమన్పించిన అంబటి రాయుడు.. కేవలం ఒక్క పరుగుకే Ambati Rayudu Fails in International League T20 | Sakshi
Sakshi News home page

ILT20 2024: తుస్సుమన్పించిన అంబటి రాయుడు.. కేవలం ఒక్క పరుగుకే

Published Sun, Jan 21 2024 10:54 AM | Last Updated on Sun, Jan 21 2024 11:47 AM

Ambati Rayudu Fails in International League T20 - Sakshi

ఇంటర్నేషనల్‌  టీ20 లీగ్-2024ను టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు పేలవంగా ఆరంభించాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్‌ ఫ్రాంచైజీకి రాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు దారుణంగా విఫలమయ్యాడు.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రాయుడు 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. సికిందర్ రాజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్ 2023 విజయానంతరం అన్ని రకాల క్రికెట్‌కు రాయుడు గుడ్‌బై చెప్పాడు. బీసీసీఐతో పూర్తిగా బంధాన్ని తెంచుకున్న రాయుడు కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023 సీజన్‌లో భాగమయ్యాడు.

అనంతరం ఐఎల్‌ టీ20 టోర్నీ-2024లో ఆడేందుకు ఎంఐ ఎమిరేట్స్‌తో రాయుడు ఒప్పందం కుదర్చుకున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  ముంబై ఎమిరెట్స్‌పై  7 వికెట్ల తేడాతో  దుబాయ్ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది.

ముంబై బ్యాటర్లలో ముహమ్మద్ వసీం(51) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని దుబాయ్ క్యాపిటల్స్ కేవలం  16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దుబాయ్ బ్యాటర్లలో హ్మనుల్లా గుర్బాజ్(89) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 
చదవండి: గొడవకు దిగిన టీమిండియా కెప్టెన్‌.. కొట్టుకునేంత పని చేశారుగా! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement