ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్‌ జగన్‌

Published Sat, Jun 8 2024 2:56 AM

TDP Gooons Attack YSRCP: YS Jagan Again Request Governor

చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు 

టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు   

గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ 

బాధితులకు వైఎస్సార్‌సీపీ తోడుగా నిలుస్తుందని భరోసా  

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందని మండిపడ్డారు. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని, యంత్రాంగం మొత్తం నిరీ్వర్యం అయిపోయిందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని, పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని చెప్పారు.

ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్సిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బ తీసి, కేవలం మూడు రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోందని, గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, తన అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌సీపీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్టు చేశారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement