ఎంపీగా శశి థరూర్‌ పోటీ ఇదే చివరిదా! Shashi Tharoor Hints At 2024 Polls Being His Last Outing | Sakshi
Sakshi News home page

ఎంపీగా శశి థరూర్‌ పోటీ ఇదే చివరిదా!

Published Fri, Dec 29 2023 10:47 AM | Last Updated on Fri, Dec 29 2023 12:02 PM

Shashi Tharoor Hints At 2024 Polls Being His Last Outing - Sakshi

తిరువనంతపురు: కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌, ఎంపీ శశి థరూర్‌ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం లోక్‌ సభ స్థానంలో యువత అవకాశం కల్పిస్తానని అన్నారు. దీంతో ఆయన రాబోయే సార్వత్రిక పార్లమెంట్‌ ఎన్నికలే చివరివి కానున్నాయా అని కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. 

తిరువనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శశి థరూర్‌ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతంగా ఉండలేరని అన్నారు. ఒకానొక​ సమయం వస్తుందని అప్పుడు తప్పకుండా వైదొలగి యువతకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలన్నారు. ఇదే తన ఆలోచనని తెలిపారు.

ఇటీవల ఓ టీవీ ఛానెల్‌లో 2024 పార్లమెంట్‌ ఎన్నికలు తన చివరి ఎన్నికలని శశి థరూర్‌ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని గురువారం మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ అలా చెప్పలేదు. 2024 పార్లమెంట్‌ ఎన్నికలు నా చివరి ఎన్నికలని అనలేదు’ అని 67 ఏళ్ల శశి థరూర్‌ స్పష్టం చేశారు.

ఆయిన మళ్లీ తిరువనంతపురం లోక్‌సభ సెగ్మెంట్‌ నుంచే పోటీ చేస్తానని తెలిపారు. శశి థరూర్‌ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో తిరువనంతపురంలో ఎంపీగా గెలుపొందారు. సమీప అభ్యర్థి రామచంద్ర నాయర్‌(సీపీఐ)పై 95వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదే విధంగా 2014, 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి శశి థరూర్‌ గెలుపొందారు. 

చదవండి: హఫీజ్‌ సయీద్‌ను అప్పగించండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement