సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌పై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి | Union Minister Kishan Reddy Slams CM KCR | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌పై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

Published Fri, Nov 4 2022 1:06 AM | Last Updated on Fri, Nov 4 2022 8:21 AM

Union Minister Kishan Reddy Slams CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆవేదన చెందుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తీవ్ర అసహనంతో మీడియా ముందుకు వచ్చిన ‘ఫాంహౌజ్‌ సీఎం’పాత ముచ్చటనే పదేపదే చెప్పారని దుయ్యబట్టారు. బీజేపీ కీలకనేతలైన అమిత్‌ షా, జేపీ నడ్డా, బీఎల్‌ సంతోష్‌ తదితరులపై కేసీఆర్‌ చేసిన అర్థరహితమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

ఈ వీడియోలో ఉన్నవారితో బీజేపీకి సంబంధం లేదని తనతోపాటు తమ పార్టీ నాయకులు పలుమార్లు స్పష్టం చేశారన్నారు. అయినా కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులతో, సొంత పార్టీనేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీసి ఇదే నిజం అని చెప్పేందుకు కేసీఆర్‌ తీవ్రంగా ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ఇది రోజురోజుకూ ఆయనలో పెరుగుతున్న అసహనానికి, అభద్రతా భావానికి నిదర్శనమని పేర్కొన్నా­రు. తెలంగాణలో ప్రజా­స్వా­మ్యాన్ని, ప్రజాస్వా­మ్య వ్యవస్థలను ఖూనీ చేస్తున్న ముఖ్యమంత్రి.. దేశంలో ప్రజాస్వామ్యం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నటించడం హాస్యాస్పదమన్నారు. 

పక్షపాతంగా మునుగోడు ఉప ఎన్నిక  
మునుగోడు ఉప ఎన్నిక ద్వారా టీఆర్‌ఎస్‌ మరోసారి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. పోలీసులను, ఇతర అధికారులను విచ్చలవిడిగా వినియోగించుకుందని విమర్శించారు. ఎన్నికలకు 36 గంటల ముందు స్థానికేతరులు నియోజకవర్గాన్ని ఖాళీ చేసి పోవాలన్న నిబంధనను కూడా టీఆర్‌ఎస్‌ యథేచ్చగా గాలికొదిలేసిందని నిందించారు.

ఈ మేరకు గురువారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి ఓ పక్రటన విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు, పోలీసుల అండదండలతో గ్రామాల్లో యధేచ్చగా తిరుగుతూ డబ్బులు పంచడంతోపాటు, ప్రజలను బెదిరించడం, ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడటం, అరాచకాలు సృష్టించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement