మంత్రి పొన్నంకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ | MLC Kavitha Counter To Ponnam Prabhakar Over Jyotiba Phule Statue | Sakshi
Sakshi News home page

పూలే విగ్రహం ఏర్పాటుకు అభ్యంతరం ఏంటీ?

Published Mon, Jan 22 2024 5:25 PM | Last Updated on Mon, Jan 22 2024 5:35 PM

MLC Kavitha Counter To Ponnam Prabhakar Over Jyotiba Phule Statue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని ఎమ్మెల్సీ కవిత ‘ఎక్స్‌’ ట్విటర్‌ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మండిపడ్డారు. భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా? అని నిలదీశారామె. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా? స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అని అన్నారు.

అసెంబ్లీ ఆవరణలో పూలే  విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామని కవిత తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల కోసం, సంకుచిత మనస్తత్వంతో, ఈ మహాకార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నామన్నారు. ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుపునే కాకుండా యావత్‌ తెలంగాణ ప్రజల తరుపున వినమ్రంగా మరోసారి కోరుతున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

చదవండి: ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్సీలుగా మహేష్‌, బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement