కవిత ఇంట్లో సోదాలు.. కేసీఆర్‌ ఆకస్మిక భేటీ KCR Meeting With KTR Harish Santhosh Over raids At Kavitha House | Sakshi
Sakshi News home page

కవిత ఇంట్లో సోదాలు.. కేసీఆర్‌ ఆకస్మిక భేటీ

Published Fri, Mar 15 2024 4:41 PM | Last Updated on Fri, Mar 15 2024 5:39 PM

KCR Meeting With KTR Harish Santhosh Over raids At Kavitha House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుక్రవారం పార్టీ నేతలు హరీష్‌ రావు, కేటీఆర్‌, సంతోష్‌ కుమార్‌లతో భేటీ అయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద కొనసాగుతున్న ఐటీ, ఈడీ సోదాలపై ఆరా తీశారు. ఇక హైదరాబాద్‌లో ఒకేసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, కవిత నివాసంలో సోదాలు జరగుతుండటం ఆసక్తికరంగా మారింది. 

ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ శుక్రవారం సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. మూడు గంటలకుపైగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళా అధికారులతో కలిపి మొత్తం 12 మంది అధఙకారులు సోదాలు జరుపుతున్నారు.  కవిత రెండు ఫోన్లును ఈడీ అధికారులు  సీజ్‌ చేశారు. ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేశారు. కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర బలగాలు కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు.

సోదాలు జరుగుతున్న కవిత ఇంటికి ఆమె అడ్వకేట్‌ భరత్‌ చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు. ఈడీ సోదాలు జరుగుతున్నాని, ఇప్పుడు అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.  తనిఖీలు మరికొంత సమయం కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈడీ సోదాలు ముగిసిన తర్వాత సమాచారం ఇస్తామని, అప్పుడు లోపలికి పిలుస్తామని కేంద్ర బలగాలు చెప్పాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement